Indian Student Killed in US: అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. నిరాశ్రయుడి ఆశ్రయం ఇచ్చి ఓ వ్యక్తిపై జాలి చూపిన భారత్‌కు చెందిన విద్యార్థి యూఎస్‌లో తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. సాయం చేశాడన్న కృతజ్ఞత లేకుండా ఆ విద్యార్థిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. జార్జియాలో జనవరి 16న ఈ ఘటన జరిగింది.
Read Also: Ayodhya: అయోధ్యలో సరికొత్త దోపిడీ.. షాకైన భక్తులు.. చివరికి ఏమైందంటే..!
జార్జియాలోని ఓ ఫుడ్ మార్ట్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ చదువుకుంటున్నాడు హర్యానాకు చెందిన వివేక్ సైనీ. కాగా.. జులియన్ ఫౌల్క్‌నర్ అనే నిరాశ్రయుడు.. కొన్ని రోజుల క్రితం ఆ ఫుడ్ మార్ట్‌కు వెళ్లాడు. వివేక్‌తో పాటు మార్ట్ సిబ్బంది అతనికి సాయం చేశారు. ఈ నేపథ్యంలో.. ఆ నిరాశ్రయుడు అక్కడే ఉండిపోయాడు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాలన్న మంచి మనసుతో.. ఎవరు ఏం పట్టించుకోలేదు. అతను ఏం అడిగితే అది ఇచ్చారు. మంచి నీరు, చిప్స్, కోక్.. అన్ని ఇచ్చారు. బ్లాంకెట్, జాకెట్ కూడా ఇచ్చారు. సిగరెట్లు అడిగితే.. అవి కూడా ఇచ్చారు. పార్ట్ టైమ్ జాబ్ ముగించుకుని ఇంటికి బయలుదేరుతున్న వివేక్ సైనీపై ఒక్కసారిగా దాడి చేశాడు జులియన్ ఫౌల్క్‌నర్. సుత్తితో 50సార్లు అతని తలపై కొట్టాడు. వివేక్ సైనీ అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అతను ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధ్రువీకరించారు.
Read Also: MP Bureaucrat Killed: నామినీగా చేయనందుకు.. ప్రభుత్వ ఉద్యోగి అయిన భార్యను హత్య చేసిన భర్త
సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేసరికే వివేక్ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసుపై దర్యాప్తు చేపట్టారు. అతడు మత్తుపదార్థాలకు బానిసై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. వివేక్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.