Virat Kohli : బీసీసీఐ నిర్ణయంపై కోహ్లీ ఫైర్ అయ్యాడు. క్రికెటర్స్ విదేశీ టూర్ లో ఉన్నప్పుడు వారి వెంట కుటుంబ సభ్యులను తీసుకెళ్లొద్దు అంటూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని కోహ్లీ తీవ్రంగా తప్పుబట్టాడు. మ్యాచ్ ఆడే సమయంలో ఆటగాళ్లు చాలా ఒత్తిడితో ఉంటారని.. అలాంటి సమయంలో వారికి మద్దతుగా కుటుంబ సభ్యులు ఉండటంలో తప్పులేదన్నాడు. వాళ్లకు కుటుంబ సభ్యులు తోడుగా ఉంటే ఒత్తిడిని అధిగమించి మెరుగ్గా ఆడుతారంటూ చెప్పాడు. ఒత్తిడిలో ఉన్న ఆటగాళ్లు స్థిరత్వంలో ఉండటం కోసం కుటుంబ సభ్యుల తోడు అవసరం అంటూ తెలిపాడు.
Read Also : PM Modi: ఆర్ఎస్ఎస్ ద్వారానే జీవిత లక్ష్యం ఏంటో తెలిసింది..
కోహ్లీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కోహ్లీకి క్రికెటర్స్ మద్దతుగా నిలుస్తున్నారు. కుటుంబ సభ్యులు క్రికెటర్స్ ను గెలుపు కోసం ఆడేలా ప్రోత్సహిస్తారే తప్ప మరో ఉద్దేశం ఉండదని చెప్పుకొస్తున్నారు. తమ గెలుపు సంబురాలను కుటుంబ సభ్యులతో జరుపుకోవడం కూడా మానసిక స్థిరత్వాన్ని పెంచుతుందని వారు కామెంట్లు చేస్తున్నారు. ఇటు ఫ్యాన్స్ కూడా కోహ్లీ నిర్ణయంపై అండగా నిలుస్తున్నారు. క్రికెటర్స్ కుటుంబ సభ్యులతో ఉంటే మరింత దూకుడుగా ఆడుతారంటూ పోస్టులు పెడుతున్నారు.