AK47: వెంకీ కూతురిగా యువినా.. ‘AK47’ నుంచి మరో ఫన్ క్యారెక్టర్ రివీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AK47 : విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47) సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే చిట్టిబాబు పాత్రలో వెంకటేష్‌ను, ఆయన భార్య స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టిని పరిచయం చేసిన చిత్ర బృందం, ఇప్పుడు కుటుంబంలోని మరొక క్యారెక్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈసారి వెంకటేష్ కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రలో యువ నటి యువినా పార్థవిని పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
కొత్త ప్రోమోలో వెంకటేష్, రఘుబాబు ఇంటి విషయాలపై మాట్లాడుకుంటూ కనిపిస్తారు. అదే సమయంలో ఉత్సాహంగా లోపలికి వచ్చిన సంపూర్ణ, తాను మరోసారి ప్రేమలో పడ్డానని చెబుతుంది. వెంటనే ఏదో ఊహించిన చిట్టిబాబు, ఈసారి కారు డ్రైవర్ తోనా ? లేదా మెకానిక్‌తోనే ప్రేమలో పడ్డావా ? అని సరదాగా ప్రశ్నిస్తాడు. ఆమె అవుననే సమాధానం చెప్పడంతో ఈ గ్లింప్స్ నవ్వులు పూయించేలా ముగుస్తుంది. ఒక్కో గ్లింబ్స్ ను మేకర్స్ రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇంట్లో ఎప్పుడూ కొనసాగే గందరగోళాన్ని చమత్కారంగా చూపించడంతో ప్రేక్షకులు కూడా ఈ గ్లింప్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వెంకటేష్, శ్రీనిధి శెట్టి పాత్రల ప్రోమోలు ఆకట్టుకోగా, ఇప్పుడు సంపూర్ణ పాత్ర కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి కొత్త గ్లింప్స్‌తో సినిమా వినోదంగా ఉండబోతోందనే నమ్మకాన్ని మేకర్స్ మరింత స్ట్రాంగ్ గా చూపిస్తున్నారు.
Also Read
- Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
- Renu Desai: ‘బాలు’ ప్యాంట్‌పై రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్.. రేటు అప్పట్లోనే 75K అంట!
- Pooja Hegde: బాయ్స్.. పూజా హెగ్డే మనసు గెలవాలంటే ఇలా ఉండాలట!
- Jayasudha: ‘మీరు - నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్‌కు జయసుధ క్రేజీ ప్రపోజల్
ఇక ఈ మూవీలో వెంకటేష్, శ్రీనిధి శెట్టితో పాటు నివేదా పేతురాజ్, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, దర్శకత్వం అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వరుసగా విడుదలవుతున్న గ్లింప్స్ సినిమాపై మంచి హైప్‌ను తీసుకొచ్చాయి. ఇంకా మిగిలిన ఫ్యామిలీ సభ్యుల పాత్రలను కూడా ఇదే తరహాలో పరిచయం చేయనున్నట్లు చిత్ర బృందం సంకేతాలు ఇస్తోంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47) చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Fake Call Centre Scam: అమెరికా పౌరులను మోసం చేస్తున్న భారీ ఫేక్ కాల్ సెంటర్ రాకెట్ గుట్టురట్టు..
-
Archana Jois: KGFలో రాఖీ తల్లిగా కన్నీళ్లు పెట్టించి, ఇప్పుడు తెలుగులో గ్లామరస్ హీరోయిన్గా ఎంట్రీ
-
Ramayana : రామాయణ’కి దిల్ రాజు రివ్యూ
-
Diwali Firecracker Smoke: బాణసంచా పొగతో తలనొప్పి వస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..