హైదరాబాద్ లో ఆరు రోజుల క్రితం మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగూడలో నల్లటి ప్లాస్టిక్ కవరులో మొండెం లేని తలను పోలీసులు గుర్తించారు. కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలి సోదరి, బావ గుర్తించడంతో ఆ మృతదేహాం.. కేర్ హాస్పిటల్లో నర్సుగా పనిచేసే ఎర్రం అనురాధదిగా పోలీసులు నిర్ధారించారు.
Car theft: ఓ కారు దొంగతనం ముగ్గురు యువకులను తీవ్ర ఇబ్బందులు పెట్టింది. డబ్బులు సంపాదించాలనుకున్న ముగ్గురు యువకులు కారును దొంగిలించి, చివరకు పట్టుబడ్డారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. కారునైతే దొంగిలించారు కానీ.. ఆ ముగ్గురిలో ఒక్కరికి కూడా కార్ డ్రైవింగ్ రాదు. సక్సెస్ ఫుల్ గా దొంగతనం చేశారు కానీ.. తమకు డ్రైవింగ్ రాదన్న విషయాన్ని మరిచిపోయారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు.
హైదరాబాద్ లోని చాదర్ఘాట్లో కొద్దిరోజుల క్రితం మొండెం లేని తల లభ్యమైన వ్యవహారం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తలకు సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆ తల కేర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న నర్సు ఎర్రం అనూరాధగా పోలీసులు గుర్తించారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మధురలో 75 ఏళ్ల పూజారిని గుర్తు తెలియన దుండగులు కొట్టి చంపారు. కాళ్లు, చేతులు కట్టేసి కొట్టి చంపారు. చనిపోయిన వ్యక్తిని హరిదాస్ మహారాజ్ గా గుర్తించారు. కాళ్లు, చేతులను వెనక్కి కట్టేసి, తలపై ఇటుకతో మోది హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికను మధ్యవయస్కుడైన వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేందుకు రూ.4.50 లక్షలకు ఆ చిన్నారి విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు.
గుంటూరు నగరంపాలెం ఎస్సై రవితేజను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ ఎస్సై రవితేజ తనను మోసగించారంటూ ఓ యువతి మూడు రోజుల క్రితం నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Uttar Pradesh: ముగ్గురు వ్యక్తులు తన భార్య, 14 ఏళ్ల కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ లో ఈ ఘటన జరిగింది.