Maharashtra: ప్రస్తుతం సోషల్ మీడియాలు చిన్నారులపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తెలిసీ తెలియన ప్రాయంలో స్నేహం, లవ్ వంటివి మైనర్లను ప్రమాదంలోకి నెడుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన 11 ఏళ్ల బాలికకు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. మాటామాటా కలిపి ఉత్తర్ ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వచ్చేలా సదరు బాలికను నిందితుడైన వ్యక్తి ప్రేరేపించాడు.
Delhi Murder Case: ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక సాక్షి హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాహిల్ అనే 20 ఏళ్ల వ్యక్తి అత్యంత క్రూరంగా సాక్షిని 20 కన్నా ఎక్కువ సార్లు పొడిచి, బండరాయితో మోది హత్య చేశారు.
Jharkhand: జార్ఖండ్లోని మహేశ్పూర్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ తండ్రీకొడుకులు కలిసి అల్లుడిని పట్టపగలు నడిరోడ్డుపై పొడిచి దారుణంగా హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. నిజానికి ఈ మొత్తం కేసు మహేశ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాస్మతి గ్రామానికి సంబంధించినది.
Odisha: భార్యపై అనుమానంతో పసిపాప ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు ఓ కసాయి తండ్రి. బిడ్డకు పురుగుమందు ఇంజెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం పాప ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగింది. పసికందును సోమవారం బాలాసోర్లోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేర్చగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. మంగళవారం వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాకపోవడంతో కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు జరుపుతున్నట్లు బాలసోర్ ఎస్పీ సాగరిక నాథ్ వెల్లడించారు.
క్యూ నెట్ మల్టిలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్నారు అని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పీరమిడ్ స్కీమ్ పేరుతో బోగస్ కంపనీ తో అమాయకులను టార్గెట్ చేశారన్నారు.
ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకున్నా ఎంత అవగాహన కార్యక్రమాలు చేపట్టిన వాహనదారులు మాత్రం రోడ్డు నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని పెట్రోల్ బంక్ లో డీజీల్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు వెళ్లిన ముగ్గురు కార్మికులు మృతి చెందారు.. ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.. సోమవారం నాడు ముగ్గురు కార్మికులు ట్యాంకును క్లీన్ చెయ్యడానికి అందులోకి దిగారు..ట్యాంకు ను క్లీన్ చేస్తున్న సమయంలో విషవాయువులు వెలువడటంతో ఊపిరి ఆడక ముగ్గురు చనిపోయారు.. లోపలికి వెళ్లిన వాళ్ళు ఎంతసేపైనా రాకుంటే అగ్నిమాపక సిబ్బందికి బంక్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. అగ్నిమాపక సిబ్బంది రెండు…