A Gang Cheated A Man In The Name Of Gold In Kurnool District: బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..? అందునా.. తక్కువ ధరకే ఇస్తామంటే, జనాలు ఇంకా ఎగబడతారు. ఇప్పుడున్న డిమాండింగ్ రోజుల్లో తక్కువ మొత్తానికే బంగారం సొంతం చేసుకుంటే, లాభం పొందవచ్చన్న ఉద్దేశంతో ముందుకొస్తారు. ఈ బలహీనతనే పసిగట్టి.. ఓ ముఠా ఘరానా మోసానికి పాల్పడింది. తక్కువ మొత్తానికే బంగారం ఇస్తామని ఊరించి.. ఒక వ్యక్తికి కుచ్చటోపీ పెట్టారు. అతని వద్ద నుంచి భారీ సొమ్ము తీసుకొని, నకిలీ బంగారమిచ్చి ఉడాయించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
India vs Pakistan: వన్డే ప్రపంచకప్ 2023.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ రీ-షెడ్యూల్! కారణం ఏంటంటే?
కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని బూజనూరు ఓ ముఠా తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మబలికింది. తాము ఎక్సవేటర్ పనులు చేస్తుంటే, భారీ మొత్తంలో బంగారం దొరికిందని మాయగాళ్లు మాయమాటలు చెప్పారు. అంతేకాదు.. జనాలను నమ్మించడం కోసం కొంత ఒరిజినల్ బంగారాన్ని చూపించారు. అది చూసి నిజమేననుకున్న నరసింహులు అనే వ్యక్తి.. వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన వద్ద రూ.7 లక్షలు ఉన్నాయని, ఆ మొత్తంలో తనకు ఎక్కువ బంగారం ఇవ్వాలని కోరాడు. ఇంకేముంది.. తాము వేసిన వలలో చేప చిక్కుకుందని భావించి, ఆ కేటుగాళ్లు సరేనని తలూపారు. దాంతో.. తాను జాక్‌పాట్ కొట్టేశానని నరసింహులు భావించాడు.
Boyfriend Crime: దారుణం.. ప్రేమించిన యువతిని దూరం చేస్తున్నారని..
ఒప్పందం ప్రకారం.. నరసింహులు ఆ కేటుగాళ్లకు రూ.7 లక్షలు ఇవ్వగా, వాళ్లు నకిలీ బంగారం ఇచ్చారు. అది నిజమైన బంగారమేనని భావించి, దాన్ని తీసుకొని ఇంటికెళ్లాడు. తీరా చూస్తే.. అది నకిలీ బంగారమని తేలింది. దీంతో వాళ్లు నిలదీయడానికి నరసింహులు వెళ్లగా.. అప్పటికే ఆ కేటుగాళ్లు రూ.7 లక్షలు తీసుకొని ఉడాయించారు. ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వస్తుండటంతో.. తాను మోసపోయానని భావించి, మరో దారి లేక పోలీసుల్ని ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.