ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. పంజాబ్ బౌలర్ల ధాటికి ఆర్ఆర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. చివరి వరకు పోరాడిన రియాన్ పరాగ్ (48) ఒక్కడే అత్యధికంగా స్కోరు చేశాడు. ఈ క్రమంలో.. రాజస్థాన్ ఈ మాత్రం స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటింగ్ లో మిగత బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఓపెనర్ జోష్ బట్లర్ లేని వెలితి కనిపిస్తోంది.
Read Also: INDIA Bloc: ఇండియా కూటమికి మద్దతుపై సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు..
రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ (4), టామ్ కోహ్లర్-కాడ్మోర్ (18) మంచి ఆరంభాన్ని అందించలేకపోయారు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ (18) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ (28) పరుగుల చేసి కాస్త పర్వాలేదనింపించాడు. తర్వాత ధ్రువ్ జురేల్ డకౌట్ కాగా.. పావెల్ (4) పరుగులకు ఔటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఫెరీరా (7), ట్రెంట్ బౌల్ట్ (12), అవేశ్ ఖాన్ (3) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ స్కోరును కట్టడి చేశారు. పంజాబ్ బౌలింగ్ లో సామ్ కరన్ 2, హర్షల్ పటేల్ 2, రాహుల్ చాహర్ 2 వికెట్లు తీసుకున్నారు. అర్ష్ దీప్ సింగ్, నాథన్ ఇల్లీస్ తలో వికెట్ సంపాదించారు.
Read Also: Purushothamudu : ఊరంతా మెచ్చే ‘పురుషోత్తముడు’ వచ్చేశాడు..