గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. నేడు వారి ఖాతాల్లోకి సొమ్ము.. 4,07,323 మందికి లబ్ధి
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు.. పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి .. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతోపాటు రాయితీపై సామగ్రి అందిస్తోన్న విషయం విదితమే.. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రీయింబర్స్‌మెంట్ చేస్తోంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని ఈ రోజు రీయింబర్స్‌మెంట్ చేయనున్నారు. ఇళ్ల నిర్మాణానికి బ్యాంకులు 9 నుండి 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తుండగా.. మహిళల పై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తోంది ప్రభుత్వం.. ఇందులో భాగంగా 12.77 లక్షల మందికి 4,500.19 కోట్ల రూపాయలను బ్యాంకు రుణం అందించి ప్రభుత్వం.. ఇక, వీరిలో అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు ఇవాళ వడ్డీ రీఎంబర్స్ మెంట్ చేయనున్నారు సీఎం జగన్.. 46.90 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో వర్చువల్ గా జమ చేయనున్నారు.. సంవత్సరంలో రెండు సార్లు వడ్డీ రీఎంబెర్స్‌మెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ రోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్ చేస్తారు.. తొలి దఫా కింద 4,07,323 మందికి రూ.46.90 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా దర్శన, సేవా టికెట్లు విడుదల
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ.. ఇవాళ్టి నుంచి వరుసగా ప్రత్యేక దర్శనంతో పాటు స్వామి వారి వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం జనవరి 18వ తేదీ అంటే ఈ రోజు ఉదయం 10 గంటల నుండి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ పేర్కొంది. ఇక, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ.. వర్చువల్ సేవా టికెట్లను జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. మరోవైపు.. శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు జరుగునుంది.. దానికి సంబంధించిన సేవా టికెట్లను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.. శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.. ఇక, ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.. తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు..
టీడీపీ వర్సెస్ వైసీపీ.. గుడివాడలో టెన్షన్ టెన్షన్
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. గుడివాడలో పొలిటికల్ రగడ మొదలైంది.. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.. ఇవాళ గుడివాడలో టీడీపీ రా కదలిరా పేరుతో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.. మరోవైపు.. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలోనూ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. ఇప్పటికే పోటాపోటీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.. దీంతో, గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. గుడివాడ ముదినేపల్లి రోడ్డులో చంద్రబాబు రా కదలిరా సభ, ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలకు సర్వం సిద్ధ చేశాయి టీడీపీ శ్రేణులు.. పసుపు వర్ణంగా మారింది ముదినేపల్లి రోడ్డు.. భారీగా స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక, పోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను ప్లాన్ చేశారు ఎమ్మెల్యే కొడాలి నాని.. ఉదయం 11 గంటలకు బైక్ ర్యాలీ, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లలో మునిగిపోయారు.. పట్టణ ప్రధాన హార్డింగ్ లపై టీడీపీ బ్యానర్లకు పోటీగా, సీఎం వైఎస్ జగన్ ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల రంగ వర్ధంతి కార్యక్రమాల్లో వైసీపీ శ్రేణుల అలజడులు.. అదే పరిస్థితి పునరావృతం అవుతుందేమొనన్న ఆందోళనలో పోలీసు వర్గాలు ఉన్నాయి.. మొత్తంగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో రాజకీయ రగడ మొదలైంది.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..
ఇంగ్లీష్ రావట్లేదు, లెక్కలు చేయలేకపోతున్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల పరిస్థితి..
గ్రామీణ భారతదేశంలో విద్యార్థుల చదువులు అంతంత మాత్రంగా ఉన్నట్లు ASER 2023 ‘బియాండ్ బేసిక్స్’ సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో 14-18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు సులభమైన సాధారణ ఇంగ్లీష్ వ్యాఖ్యలను కూడా చదవలేకపోతున్నారని తేలింది. దీంతో పాటు లెక్కలు చేయడంలో కూడా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వార్షిక విద్యా స్థితి నివేదిక ప్రకారం ( ASER) 2023 బుధవారం వెల్లడించింది. ప్రభుత్వాలు తన విధానాలను రూపొందించేందుకు ASER నివేదికలను ఉపయోగించుకుంటాయి. 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. మొత్తం 34,745 మంది పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో ఒక గ్రామీణ జిల్లాలో సర్వే చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రం రెండు జిల్లాల చొప్పున సర్వే చేశారు. ప్రథమ్ ఫౌండేషన్ ప్రచురించిన వార్షిక నివేదికలో 14-18 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థుల్లో సగం మంది మ్యాథమెటిక్స్ డివిజన్ ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నారు. 25 శాతం మంది తమ మాతృభాషలో క్లాస్ 2 స్థాయి పాఠ్యాంశాలనను స్పష్టంగా చదవలేకపోతున్నారు. డివిజన్ ప్రాబ్లమ్స్( 3 అంకెల సంఖ్యను ఒక అంకె సంఖ్యతో భాగించడం) చేయడానికి కష్టపడుతున్నారు. నిజానికి 3-4 తరగతుల స్థాయి పిల్లలు ఇలాంటి లెక్కల్ని చేయాలి.
ప్రపంచానికి భారత్ పై పెరిగిన విశ్వాసం.. వృద్ధి రేటు 7 శాతానికి మించి ఉంటుందని అంచనా
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీని ప్రభావం వల్ల భారత్‌పై ప్రపంచానికి నమ్మకం పెరుగుతోంది. తాజాగా దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఈ సమావేశంలో, శక్తికాంత దాస్ భారతదేశ ఆర్థిక వృద్ధి గురించి చాలా మాట్లాడారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2024-25లో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం వృద్ధి చెందుతుందని దాస్ చెప్పారు. అయితే ఎన్‌ఎస్‌ఓ దానిని మరింత పెంచింది. భారతదేశ వృద్ధి రేటు 7 శాతానికి మించి ఉంటుందని ఎన్ఎస్ఓ అంచనా వేసింది. అంతేకాకుండా, ద్రవ్యోల్బణం మితంగానే కొనసాగుతుందని అంచనా. భారతదేశంపై అంతర్జాతీయ విశ్వాసం ఆల్ టైమ్ హైలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ వృద్ధి అంచనా 7 శాతంగా ఉంది. NSO (నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్) 7.3శాతం తెలిపిందని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాలలో ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థ మధ్యస్థ, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పెంచాయని దాస్ చెప్పారు. సవాలుగా ఉన్న ప్రపంచ స్థూల ఆర్థిక వాతావరణం మధ్య, భారతదేశం వృద్ధి, స్థిరత్వానికి ఉదాహరణగా నిలుస్తోంది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో ‘హై గ్రోత్, లో రిస్క్ ఇండియా స్టోరీ’ అనే అంశంపై నిర్వహించిన సీఐఐ సెషన్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక రంగంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందన్నారు.
గంటకు 14మిలియన్ డాలర్లు సంపాదిస్తోన్న కుబేరులు.. ఫస్ట్ ట్రిలియనీర్ ఎవరంటే ?
ప్రపంచంలో చాలా మంది ధనవంతుల సంపద వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా మంది ధనవంతులు బిలియనీర్లుగా మారారు. కానీ, ఇప్పటి వరకు ఎవరూ ట్రిలియన్‌కు చేరుకోలేకపోయారు. ప్రపంచం త్వరలో మొదటి ట్రిలియనీర్‌ను పొందబోతున్నట్లు ఇప్పుడు ఒక నివేదిక పేర్కొంది. ఒక దశాబ్దంలో ప్రపంచం తన మొదటి ట్రిలియనీర్‌ను పొందుతుందని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. టెస్లా CEO ఎలోన్ మస్క్, LVMH యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్, సీనియర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్. భారతదేశం మొత్తం ఆస్తులు నవంబర్ 2023 నాటికి 869 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయి. మార్చి 2020లో ఈ సంపద 405 బిలియన్ డాలర్లు. దీని ప్రకారం వారి సంపద ప్రతి గంటకు 14 మిలియన్ డాలర్లు పెరుగుతోంది.
విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఇదే తొలిసారి.. స్టేడియం మొత్తం గప్‌చుప్!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అఫ్గన్ పేసర్ ఫరీద్ అహ్మద్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన విరాట్.. మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరకుండానే నిష్క్రమించాడు. తద్వారా తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలిసారిగా గోల్డెన్ డక్ నమోదు చేశాడు. టీ20 ఇన్నింగ్స్‌లో ఎటువంటి పరుగులు చేయకపోవడం ఇది ఐదవసారి మాత్రమే. టీ20 ప్రపంచకప్ 2024కు ముందు భారత్ ఆఖరిగా ఆడుతున్న ఈ సిరీస్‌తోనే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. దాదాపుగా 14 నెలల అనంతరం విరాట్ భారత టీ20 జట్టులోకి వచ్చాడు. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్‌కు దూరమైన కోహ్లీ.. రెండో మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. 16 బంతుల్లో 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే బెంగళూరులో జరిగిన మూడో టీ20లో మాత్రం విఫలమయ్యాడు. విరాట్ బ్యాటింగ్ మెరుపులు చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. రన్ మెషిన్ అవుట్ కాగానే స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది.
తన సినిమాలో మహేష్ క్యారెక్టర్ ఏంటో చెప్పేసిన జక్కన్న..ఫుల్ ఖుషి అవుతున్న ఫ్యాన్స్..
ప్రపంచాన్ని తన సినిమాతో మెప్పించిన డైరెక్టర్ రాజమౌళి తో సినిమాలు చెయ్యాలని ప్రతి హీరో అనుకోవడం కామన్.. ఎందుకంటే ఆయన సినిమాలు అలా ఉంటాయి మరి.. రాజమౌళి ని మించిన దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో కూడా రాజమౌళి ని కొట్టే దర్శకుడు మరొకరు కనిపించడం లేదు.. సినిమా పై తనకున్న ఇష్టమే తనను ఈ స్థాయిలో ఉంచిందని ఎన్నో సార్లు ఆయన నోటి వెంట వచ్చింది.. త్రిపుల్ ఆర్ తో ఆస్కార్ అందుకున్న జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు..మహేష్ బాబుతో ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమాతో ఆయన ఎంత మేరకు ప్రేక్షకులను అలరిస్తాడు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఎలాంటి క్యారెక్టర్ పోషిస్తున్నాడు అనే వార్తలు గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి.. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహేష్ ఈ సినిమాలో ఒక హిప్పీ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. హిప్పీ అంటే దేశ దిమ్మర్లు, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వలస వెళ్తూ ఉండేవారు. ఇలా తను తిరుగుతున్న ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో జనాలు ఎదురుకుంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించే పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది.. గతంలో ఎప్పుడు లేని విధంగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.. మరి ఈ సినిమా ఎటువంటి అవార్డులను అందుకుంటుందో చూడాలి.. ఈ వార్తల్లో నిజమేంతో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు..
ఆల్ టైమ్ టాప్ 10 మూవీస్ లిస్టులో చేరిపోయిన సూపర్ హీరో సినిమా
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ హిస్టరీ ఇన్ మేకింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి చేసిన హనుమాన్ మూవీ పాజిటివ్ మౌత్ టాక్ తో దూసుకుపోతోంది. టీజర్ రిలీజ్ నుంచే ఇండియన్ సూపర్ హీరో వస్తున్నాడు అనే మాటని ప్రమోట్ చేసిన మేకర్స్… లో బడ్జట్ తో కూడా సూపర్బ్ క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ చూపించి పాన్ ఇండియా హిట్ కొట్టారు. యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమా థియేటర్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సంక్రాంతి సీజన్ అయిపోవడంతో హనుమాన్ సినిమా లాంగ్ రన్ ని స్టార్ట్ చేసింది. ఇకపై ఎన్ని రోజులు థియేటర్స్ లో ఉంటుంది? ఎంత రాబడుతుంది అనేది సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. ఎందుకంటే హనుమాన్ సినిమా కలెక్ట్ చేస్తున్న ప్రతి రూపాయి ప్రాఫిట్స్ లోకే వెళ్లిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇంత క్లీన్ హిట్ టాక్ ఏ సినిమాకి రాలేదు. నైజాం, ఆంధ్రా, సీడెడ్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో హనుమాన్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఇండియాలోనే కాదు మన ఇండియా సూపర్ హీరోకో నార్త్ అమెరికా కూడా జేజేలు కొడుతోంది. హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో 3.3 మిలియన్ మార్క్ ని రీచ్ అయ్యింది. ఆ సెంటర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 మూవీస్ లో హనుమాన్ చోటు దక్కించుకుంది. సాహూ, ఆదిపురుష్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని అయిదు రోజుల్లోనే బ్రేక్ చేసిన హనుమాన్ మూవీ… నెక్స్ట్ 3.41 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసిన భరత్ అనే నేను సినిమా టార్గెట్ గా ముందుకి వెళ్తుంది. ఒకవేళ హనుమాన్ మూవీ 3.5 మిలియన్ డాలర్స్ కి కలెక్ట్ చేస్తే మాత్రం రామ్ చరణ్ రంగస్థలం సినిమా రికార్డ్ కూడా బ్రేక్ అయిపోయినట్లే. మరో థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యే లోపు హనుమాన్ మూవీ ఎన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది? ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుంది అనేది చూడాలి.
అయిదు సెంచరీలు కొట్టిన ఏకైక సౌత్ హీరో…
సూపర్ స్టార్ మహేష్ బాబుని బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అంటుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని మహేష్ బాబు థియేటర్స్ కి పుల్ చేసినంత స్ట్రాంగ్ గా ఇతర హీరోలు పుల్ చేయలేరు అనిపించేలా చేస్తున్నాయి ఈ మధ్య వచ్చిన మహేష్ సినిమాలు. ఒకప్పుడు మహేష్ సినిమాలని డైరెక్టర్స్ అండ్ మహేష్ కలిసి నిలబెట్టే వాళ్లు ఈ మధ్య మాత్రం మహేష్ సోలో షోతో సినిమాలని నడిపిస్తున్నాడు. గత ఐదారేళ్లుగా రిలీజైన మహేష్ సినిమాలు చూస్తే ఆ టాక్ ఏంటి? ఆ రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ ఏంటి అనిపించకమానదు. ఈ కారణంగానే మహేష్ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అంటుంటారు. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన మహేష్ బాబు… నెగటివ్ టాక్ అండ్ క్రిటిక్స్ రివ్యూస్ ని కూడా డామినేట్ చేసే రేంజ్ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. ఒక ఫ్లాప్ టాక్, యావరేజ్ టాక్ వచ్చిన సినిమాతో మహేష్ బాబు వంద కోట్ల షేర్ ని రాబట్టడం అంత ఈజీ కాదు. ఇదే టాక్ తో వేరే సినిమాలైతే రెండో రోజుకే దుకాణం సర్దేసేది కానీ ఇక్కడే మహేష్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది. గుంటూరు కారం నుంచి వంద కోట్ల షేర్ పోస్టర్ బయటకి రానుంది. దీంతో మహేష్ బాబు బేక్ టు బ్యాక్ అయిదు సార్లు వంద కోట్లని రాబట్టిన సౌత్ హీరోగా హిస్టరీ క్రియేట్ చేసాడు. ఓవరాల్ గా ఆరుసార్లు వంద కోట్లని రాబట్టాడు మహేష్ బాబు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట, గుంటూరు కారం సినిమాలు మహేష్ బాబు వంద కోట్ల క్లబ్ లో ఉన్నాయి. నెక్స్ట్ మహేష్ నుంచి పాన్ ఇండియా సినిమా రాబోతుంది కాబట్టి ఇక రీజనల్ రికార్డ్స్ గురించి కాకుండా పాన్ ఇండియా రికార్డ్స్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టాల్సి వస్తుంది.