ఈసారి ఐపీఎల్లో ఆర్సీబీ టైటిల్ సాధిస్తుందనే గట్టి నమ్మకం క్రికెట్ అభిమానుల్లో ఉండేది. కానీ.. ఈసారి కూడా టైటిల్ గెలువలేకపోతుంది. సీజన్ ప్రారంభంలో అన్నీ మ్యాచ్ ల్లో ఓడిపోయి.. చివర్లో గెలుస్తూ వస్తున్నారు. కానీ.. ఆర్సీబీకి ప్లేఆఫ్స్ చేరడం కష్టమే. ఈ క్రమంలో.. టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆర్సీబీకి సలహా ఇచ్చారు. భవిష్యత్తులో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే.. భారత ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. 17 ఏళ్ల నుంచి వేచి చూస్తున్న ఆర్సీబీ కప్ గెలవాలంటే భారత ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలని కైఫ్ సూచించారు.
RR vs PBKS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్..
మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.., ఆర్సీబీ వరుస ఓటములపై స్పందించారు. ఈ సీజన్ లో ఆర్సీబీ చాలా పేలవంగా ఆడిందని అన్నారు. అయితే, చివర్లో వరుస విజయాలను కూడా అభినందించారు. వరుసగా ఆరు పరాజయాలు పొంది జట్టు చాలా వెనుకబడిపోయిందని కైఫ్ తెలిపారు. వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిపోవడంతో టోర్నీలో ఆ జట్టుకు నెల రోజుల పాటు విజయం లేకుండానే మిగిలిపోయిందని అన్నారు. టోర్నీలో ఆర్సీబీ వెనుకబడి ఉండటానికి కారణం ఇదే అన్నారు. అయితే పునరాగమనాన్ని అభినందించాలని.. ఆర్సీబీ వారి అనుభవాల నుండి నేర్చుకోవాలని సూచించారు.
Viral : వీధికుక్కల దాడిలో మేకల మృతి.. మేకల కళేబరాలతో నిరసన
కాగా.. ఆర్సీబీ జట్టులో భారత ఆటగాళ్లను తీసుకోవాలన్నారు. ఆర్సీబీ ఫ్రాంఛైజీకి విదేశీ ఆటగాళ్లపై మోజు ఉందని.. మాక్స్‌వెల్ వంటి స్టార్లు లేకుండా ఎలా గెలవాలో ఆర్సీబీ ఇప్పుడు నేర్చుకుందని తెలిపారు. ఇది వారికి గుణపాఠం కావాలని.. జట్టు భారత ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టాలని అన్నారు. అప్పుడే వారు టైటిల్‌ను గెలుచుకుంటారని పేర్కొన్నారు. ఈ సీజన్ లో కేకేఆర్ ఇది చేసిందన్నారు. మరోవైపు.. రాజస్థాన్ కూడా సంజు శాంసన్, యశస్వి, ధృవ్ జురెల్ వంటి భారత ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టింది. అందుకే వారు.. మంచి పొజిషన్ లో ఉన్నారని అన్నారు. కాగా.. ఆర్‌సీబీ భారత ఆటగాళ్లను గుర్తించి వారికి మద్దతు ఇవ్వాలని చెప్పారు.