Retired Officer Honey Trapped By A Girl In Adilabad: హనీ ట్రాప్ వ్యవహారాల గురించి అందరికీ తెలిసిందేగా! ముందుగా కొందరు దుండగులు ఒక ముఠాగా ఏర్పడి, బాగా డబ్బున్న వ్యక్తుల్ని టార్గెట్ చేస్తారు. అమ్మాయిని రంగంలోకి దింపి, ఆ బడా బాబుల్ని ఆమె చేత ట్రాప్ చేస్తారు. న్యూడ్ వీడియోలు గానీ, ఫోటోలు గానీ తీసుకొని.. ఆపై అందరూ ఒకేసారి ఎగబడతారు. పోలీసులమంటూ దాడి చేసి, ఆ వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో దోచుకుంటారు. ఇలాంటి సంఘటన లేటెస్ట్‌గా ఆదిలాబాద్‌లో చోటు చేసుకుంది. ఒక రిటైర్డ్ ఉద్యోగికి ఓ అమ్మాయి ద్వారా ఎర వేసి, న్యూడ్ ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశారు. అతని నుంచి గట్టిగానే డబ్బులు వసూలు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Crime News: డేటింగ్ యాప్‌లో పరిచయం.. మహిళపై సామూహిక అత్యాచారం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉంటున్న ఒక రిటైర్డ్ ఉద్యోగి హ్యాపీగా తన రిటైర్మెంట్ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ.. ఆయన జీవితంలోకి అనుకోకుండా ఒక అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఆమె మాయమాటలకు పడిపోయాడు. మీరంటే చాలా ఇష్టమని, మీతో శారీరక సుఖం పొందాలని ఉందంటూ.. ట్రాప్‌లో పడేసింది. ఈ వయసులో తనకు కత్తిలాంటి అమ్మాయి దొరకడంతో.. పాపం ఆ రిటైర్డ్ ఉద్యోగి టెంప్ట్ అయ్యాడు. తనకు శారీరకంగా తోడ్పడుతుందని భావించాడు. ఇంకేముంది.. ఆ యువతి ఒకరోజు తన రూంకి తీసుకెళ్లింది. లోపలికి వెళ్లాక.. బట్టలన్నీ విప్పి, ఆయన న్యూడ్ ఫోటోలు తీసింది. అంతే, ఆ వెంటనే ఆ యువతి తన అసలు రూపం బయటపెట్టింది. ఫోటోలో తీసిన వెంటనే, తన ముఠా సభ్యులకు సమాచారం అందించింది.
Boyfriend Crime: దారుణం.. ప్రేమించిన యువతిని దూరం చేస్తున్నారని..
తమకు మెసేజ్ అందిన వెంటనే.. ముఠా సభ్యులు రూంలోకి చొరబడ్డారు. ఒకరు లవర్‌గా యాక్ట్ చేయగా.. మిగతా వాళ్లు షీ టీమ్ నుంచి వచ్చామని వాళ్లు అబద్ధం చెప్పారు. ఆ దెబ్బకు రిటైర్డ్ ఉద్యోగి వణికిపోయాడు. తనకే పాపం తెలియదని, తనని విడిచిపెట్టాలని కోరాడు. తమకు రెండు లక్షలు ఇస్తేనే విడిచిపెడతామని, లేకపోతే పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తామని వాళ్లు బెదిరించారు. అప్పుడు తన వద్ద ఉన్న నగదుతో పాటు సెల్‌ఫోన్, బంగారం ఇచ్చి.. అక్కడి నుంచి ఆయన తప్పించుకొని వచ్చాడు. అనంతరం పోలీసుల్ని ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ రిటైర్డ్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో హనీ ట్రాప్ ముఠాలోని ఆరుగుని సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు.