Mohammed Shami: షమీ కూతురిని టార్గెట్ చేసిన మత పెద్దలు.. ఈసారి ఎందుకంటే..?
- మహ్మద్ షమీ కూతురిని టార్గెట్ చేసిన మతపెద్ద..
- హోలీ ఆడటం షరియత్‌కి విరుద్ధం అంటూ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Shami: ఇటీవల ఛాంపియన్ ట్రోఫీ సమయంలో, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీపై ముస్లిం అత్యున్నత సంస్థ నుంచి విమర్శలు వచ్చాయి. రంజాన్ మాసంలో షమీ ‘‘రోజా’’ పాటించకపోవడంపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ విమర్శలు గుప్పించారు. క్రికెట్ మ్యాచ్ సమయంలో ఉపవాసం ఉండకుండా నీరు, ఇతర డ్రింక్స్ తాగడాన్ని షాబుద్దీన్ తప్పుపట్టారు. షమీ ఒక ‘‘క్రిమినల్’’ అంటూ దుయ్యబట్టారు. అయితే, ఈ విషయంపై షమీకి మద్దతుగా యావత్ దేశం నిలబడింది.
Read Also: BJP MLA: “కేదార్‌నాథ్‌లో హిందువులు కాని వారిని నిషేధించాలి”.. మరో వివాదం..
Also Read
- Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
- Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
- Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
- Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
ఇదిలా ఉంటే, ఇప్పుడు షమీ కూతురిని టార్గెట్ చేస్తూ షాబుద్దీన్ రజ్వీ విమర్శలు చేశారు. షమీ కూతురు హోలీ వేడుకల్లో పాల్గొనడాన్ని ‘‘చట్టవిరుద్ధం’’, ‘‘షరియత్‌కి విరుద్ధం’’ అని అభివర్ణించారు. శనివారం రాత్రి విడుదల చేసిన ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ..‘‘ ఆమె చిన్న అమ్మాయి, అర్థం చేసుకోకుండా హోలీ ఆడితే నేరం కాదు. ఆమెకు అన్నీ తెలిసి కూడా హోలీ ఆడుతుంటే అది షరియత్‌కి వ్యతిరేకంగా పరిగణించబడుతుంది’’ అని అన్నారు. ఇస్లాం సిద్ధాంతాలు పాటించాలని తాను షమీకి గతంలో సలహా ఇచ్చినట్లు షాబుద్దీన్ చెప్పుకొచ్చారు.
‘‘నేను షమీ మరియు అతని కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేశాను … షరియత్‌లో లేనిది మీ పిల్లలను చేయనివ్వకండి. హోలీ హిందువులకు చాలా పెద్ద పండుగ కానీ ముస్లింలు హోలీ జరుపుకోకూడదు. షరియత్ తెలిసిన తర్వాత కూడా ఎవరైనా హోలీ జరుపుకుంటే అది నేరం’’ అని అన్నారు. షరియత్ నియమాలు పాటించడం ముస్లింల అందరి బాధ్యత అని, ఇస్లాంలో ఉపవాసం తప్పనిసరి అని, ఉద్దేశపూర్వకంగా ఉపవాసం ఉండకపోతే ఇస్లామిక్ చట్టాల ప్రకారం అతడిని పాపిగా పరిగణిస్తామని చెప్పారు. షమీతో సహా ఉపవాసం ఉండలేని వారు రంజాన్ తర్వాత ఉపవాసం ఉండాలని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
-
ORR Arbitration : సుప్రీంకోర్టులో HMDAకి షాక్.. ORR కేసులో కీలక మలుపు
-
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
-
Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
-
Gopichand: ఆ హీరో కమ్‌బ్యాక్‌కు రిలీజ్ డేట్ల గ్రహణం!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!