ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. పంజాబ్ బౌలర్ల ధాటికి ఆర్ఆర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. చివరి వరకు పోరాడిన రియాన్ పరాగ్ (48) ఒక్కడే అత్యధికంగా స్కోరు చేశాడు. ఈ క్రమంలో.. రాజస్థాన్ ఈ మాత్రం స్కోరు చేసింది. మిగత బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఓపెనర్ జోష్ బట్లర్ లేని వెలితి కనిపిస్తోంది.
ఈసారి ఐపీఎల్లో ఆర్సీబీ టైటిల్ సాధిస్తుందనే గట్టి నమ్మకం క్రికెట్ అభిమానుల్లో ఉండేది. కానీ.. ఈసారి కూడా టైటిల్ గెలువలేకపోతుంది. సీజన్ ప్రారంభంలో అన్నీ మ్యాచ్ ల్లో ఓడిపోయి.. చివర్లో గెలుస్తూ వస్తున్నారు. కానీ.. ఆర్సీబీకి ప్లేఆఫ్స్ చేరడం కష్టమే. ఈ క్రమంలో.. టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆర్సీబీకి సలహా ఇచ్చారు. భవిష్యత్తులో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే.. భారత ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. 17 ఏళ్ల నుంచి వేచి చూస్తున్న ఆర్సీబీ…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆర్ఆర్.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
టీ20 వరల్డ్ కప్ 2024కి జట్టును ప్రకటించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రజా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. మెగా టోర్నీకి సమయం తక్కువగా ఉంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ జట్టును ఇంకా ప్రకటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. మంగళవారం బంగ్లాదేశ్ కూడా తన జట్టును ప్రకటించిందని తెలిపారు. కాగా.. పాకిస్తాన్ జట్టు ఐర్లాండ్లో పర్యటిస్తుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు జరగాల్సిన కోల్కతా నైట్ రైడర్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. కాసేపు వర్షం ఆగినప్పటికీ.. తిరిగి మళ్లీ ప్రారంభంకావడంతో రద్దు అయింది. ఈ క్రమంలో.. ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 47 పరుగుల తేడాలో బెంగళూరు గెలుపొందింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. వికెట్ సాధించడంలో విజయం సాధించారు. ఈ విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. మరోవైపు.. ఢిల్లీ బ్యాటింగ్ లో కెప్టెన్ అక్షర్ పటేల్ (57) అత్యధిక…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ 187 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 రన్స్ సాధించింది. బెంగళూరు బ్యాటింగ్ లో అత్యధికంగా రజత్ పాటిదర్ (52) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత విల్ జాక్స్ (41), కెమెరాన్ గ్రీన్ (32*) పరుగులు చేయడంతో ఢిల్లీ ముందు ఫైటింగ్ స్కోరును ఉంచారు.