Sidharth Malhotra: తండ్రి మృతి..ఎమోషనల్ పోస్ట్ పెట్టిన బాలీవుడ్ హీరో సిద్ధార్థ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా పితృవియోగంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆయన తండ్రి సునీల్ మల్హోత్రా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఫిబ్రవరి 14న తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ ద్వారా తెలిపాడు.
Also Read : Priyamani: గ్లోబల్ స్క్రీన్‌పై సౌత్ బ్యూటీ.. హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ప్రియమణి!
Also Read
తన తండ్రి గురించి సిద్ధార్థ్ గొప్పగా స్మరించుకుంటూ.. ‘ఆయన క్రమశిక్షణ, నిజాయతీ, విలువలకు మారుపేరు. కాలం ఎన్ని పరీక్షలు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. పక్షవాతం (Stroke) కారణంగా ఆయన వీల్‌చైర్‌కే పరిమితమైనా, ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. చివరకు ఏ బాధా లేకుండా నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారు” అని పేర్కొన్నారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహమేనని సిద్ధార్థ్ గుర్తుచేసుకున్నారు. సునీల్ మల్హోత్రా గతంలో మర్చంట్ నేవీలో కెప్టెన్‌గా పనిచేశారు. ఆయన మరణవార్త తెలియగనే బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సిద్ధార్థ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. సిద్ధార్థ్ తన తండ్రితో కలిసి ఉన్న పాత జ్ఞాపకాలను పంచుకుంటూ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?