SRH vs GT: నేడు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సాయంత్రం నుంచి కొనసాగిన వాన ఎంతటికీ తగ్గకపోవడంతో టాస్ వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. వర్షం కారణంగా ఒక్క బాల్ పడకుండానే మ్యాచ్ రద్దయింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. దీంతో మరో లీగ్ మ్యాచ్ మిగిలి ఉండగానే 15 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటికే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
Read Also: IPL 2024: ఉప్పల్ స్టేడియం వద్ద ఇంకా కురుస్తున్న వర్షం.. మ్యాచ్ ఇక లేనట్టే..!
మ్యాచ్ వర్షార్పణం కావడంతో సన్‌రైజర్స్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ సారి ఊపుమీదున్న సన్‌రైజర్స్ బ్యాటింగ్‌ను చూసేందుకు అభిమానులు భారీ తరలిరాగా.. వర్షం కారణంతో మ్యా్చ్ రద్దు కావడంతో నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.