The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్? మరోసారి కలవనున్న దసరా కాంబో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: ‘దసరా’తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఇప్పుడు మరోసారి ‘ది ప్యారడైజ్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ భారీ యాక్షన్ కోసం ఆడియన్స్ క్రేజీగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, ఇప్పుడు మరో ఆసక్తికరమైన హల్చల్ చేస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ లో కనిపించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ షూటింగ్ కొనసాగుతోంది. నిర్మాణ పనులు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకోవడంతో సినిమా విడుదల ఆలస్యమైంది. అయితే ఈ గ్యాప్‌లో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన అప్డేట్లు బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, సినిమాలోని ఓ ప్రత్యేక గీతం కోసం కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ వార్త అయితే హాట్ టాపిక్ గా మారుతోంది.
కీర్తి సురేష్‌కు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మంచి అనుబంధం ఉంది. ‘దసరా’లో వెన్నెల పాత్రతో ఆమె అందుకున్న ప్రశంసలు అన్ని ఇన్ని కావు. అదే సమయంలో నానితో కూడా ఆమె ‘నేను లోకల్’లో కలిసి నటించింది. ఈ ఇద్దరితో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఈ స్పెషల్ సాంగ్‌కు కీర్తి వెంటనే అంగీకరించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అంతేకాదు, ఈ పాటకు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తుండటంతో, ఇది సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ఐటమ్ సాంగ్ శ్రీకాంత్ ఓదెల ఎంతో స్టైలిష్‌గా, కథకు అనుసంధానమయ్యేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. కీర్తి సురేష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటకు హైప్ తీసుకురానుందని చిత్ర బృందం విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇక ‘ది ప్యారడైజ్’లో నానికి జోడీగా కయాదు లోహర్ నటిస్తుండగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక ప్రతినాయకుల పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, భారీ స్థాయి నిర్మాణ విలువలతో సినిమాను రూపొందిస్తున్నారు. మరోవైపు కీర్తి సురేష్ కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తెలుగులో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రౌడీ జనార్దన’తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘ది ప్యారడైజ్’లో స్పెషల్ సాంగ్ చేస్తారనే వార్త నిజమైతే అభిమానులకు ఫుల్ మీల్స్ అయితే గ్యారెంటీగా ఉంటుంది. ఇక సినిమా విడుదల తేదీపైనా స్పష్టత రావాల్సి ఉన్నా, వరుస అప్డేట్ లు మాత్రం సినిమా మీద అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. ఇప్పటికే ‘ఆయా షేర్’ సాంగ్ యుట్యూబ్ లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి హల్చల్ చేయగా, ఇప్పుడు కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ లో ఎంట్రీ ఇస్తుందనే విషయం బయటికి రావడంతో అభిమానులు మాత్రం మూవీ చూసేందుకు ఫుల్ జోష్ మీద ఉన్నారు.
- Tags
- cinema
- keerthy suresh
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!