Delhi: ఢిల్లీలో ఘోరం.. ఫ్లైఓవర్ సమీపంలో మహిళ శరీర భాగాలు లభ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman’s chopped body parts found near flyover in east Delhi: దేశ రాజధానిలో మహిళ హత్య కలకలం సృష్టిస్తోంది. ఏడాది క్రితం జరిగిన శ్రద్ధా వాకర్ ఘటనను మరువక ముందే.. అదే తరహా ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీలో గల ఫ్లైఓవర్ సమీపంలో ముక్కలు చేయబడిన మహిళ శరీర భాగాలు లభ్యమయ్యాయి. ఉదయం 9.15 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. ఫ్లైఓవర్ సమీపంలో పలుచోట్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాధితురాలి శరీర భాగాలు, తల వంటి కొన్ని భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన శరీర భాగాలను వెలికితీసేందుకు పోలీసు బృందం ఫ్లైఓవర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తోంది. మహిళ ఎవరూ, ఆమెను ఎందుకు, ఎవరు హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిగిలిన శరీర భాగాల కోసం పలు బృందాలు కాలనీలోని పలు చోట్ల వెతుకుతున్నాయి.
Also Read: Minor Lovers Suicide: సిద్దిపేటలో తీవ్ర విషాదం.. ఉరేసుకుని మైనర్ ప్రేమ జంట ఆత్మహత్మ
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
గతేడాది 20 ఏళ్ల శ్రద్ధా వాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీనా పూనావాలా ఢిల్లీ అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఈ హత్య కేసు దేశంలో సంచలనంగా మారింది. కొద్దికాలంగా సహజీవనం సాగిస్తున్న వీరు తరచు గొడవ పడేవారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ ఒత్తిడి చేయడంతోనే ఆమెను హత్య చేసినట్టు చెబుతున్నారు. నేరం బయటకు పొక్కకుండా శ్రద్ధ వాకర్ మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిడ్జిలో పెట్టి, 18 రోజుల పాటు వాటిని ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో తాను శ్రద్ధను హత్య చేసినట్టు పాలిగ్రాఫ్, నార్కో టెస్ట్ పరీక్షలో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా అంగీకరించాడు. దీంతో ఈ కేసు కొలిక్కి వచ్చింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!