ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యా్చ్లో గుజరాత్ ఓపెనర్స్ చెలరేగారు. ఇద్దరూ సెంచరీలతో అదరగొట్టారు. శుభ్‌మాన్ గిల్ (104), సాయి సుదర్శన్ (103) సెంచరీలు చేయడంతో గుజరాత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ ముందు 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. గిల్, సుదర్శన్ బ్యాటింగ్ లో ఒకరికొకరు పోటాపోటీగా రన్స్ చేస్తూ వచ్చారు. గిల్ ఇన్నింగ్స్…
విరాట్ కోహ్లీ, బ్యాటింగ్ ఫామ్ పట్ల టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. విరామం తర్వాత కూడా అంతకు ముందున్న దూకుడునే కోహ్లీ కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. విరాట్ తిరుగలేని ఫామ్‌లో కనిపిస్తున్నారు.. అత్యుత్తమంగా ఆడుతున్నారని అన్నారు. అంతేకాకుండా.. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారని.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరుఫున ఇదే ఫామ్‌ను కొనసాగించాలని అనిల్ కుంబ్లే తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా గడ్డపై మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కాగా.. మెగా టోర్నీకి భారత జట్టును ప్రకటించగా, అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై సెలక్టర్లు మరింత విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా.. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్ వంటి పేర్లు ప్రధాన జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే, అగార్కర్ నేతృత్వంలో సెలెక్టర్లు అత్యుత్తమ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని బీసీసీఐ సెక్రటరీ…
టీమిండియాకు ఆడటం అనేది ప్రతి భారతీయ క్రికెటర్ కల. అయితే.. కొంతమంది క్రికెటర్లు విజయం సాధిస్తుండగా, మరికొంత మంది నిరాశ చెందుతున్నారు. టీమిండియాలో అడుగుపెట్టి వారి స్థానాన్ని నిలబెట్టుకోలేక మళ్లీ తిరిగి పునరాగమనం చేయడానికి చాలా కష్టపడుతున్నారు కొందరు క్రికెటర్లు. అలాంటి క్రికెటర్లలో ఖలీల్ అహ్మద్ ఒకరు. తాజాగా.. టీ20 ప్రపంచకప్-2024కి ఎంపికైన టీమిండియా రిజర్వ్ ఆటగాళ్లలో ఖలీల్ ఉన్నాడు.
టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ గా కొనసాగనున్నారా బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించారు. ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన తర్వాత కోచ్ పదవిలో కొనసాగాలనుకుంటే.. అతను మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కొత్త కోచ్ నియామకం మూడేళ్లపాటు ఉంటుందని షా స్పష్టం చేశారు. ద్రవిడ్ అసలు కాంట్రాక్ట్ రెండేళ్లు. గతేడాది నవంబర్‌లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్, సహాయక సిబ్బంది పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. రాహుల్…
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. 60 పరుగుల తేడాతో బెంగళూరు గెలుపొందింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. 16 ఓవర్లలో 181 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలవడంపై ఇంకా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పంజాబ్ బ్యాటింగ్ లో రిలీ రోసో అత్యధికంగా 61 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.