ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్లో రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 141 పరుగులు చేసింది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కాగా.. ఈ ఐపీఎల్లో రాజస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. రాజస్థాన్ ఈ ఓటమితో ప్లేఆఫ్ పోరు మరింత…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు డబల్ డెక్రర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. చెన్నైతో జరుగుతున్న మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ తక్కువ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది రాజస్థాన్. పరుగులు సాధించడంలో రాజస్థాన్ బ్యాటర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ.. చెన్నై బౌలర్లు రన్స్ చేయకుండా కట్టడి చేశారు. రాజస్థాన్ బ్యాటింగ్ లో రియాన్ పరాగ్ (47*) అత్యధికంగా పరుగులు చేసి జట్టుకు కీలక పరుగులు అందించాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. వర్షం కారణంగా.. 16 ఓవర్లకు కుదించడంతో.. 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ముంబై ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 గం.లకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంతో టాస్ ఆలస్యమైంది. కాగా.. ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. రాత్రి 9.15 గం.లకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వర్షం కారణంతో ఇరు జట్లకు ఓవర్లు తగ్గించారు. రెండు టీమ్‌లు 16 ఓవర్లు ఆడనున్నాయి.
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై కింగ్స్‌తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది. 35 పరుగుల తేడాతో గెలుపొందింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.