భారత్-అఫ్గానిస్థాన్ మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోండగా.. సిరీస్ సమం చేయాలనే ఉద్దేశంతో అఫ్గానిస్థాన్ జట్టు రంగంలోకి దిగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరోవైపు.. యశస్వి జైస్వాల్ కంటే.. శుభ్‌మన్ గిల్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.…
మరో 6 నెలల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచ కప్ ఆడనుంది. అయితే.. ఈ ప్రపంచకప్‌కు భారత కెప్టెన్ ఎవరు? అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే రోహిత్ శర్మ టీ20ల్లోకి తిరిగి వచ్చాడు. అంతకుముందు హార్దిక్ పాండ్యా టీ20లకు సారథ్య బాధ్యతలు వహించాడు. ఈ క్రమంలో.. కెప్టెన్సీపై టీమిండియా మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.