Australia-Ricky Ponting: సిగ్గుచేటు.. ఆస్ట్రేలియా వైఫల్యానికి అదే ప్రధాన కారణం!
- టీ20 ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా అవుట్
- ఆసీస్ నిష్క్రమణపై పాంటింగ్ నిరాశ
- మా వైఫల్యానికి అదే ప్రధాన కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ricky Ponting Reacts to Australia’s Shock Exit from T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా సూపర్–8 దశకు అర్హత సాధించకపోవడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రూప్-బిలో భాగంగా మంగళవారం కొలంబోలో జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా రద్దు కావడంతో ఆసీస్ టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. జింబాబ్వేపై దారుణ ఓటమి ఆస్ట్రేలియా అవకాశాలపై తీవ్ర ప్రభావం పడింది. మెగా టోర్నీ నుంచి ఆసీస్ నిష్క్రమణపై ఆ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ వంటి బలమైన జట్టు సూపర్–8కు చేరుకోలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నాడు. ఈ వైఫల్యాలు తమకు సిగ్గుచేటు అని పాంటింగ్ పేర్కొన్నాడు.
రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా జట్టు వైఫల్యానికి ప్రధాన కారణం కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీకి దూరమవడమేనని చెప్పాడు. ‘ఆస్ట్రేలియా లాంటి టాప్ జట్టు సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించలేకపోవడం చాలా దురదృష్టకరం. చాలా మంది ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమవడమే ఇందుకు ప్రధాన కారణమని నేను భావిస్తున్నాను. కొందరు ప్లేయర్స్ మిస్ అయినా మంచి క్రికెట్ ఆడే సత్తా జట్టులో ఉంది. కానీ ఈ టోర్నమెంట్‌లో బాగా ఆడలేకపోయారు. ఆస్ట్రేలియా తప్పక తిరిగి పుంజుకోవాలి. మరో ఐసీసీ టోర్నీలో ఆసీస్ బలమైన పునరాగమనం చేస్తుందని నేను ఆశిస్తున్నా’ అని ధీమా వ్యక్తం చేశాడు.
Also Read
- Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
- Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
- World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
- Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
Also Read: Australia Cricket: మాకు విరాట్ కోహ్లీ లాంటి బ్యాటర్ లేడు.. కమిన్స్ సంచలన వ్యాఖ్యలు!
గతంలో ఎన్నో కష్టసమయాలను అధిగమించిన జట్టు ఆస్ట్రేలియా కావడంతో ఈ దశ కూడా తాత్కాలికమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 1999, 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లను ఆసీస్ గెలుచుకుంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా అంటేనే.. ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. 2009 తర్వాత ఆసీస్ ఆధిపత్యం తగ్గినా.. 2015 వన్డే ప్రపంచకప్ గెలిచి మరోసారి సత్తాచాటింది. ఆ తర్వాత ఆసీస్ కంగుతింటూ వచ్చింది. 2023 అనంతరం పతన దిశగా వెళుతోంది. మొత్తానికి పాంటింగ్ వ్యాఖ్యలు ఆసీస్ అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తించాయి. తాత్కాలిక వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ఆస్ట్రేలియా మరింత బలంగా తిరిగి వస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!