Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ నదికి వరద నీటి తాకిడి పెరుగుతోంది. ఉపరితలాల నుంచి భారీగా వరద వస్తుండటంతో మూసీ ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి, నీటి వివరాలను అధికారులు విడుదల చేశారు.
తెలంగాణలోని Musi Project (మూసీ రిజర్వాయర్) పూర్తి స్థాయి నీటి మట్టం (FRL) 645 అడుగులు కాగా, ఆ నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు. నగరంలో కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి నిలకడగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా గరిష్ఠ స్థాయికి చేరువవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి మట్టం 638 అడుగులకు చేరగా, అందులో నీటి నిల్వ 2.88 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 20 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, నీటిమట్టాన్ని నియంత్రించేందుకు అధికారులు దిగువకు 727 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నీటిని విడుదల చేస్తున్నారు. వర్ష సూచనల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను, నదీ తీర ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!