Karnataka: అత్యాచారానికి గురైన టీనేజ్ బాలిక, తాను గర్భం దాల్చాలని తెలుసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కర్నాటకలోని మాండ్యా జిల్లాలో జరిగింది. 15 ఏళ్ల బాలిక గర్భవతి అని తెలియగానే ఈ నెల 24న ఆత్మహత్య చేసుకుంది. గతేడాది డిసెంబర్లో లైంగిక వేధింపులకు గురైనట్లు బాధితురాలు ఆరోపించింది. అయితే, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నిందితుడు బాలిక ఇంటి పొరుగున ఉండే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి పెళ్లి ఆగిపోయిందని దారుణానికి పాల్పడ్డాడు. తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్న అమ్మాయి అమ్మని, సోదరుడిని కాల్చి చంపినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్రంలోని ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నిందితుడిని అసిహాబాద్కి చెందిన సంజీవ్ కుమార్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా..పోలీసులు వెతుకుతున్నట్లు తెలిపారు.
ఢిల్లీ హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయం తీసుకున్నారు. AI వినియోగం బాధితుడిని గుర్తించడంలో సహాయపడటమే కాకుండా హత్యకు కారణమైన ప్రధాన నిందితుడిని అరెస్టు చేసేందుకు హెల్ప్ చేసింది.
Interfaith Relationship: కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. మతాంతర సంబంధం పెట్టుకున్న 19 ఏళ్ల యువతిని అతని సోదరుడు చంపేశాడు. ఈ ఘటన రాష్ట్రంలోని హున్సూర్ తాలుకాలోని మరూర్ గ్రామంలో జరిగింది. యువతిని ఆమె సోదరుడు నితిన్ గ్రామంలోని చెరువులోకి తోసివేయడంతో మరణించింది. ఆమెను రక్షించేందుకు యువతి తల్లి 43 ఏళ్ల అనిత ప్రయత్నిస్తే ఆమెను కూడా చెరువులోకి తోసేశాడు.
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చినకామన పూడి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గన్ పౌడర్ పేలి ఓ కూలీ మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గన్ పౌడర్ (తుపాకీ మందు) పేలి చేపల చెరువుల వద్ద పని చేసే కూలీలిద్దరు తీవ్రంగా గాయపడగా... వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
మెదక్ జిల్లాలోని చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రిని చంపేసి సహజ మరణంగా కొడుకు, కూతురు, అల్లుడు చిత్రీకరించారు. కాగా, మృతుడి భార్య లచ్చవ్వ ఫిర్యాదుతో ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Snoring: బిగ్గరగా "గురక" పెట్టడం అతని ప్రాణాలను తీసింది. ఇరుగుపొరుగు ఇళ్లలో ఉంటున్న వ్యక్తుల మధ్య గురక వివాదం ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటన అమెరికా పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 55 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకి పాల్పడినందుకు థర్డ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపబడ్డాయి.
కృష్ణా జిల్లాలోని గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. 500 రూపాయల కోసం భార్యాభర్తల మధ్య వివాదం జరిగినట్లు తెలిసింది.
గతేడాది డిసెంబర్ లో అదృశ్యమైన ఓ మహిళ మృతదేహాన్ని నవీ ముంబై పోలీసులు మంగళవారం గుర్తించారు. ఖర్ఘర్ హిల్ కాంప్లెక్స్‌లోని అటవీ ప్రాంతంలో ఆమె కుళ్లిపోయిన మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన ప్రియుడు నుంచి దూరం కావడంతో ఆమెను గొంతు కోసి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఓ వార్త కథనం తెలిపింది. మృతురాలు వైష్ణవి (19)గా గుర్తించారు. సియోన్‌లోని ఎస్ఐఈఎస్ కాలేజీలో చదువుతోంది. కాగా.. ఆ మహిళ 2023 డిసెంబర్…
Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడింది బాలిక తల్లి ‘లివ్ ఇన్ పార్ట్నర్’ అని పోలీసులు బుధవారం తెలిపారు. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘజియాబాద్ నివాసి అంకిత్ యాదవ్(29) అనే నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 376 (రేప్)