దేశ రాజధాని ఢిల్లీ మరో దారుణ ఘటనతో ఉలిక్కి పడింది.. మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.. ప్రభుత్వం ఎంతగా కఠిన చర్యలు అమలు చేస్తున్నా కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. అత్యాచారాలు చెయ్యడం ఒక ఎత్తు అయితే హత్యలు చేసి ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు.. ఇటీవల ఢిల్లీలో శ్రద్దా కేసు జనాలను వణికించింది.. ఇప్పుడు అదే తరహాలో మరో కేసు వెలుగు చూసింది.. ఓ మహిళను అతి దారుణంగా చంపి ముక్కలు ముక్కలుగా చేసి కవర్లలో శరీర భాగాలను వేసిన ఘటన వెలుగు చూసింది..గీతా కాలనీలోని ఫ్లైఓవర్ సమీపంలో ఓ మహిళ మృతదేహం ముక్కలుగా పడి ఉంది. బుధవారం ఉదయం వచ్చిన సమాచారం ప్రముఖ శ్రద్దా హత్య కేసును మళ్లీ గుర్తుకు తెచ్చింది.
మృతదేహంలోని పలు ముక్కలు లభించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు..అవయవాలు చాలా చోట్ల చెల్లాచెదురుగా పడ్డాయి. మహిళను ఇంకా గుర్తించలేదణి చెబుతున్నారు.. ఈ ఘటన వెలుగు చూసి ఒక రోజు అయ్యింది..జమున ఖాదర్ ప్రాంతంలో రెండు ముక్కలుగా నరికిన మృతదేహం లభ్యమైందని డీసీపీ నార్త్ సాగర్ సింగ్ కల్సి తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎఫ్‌ఎస్‌ఎల్, క్రైమ్ టీమ్ దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దశలో మృతురాలి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది. కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. పరిసర ప్రాంతాల్లోనూ విచారణ చేస్తున్నారు. గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద మృతదేహం లభ్యమైంది. శరీర భాగాలు 2 సంచులలో కనిపించాయి. ఒకదానిలో తల, మరొక దానిలో ఇతర శరీర భాగాలు ఉన్నాయి. పొడవాటి జుట్టును బట్టి మృతదేహం మహిళది అని తెలుస్తోంది..
శరీరం కుళ్ళిన స్థితిలో కనిపించింది అంటే హత్య జరిగి రోజులు గడుస్తుంది..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. ఇకపోతే గతంలో కూడా అలాంటి కేసు మరొకటి వెలుగులోకి వచ్చింది. గత వారం పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వెనుక అడవుల్లో కుళ్ళిపోయిన మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. మృతదేహం మహిళదేనా లేక పురుషుడిదా అనేది ఇంకా తెలియరాలేదు.. డెడ్ బాడీ పై ఉప్పు ఉండటంతో గుర్తించలేక పోయినట్లు తెలుపుతున్నారు.. మొన్న శ్రద్దా కేసు.. ఇలా వరుస హత్యలు జరగడం పై ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు..