ఆస్ట్రేలియాతో టీమిండియా 5 టీ20ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా.. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఆ మ్యాచ్ ల్లో టీమిండియానే గెలుపొందింది. కంగారులపై యువ ఆటగాళ్లు చెలరేగడంతో 2-0తో భారత్ ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. చివరి రెండు టీ20 మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కారణమేంటంటే.. వరల్డ్ కప్ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు గత రెండు నెలలుగా భారత్ లోనే ఉంది. ఈ క్రమంలో.. టీ20 జట్టులోని పలువురు ఆసీస్ ఆటగాళ్లు తమ దేశానికి వెళ్లిపోతున్నారు.
Read Also: Pragathi: జాతీయ స్థాయిలో సత్తా చాటిన నటి ప్రగతి.. పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం
వరల్డ్ కప్ లో ఆడిన స్టీవ్ స్మిత్, ఆడం జంపా ఈరోజు ఆస్ట్రేలియా వెళ్లగా… నేడు మూడో టీ20 ముగిసిన తర్వాత మ్యాక్స్ వెల్, స్టొయినిస్, షాన్ అబ్బాట్, జోష్ ఇంగ్లిస్ స్వదేశానికి వెళ్లిపోనున్నారు.
ఈ నేపథ్యంలో.. ఆస్ట్రేలియా జట్టు చివరి రెండు టీ20లకు తమ జట్టును ప్రకటించింది. ప్రపంచకప్ ఫైనల్ లో ఒంటిచేత్తో గెలిపించిన ట్రావిస్ హెడ్ ఒక్కడే టీ20 జట్టులో కొనసాగుతున్నాడు. కాగా.. డిసెంబరు 3న టీ20 సిరీస్ ముగియనుంది.
ఆస్ట్రేలియా జట్టు…
మాథ్యూ వేడ్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, బెన్ మెక్ డెర్మట్, టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్పే, తన్వీర్ సంఘా, బెన్ డ్వార్షూయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, కేన్ రిచర్డ్సన్, జాసన్ బెహ్రెండార్ఫ్.