Urination Case: కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో దళితుడి ముఖంపై మూత్ర విసర్జన చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తాజాగా మరోసారి అలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. స్పృహ తప్పి నేలపై పడి ఉన్న వ్యక్తిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నాయి. అంతేకాదు ఆమెను పదే పదే దుర్భాషలాడుతూ తన్నుతూ ఉంటాడు. ఇప్పుడు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అతనిపై హత్యాయత్నం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వీడియో మూడు నాలుగు నెలల నాటిదని పోలీసులు చెబుతున్నారు.
TW: Disturbing video, abusive content
In UP's Agra, a purported video of a man urinating on the victim lying semi unconscious on the ground and bleeding profusely has surface on social media. The video is claimed to be 3-4 months old. Main accused has been identified as Aditya. pic.twitter.com/ktSNDIqrSV
— Piyush Rai (@Benarasiyaa) July 24, 2023
Read Also:Ambulance Overturned: వనస్థలిపురంలో డివైడర్ ను ఢీ కొట్టి అంబులెన్స్ బోల్తా.. డ్రైవర్ మృతి
ఈ 30 సెకన్ల వీడియోలో యువకుడు ఈ వ్యక్తిని తలపై తన్నడం కూడా కనిపిస్తుంది. యువకుడు, అతని స్నేహితులు బాధితుడిని దుర్భాషలాడారు. ఈ వీడియో విస్తృతంగా వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ వీడియో మూడు-నాలుగు నెలల నాటిదని పోలీసులు తెలిపారు. ఆగ్రా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సిటీ) సూరజ్ కుమార్ రాయ్ నిందితులలో ఒకరిని అరెస్టు చేశారు. ఇతరుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారని ట్విట్టర్‌లో వీడియో ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై బాధితుడు ఆగ్రాలోని ఏ పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేయలేదని విచారణ అనంతరం పోలీసులకు తెలిసింది. ఆ వీడియో మూడు-నాలుగు నెలల నాటిదని, నిందితుడిని ఆదిత్యగా గుర్తించారు. ఆదిత్యను అరెస్టు చేశారు. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 307 (హత్య ప్రయత్నం), ఇతర నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయబడింది.
ఈ వీడియోలో ప్రమేయం ఉన్న ఇతర యువకులను కూడా విచారిస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. అరెస్టు చేసిన యువకుడు ఆదిత్యను కోర్టులో హాజరుపరిచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కింద పడి ఉన్న యువకుడు రక్తంలో తడిసి స్పృహతప్పి కనిపించడం ఈ వీడియోలో చూడవచ్చు.
Read Also:Lizard in Mouth: నోట్లో బల్లిపడి బాలుడు మృతి.. అసాధ్యం అంటోన్న జంతు నిపుణులు!