Boyfriend Attacked On Girlfriends Mother And Father In Law For Rejecting Him: పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది. తాను ప్రేమించిన యువతిని దూరం చేస్తున్నారన్న కోపంతో.. తన ప్రియురాలి తల్లి, తాతయ్యలపై ఓ యువకుడు దాడి చేశాడు. ఆపై ఆ యువతిని బెదిరించి తీసుకెళ్లిపోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆకివీడు మండలం సిద్దాపురంలోని కూరపాకకు చెందిన ఇమ్రాన్ అనే యువకుడు అదే గ్రామానికి సయ్యద్ రుక్సానా సుల్తానా అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ యువతి కూడా అతడ్ని ప్రేమించడంతో.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇద్దరి ఇష్టాలు కలవడం, గాఢంగా ప్రేమించుకోవడంతో.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ.. రుక్సానా కుటుంబ సభ్యులు మాత్రం వీరి ప్రేమని అంగీకరించలేదు. ఇమ్రాన్‌కి దూరంగా ఉండాలని రుక్సానాకు సూచించారు. అంతేకాదు.. ఇమ్రాన్‌ని కలవనివ్వకుండా రుక్సానాని ఇంట్లోనే బంధీగా ఉంచారు.
Harmanpreet Kaur Suspended : టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై నిషేధం!
ముఖ్యంగా.. రుక్సానా తల్లి, తాత మహమ్మద్ బాబర్ వారిద్దరి ప్రేమకు ముందు నుంచి వ్యతిరేకం తెలుపుతూ వస్తున్నారు. దీంతో.. ఇమ్రాన్ ఆ ఇద్దరిపై పగ పెంచుకున్నాడు. తన ప్రేమకు అడ్డుగా ఉన్నారని.. వారిని అంతమొందించాలని అనుకున్నాడు. ప్లాన్ ప్రకారం.. ఇమ్రాన్ ఒక ఇనుపరాడ్డుని చేత పట్టుకొని, నేరుగా తన ప్రియురాలు రుక్సానా ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె తల్లి, తాతయ్యలతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే తనతోపాటు తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో ఆ ఇద్దరిపై దాడి చేశాడు. అప్పుడు ‘దయచేసి వారిని చంపొద్ద’ని రుక్సానా అడ్డుపడింది. ఇదే అదునుగా.. తనతో రాకపోతే నీ తల్లిని చంపేస్తానని ఇమ్రాన్ బెదిరించి, రుక్సానాని తీసుకెళ్లాడు. అటు.. ఇమ్రాన్ చేసిన దాడిలో రుక్సానా తల్లి, తాతయ్య తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాత మహమ్మద్ బాబర్ పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.