Mitchell Marsh: ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో టీమిండియాపై ఆస్ట్రేలియా గెలిచి విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆసీస్ జట్టు వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న తర్వాత.. తమ డ్రెస్సింగ్ రూమ్ లో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ ట్రోఫీపై కాళ్లు పెట్టుకుని కూర్చోవడంపై ఇండియాతో పాటు ఇతర దేశాల అభిమానులు మండిపడ్డారు. ఆస్ట్రేలియా ఇలాంటి ట్రోఫీలు చాలా గెలిచినందుకు కావచ్చు.. ఇంత పొగరు. అదే టీమిండియా ఫైనల్ మ్యాచ్ లో నెగ్గితే.. అదే ట్రోఫీని తమ గుండెలపై పెట్టుకునే వారని టీమిండియా అభిమానులు ఎన్నో విమర్శలు చేశారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మార్ష్ పై భారత్ లో విమర్శలు వచ్చాయి.
Read Also: COP28 Dubai: ప్రపంచ జనాభాలో 17 శాతం ఉన్నా.. కర్భన ఉద్గారాల్లో 4 శాతమే.. ప్రధాని వెల్లడి..
ఈ క్రమంలో.. మిచెల్ మార్ష్ స్పందించాడు. “నేను వరల్డ్ కప్ ను అగౌరవపర్చాలన్న ఉద్దేశంతో అలా చేయలేదని అన్నాడు. కావాలంటే వరల్డ్ కప్ ట్రోఫీపై మళ్లీ కాళ్లు పెడతానని చెప్పుకొచ్చాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఆ రోజున జరిగిన ఘటనపై నేనేమీ పెద్దగా ఆలోచించలేదు”. అని మార్ష్ తెలిపాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తనకు ఇతరుల ద్వారా తెలిసిందన్నాడు. అందులో ఏముందని అంతలా మాట్లాడుకుంటున్నారని మిచెల్ మార్ష్ ప్రశ్నించాడు. అయితే ఈ వ్యాఖ్యలకు టీమిండియా అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Read Also: Pawan Kalyan: ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తుపై పవన్ క్లారిటీ