Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aakasamlo Oka Tara: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ను చిత్రబృందం విడుదల చేసింది. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మెలోడీ సాంగ్‌ను విడుదల చేస్తూ మేకర్స్ ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయం అవుతుండగా, శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకు ప్రముఖ గేయరచయిత శ్రీమణి అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు. గాయని రమ్య బెహరా తన గాత్రంతో పాటకు మరింత అందం తీసుకొచ్చారు. ‘చిట్టి చిట్టి చీమ’ అంటూ జీవితంలో పెద్ద లక్ష్యాలను సాధించాలనే పట్టుదల, కష్టపడే తత్వాన్ని ఈ పాటలో అందంగా చూపించారు.
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
లిరికల్ వీడియోలో ఆస్ట్రోనాట్ కావాలనే కలతో గ్రామం నుంచి నగరానికి వచ్చిన యువతి ప్రయాణాన్ని, ఆమె ఆశయాలకు హీరో అండగా నిలిచే విధానాన్ని చాలా బాగా చూపించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు ఫస్ట్ సింగిల్‌తో అంచనాలు మరింత పెరిగాయి. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి విజయాల తర్వాత మరో హృదయాన్ని హత్తుకునే కథతో దుల్కర్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఈ పాట స్పష్టం చేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ‘ఆకాశంలో ఒక తార’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!