200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR Robot Phone: హానర్ (HONOR) నుండి కొత్త ఫ్లాగ్షిప్ హానర్ రోబోట్ ఫోన్ (HONOR Robot Phone)ను ఆగస్టు 12న చైనాలో అధికారికంగా విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందే ఇప్పటికే అన్ని ఛానళ్లలో కలిపి 2 లక్షలకు పైగా ప్రీ-ఆర్డర్లు నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. దీన్ని బట్టి ఈ ఫోన్‌పై ఎంత భారీ అంచనాలు ఉన్నాయో అర్థమవుతుంది. ఈ ఫోన్‌తో కేవలం హార్డ్‌వేర్‌పైనే కాకుండా AI ఆధారిత ఇమేజింగ్, ప్రొఫెషనల్ సినిమా స్థాయి వీడియో రికార్డింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఫోన్ లాంచ్ కానుంది.
HONOR AiMAGE టెక్నాలజీ:
ఈ ఫోన్లో హానర్ కొత్తగా అభివృద్ధి చేసిన AiMAGE Architectureను అందిస్తోంది. ఇది మూడు స్థాయిల్లో పనిచేస్తుంది. అవేంటంటే..
* చిప్ లెవెల్ (Chip Level): AI ఆధారిత కొత్త Image Signal Processor (ISP), మెరుగైన పిక్సెల్ సెన్సింగ్ టెక్నాలజీ.
* డివైస్ లెవెల్ (Device Level): టైటానియం అల్లాయ్ 3-యాక్సిస్ గింబల్, రియల్‌టైమ్ AI స్టెబిలైజేషన్.
* క్లౌడ్ లెవెల్ (Cloud Level): RAW ఇమేజ్ ప్రాసెసింగ్, AI ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, క్లౌడ్ ఆధారిత ఫోటో ఎడిటింగ్.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
గింబల్ టెక్నాలజీ:
హానర్ ఈ ఫోన్లో పరిశ్రమలోనే అత్యంత చిన్న 4DoF గింబల్ (Gimbal) సిస్టంను అమర్చారు. ఇందుకోసం సాధారణ మోటార్లతో పోలిస్తే 70% చిన్న మైక్రో మోటార్ ను ప్రత్యేకంగా రూపొందించింది. అలాగే 2800MPa బలం కలిగిన హై-పర్ఫార్మెన్స్ మెటీరియల్‌తో ఫోన్ బాడీని తయారు చేసింది.
ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్:
HONOR Robot Phoneలో 6.3 నుంచి 6.4 అంగుళాల పరిమాణంలో 1.5K రిజల్యూషన్ కలిగిన ఫ్లాట్ డిస్ప్లేను అందించనున్నారు. నాలుగు వైపులా సమానమైన బెజెల్స్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. పనితీరు కోసం Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అలాగే HONOR స్వయంగా అభివృద్ధి చేసిన Yuguang H1 Image Processing చిప్ ఈ ఫోన్లో తొలిసారిగా అందుబాటులోకి రానుంది. AI ఫీచర్ల పరంగా YOYO On-Device AI మోడల్ ను అందిస్తున్నారు.
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్:
ఫోటోగ్రఫీ కోసం HONOR Robot Phoneలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. ఇందులో 1/1.28-అంగుళాల CMOS సెన్సార్, f/1.6 అపర్చర్, 23mm ఫోకల్ లెంగ్త్‌తో ఉన్న 200MP గింబల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి తోడు 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, అధిక ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో కూడిన 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. వీడియో రికార్డింగ్ కోసం ప్రముఖ సినిమా కెమెరా తయారీ సంస్థ ARRI టెక్నాలజీని ఇందులో సమీకరించారు. ARRI Log-C3 Encoding సపోర్ట్‌తో పాటు ప్రొఫెషనల్ సినిమా స్థాయి వీడియో రికార్డింగ్ అనుభవాన్ని ఈ ఫోన్ అందించనుంది. ప్రొఫెషనల్ సినిమా కెమెరాల తయారీ సంస్థ ARRIతో HONOR భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఫోన్లో తొలిసారిగా ARRI Log-C3 Encodingకు సపోర్ట్ ఇవ్వనుంది.
లాంచ్ ఎప్పుడు.?
ఆగస్టు 12న చైనాలో అధికారికంగా విడుదల చేయనున్నారు. అదే రోజు ధర, స్టోరేజ్ వేరియంట్లు, గ్లోబల్ లాంచ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. AI ఇమేజింగ్, 200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా ఫీచర్లతో ఈ ఫోన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్ సృష్టించే అవకాశముంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!