A husband Killed His Wife Out Of Suspicion In Anakapalle District: అనుమానం పెనుభూతం లాంటిది. అది ఒక్కసారి ఎవరినైనా ఆవహించిందంటే.. ఇక అంతే సంగతులు. ఊహించని దారుణాలు చోటు చేసుకుంటాయి. అది హత్యలు కూడా చేయిస్తుంది. ఈ అనుమానం కారణంగానే.. ఎన్నో కాపురాలు కూలిపోవడం, కట్టుకున్న వారినే చంపుకోవడం వంటి సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. ఇప్పుడు తాజాగా అలాంటి దారుణమే ఒకటి వెలుగులోకి వచ్చింది. తన భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. అత్యంత కిరాతకంగా ఆమెని హతమార్చాడు. ఆపై తాను పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Vaishnavi Chaitanya: ‘బేబీ’ని మెచ్చిన ఇస్మార్ట్ రామ్.. వాటిని పట్టుకొని గాల్లో తేలిపోతున్న వైష్ణవి
అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తోటాడ ఎస్సీ కాలనీ చెందిన కొత్తలంక దీనకుమారి(28)కి కొంతకాలం క్రితం నూక అప్పారావుతో వివాహం అయ్యింది. మొదట్లో వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది. ఇతరులతో తన భార్య కాస్త సన్నిహితంగా మాట్లాడినా, భర్త ఏమాత్రం సహించేవాడు. అప్పటికప్పుడే ఆమెపై కోప్పడేవాడు. ఫలానా వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరం ఏముందంటూ మందలించేవాడు. భర్త ప్రవర్తనతో ఖంగుతిన్న భార్య.. భర్తకి నచ్చినట్టు తనని తాను మార్చుకోవడానికి ప్రయత్నించింది. అయినా భర్తలో మార్పు రాలేదు. ఆమెను నిత్యం అనుమానిస్తూ ఉండేవాడు. రానురాను ఆ అనుమానం పెనుభూతంగా మారింది. దీంతో.. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
Homeguard Harassment: కీచక హోంగార్డ్.. పోలీస్ స్టేషన్‌లోనే వివాహితపై..
ఇటీవల కూడా అప్పారావు, కుమారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపాద్రిక్తుడైన అప్పారావు.. చీరతో ఉచ్చు బిగించి కుమారిని హతమార్చాడు. భార్యని చంపిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. అనుమానంతో తన భార్యని తానే చంపానని పోలీసు విచారణలో అంగీకరించాడు. అప్పారావు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కుమారి తరఫు బంధువులు అప్పారావుకి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.