కొత్త భవనాలు నిర్మించినంత మాత్రాన అభివృద్ధి కాదు..
తెలంగాణ రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌భవరన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది అన్నారు. మేధావులు, మహాన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించారన్నారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ ఎంతో అంకితభావం కనబరిచారన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. శాతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందని తెలిపారు. తెలంగాణ ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందన్నారు గవర్నర్. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని తెలిపారు. రాజ్యాంగ్య రచనలో అంబేడ్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని, మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యంగం రూపొందించారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదని తెలిపారు. తెలంగాణలో ఆందోళన కర పరిస్థితులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు గవర్నర్ తమిళిసై. రాష్ట్రం లో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. కొందరికి ఫార్మ్ హౌస్ లు కాదు.. అందరికీ ఫార్మ్ లు కావాలని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కును కాపాడుకుందామని తెలిపారు. కొంత మందికి నేను నచ్చక పోవచ్చు..కానీ.. నాకు తెలంగాణ వాళ్ళు అంటే ఇష్టమన్నారు. ఎంత కష్టం అయిన పని చేస్తానని సంచలన వ్యాక్యలు తెలిపారు. పవిత్ర తెలంగాణ నేలపై జాతీయ జెండా ఎగురవేయడం గర్వంగా ఉందన్నారు. దేశభక్తితో కూడిన ఆరు దశాబ్దాల ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం అని తెలిపారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ఇతరులకు అభినందనలని, సవాళ్లకు అనుగుణంగా కొత్త విధానాలు అనుసరిస్తున్న రైతుల స్ఫూర్తికి సెల్యూట్ అన్నారు గవర్నర్.
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక అలా చేస్తే రీయింబర్స్‌మెంట్
విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది విమానయాన రంగ నియంత్రణ సంస్థ (డీజీసీఏ).. ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లను ఎయిర్‌లైన్స్ ఏకపక్షంగా డౌన్‌గ్రేడ్ చేస్తే.. రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలనే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.. విమానయాన సంస్థలు ఏకపక్షంగా డౌన్‌గ్రేడ్ చేస్తున్నాయన్న ఫిర్యాదులు వస్తుండడంతో.. డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుని.. కొత్త రూల్స్ తీసుకొచ్చింది.. దీని ప్రకారం టికెట్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తే.. దేశీ రూట్లలో ప్రయాణాలకు సంబంధించి టికెట్ ఖర్చులో 75 శాతం మొత్తాన్ని.. సంబంధిత ప్రయాణికుడికి ఎయిర్‌లైన్స్ చెల్లించాలి.. సవరించిన విధానం ప్రకారం, విమానయాన సంస్థలు ఇప్పుడు ప్రయాణీకులను అసంకల్పితంగా డౌన్‌గ్రేడ్ చేసి, టిక్కెట్‌ను కొనుగోలు చేసిన తరగతి కంటే తక్కువ తరగతికి తీసుకెళ్తే.. వారికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. బోర్డింగ్ నిరాకరించడం, విమానాల రద్దు, విమానాల ఆలస్యం కారణంగా విమానయాన సంస్థలు ప్రయాణికులకు అందించే సౌకర్యాలను సవరించినట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం తెలియజేసింది. తమ టిక్కెట్ల డౌన్‌గ్రేడ్ వల్ల ప్రభావితమైన విమాన ప్రయాణికుల హక్కులను బలోపేతం చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. సవరించిన విధానం ప్రకారం, విమానయాన సంస్థలు ఇప్పుడు ప్రయాణీకులను అసంకల్పితంగా డౌన్‌గ్రేడ్ చేసి, టిక్కెట్‌ను కొనుగోలు చేసిన తరగతి కంటే తక్కువ తరగతికి తీసుకువెళితే వారికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ రంగానికి సంబంధించి, విమానయాన సంస్థలు పన్నులతో సహా టిక్కెట్ల ధరలో 75 శాతం తిరిగి చెల్లించాలి. అంతర్జాతీయ రంగానికి, 1500 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ దూరం ప్రయాణించే విమానాలకు 30 శాతం, 1500 కిలోమీటర్ల నుండి 3500 కి.మీ మధ్య ప్రయాణాలకు 50 శాతం మరియు 3500 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణించే విమానాలకు 75 శాతం పన్నులతో సహా టిక్కెట్ ధరలో 30 శాతం తిరిగి ఇవ్వాల్సిందే. ఢిల్లీకి వెళ్లే గో ఫస్ట్ విమానం బెంగుళూరు విమానాశ్రయం నుండి 50 మంది కంటే ఎక్కువ మంది ప్రయాణీకులను తీసుకోకుండా బయలుదేరిన కొద్ది వారాల తర్వాత నిబంధనలు సవరించారు..
ఉద్యోగులకు ఐబీఎం షాక్.. 3,900 మంది ఉద్యోగాలు ఊస్ట్..
ఐటీ ఉద్యోగులను కంపెనీలు భయపెడుతున్నాయి. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో అని కంగారు పడుతున్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి టెక్ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ జాబితాలో ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం కూడా చేరింది. తాజాగా 3,900 ఉద్యోగాలను తీసేస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని అసెట్ డివెస్ట్‌మెంట్‌లలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సంస్థ బుధవారం వెల్లడించింది. అయితే క్లయింట్-ఫేసింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ నియామకాల కోసం కట్టుబడి ఉన్నట్లు సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జెమ్స్ కవనాగ్ వెల్లడించారు. ఐబీఎం వర్క్ ఫోర్స్ 1.5 శాతం ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే అమెజాన్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను తొలగించుకున్నాయి. ఆర్థికమాంద్యం పరిస్థితును బూచిగా చూపిస్తూ ఉద్యోగులను తొలగించాయి. ఖర్చులను తగ్గించుకునే యోచనతో కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. దేశీయ ఐటీ కంపెనీ విప్రో కూడా ఇటీవల ఫ్రెషర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెజాన్ 18,000 మందిని, మెటా 11,000, గూగుల్ 12,000, మెక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తాయనే వార్తలు ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
మహిళల ఐపీఎల్ జట్లకు భారీ ధర.. బీసీసీఐకి కాసుల వర్షం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్ల వేలం బీసీసీఐకి ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపించింది. ఆరంభ లీగ్‌లోనే ఐదు జట్ల అమ్మకానికిగానూ బోర్డుకు రూ. 4669.99 కోట్ల ఆదాయం సమకూరింది. బీసీసీఐ సెక్రటరీ జే షా బుధవారం ట్విటర్‌లో మొత్తం బిడ్డింగ్ ధర వివరాలను తెలియజేశారు. ఈ టోర్నీకి బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్‌గా పేరు పెట్టిందని జై షా తెలిపారు. 2008లో ప్రారంభ పురుషుల ఐపీఎల్ కోసం జట్ల బిడ్డింగ్ ద్వారా పొందిన దాని కంటే బిడ్డింగ్ మొత్తం ద్వారా వచ్చిన మొత్తం ఎక్కువ అని ఆయన వెల్లడించారు. బిగ్‌బాష్ లీగ్, హండ్రెడ్ లీగ్ సహా ఏ దేశవాళీ లీగ్ కూడా డబ్ల్యూపీఎల్‌కు దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. బుధవారం ముంబైలో ఐదు జట్లు అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లఖ్‌నవూలకు సంబంధించిన బిడ్‌లను బీసీసీఐ ఖరారు చేసింది. మొత్తం 17 బిడ్‌లు దాఖలైనట్లు బోర్డు వెల్లడించింది. అహ్మదాబాద్ టీమ్‌ను అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యధికంగా రూ.1289 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ముంబై ఫ్రాంచైజీని ముంబై ఇండియన్స్ యాజమాన్యంలోని ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.912.99 కోట్లకు గెలుచుకుంది. బెంగళూరు ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యంలోని రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 901 కోట్ల రూపాయలకు ఖరీదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ యజమానులైన జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీ ఫ్రాంచైజీని రూ. 810 కోట్ల బిడ్‌తో గెలుచుకోగా, లక్నో ఫ్రాంచైజీని రూ. 757 కోట్లకు కాప్రీ గ్లోబల్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ప్రసార హక్కుల ద్వారా సమకూరిన రూ. 951 కోట్లతో కలిపి.. ఒక్క బంతికూడా పడకుండానే మహిళల ప్రీమియర్ లీగ్ ద్వారా బోర్డు రూ. 5,650.99 కోట్ల రెవెన్యూ ఆర్జించినట్టయింది. కోల్‌కతా రూ. 666 కోట్ల బిడ్ వేసినా.. మిగతా పోటీదారులు అంతకంటే ఎక్కువ కోట్ చేశారు. దాఖలైన టెండర్లలో రాజస్థాన్ రాయల్స్ రూ. 180 కోట్ల బిడ్ అన్నింటికంటే అత్యల్పం. 2008లో ఐపీఎల్ టీమ్‌ల ద్వారా వచ్చిన దానికంటే ఈ మొత్తం ఎంతో ఎక్కువని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు.
సూర్యకుమార్ యాదవ్ లేకుండా మూడు ఫార్మాట్లూ ఉండవు..
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20లు, వన్డేల్లో సత్తా చాటాడని.. తర్వాత టెస్టుల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. ఈ స్టార్ బ్యాటర్ లేకుండా మూడు ఫార్మాట్లూ ఉండవని అన్నాడు. టెస్టుల్లోనూ అతనికి అవకాశం ఇవ్వాలని, ఎన్నో సెంచరీలు బాదగలడని రైనా అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్‌లో మునుపెన్నడూ లేని విధంగా, రికార్డులు నెలకొల్పి సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. టీ20లలో ఒక క్యాలెండర్ సంవత్సరంలో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 187.43 అద్భుత స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులను సాధించి, అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఘనతను సాధించాడు. సూర్యకుమార్ ప్రదర్శన చూస్తుంటే.. తను మూడు ఫార్మాట్లలో ఆడాలని తాను అనుకుంటున్నట్లు సురేష్ రైనా అభిప్రాయపడ్డారు. సూర్య లేకుండా మూడు ఫార్మాట్లు ఉండకూడదన్నారు. ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ బదులు సూర్య కుమార్ యాదవ్‌కు చోటివ్వడమేంటన్న విమర్శలు కూడా వచ్చాయి. గతేడాది టీ20ల్లో వెయ్యికిపైగా రన్స్ చేసినా.. టెస్టుల్లో అతడు ఏ మేరకు రాణిస్తాడన్న సందేహాలు ఉన్నాయి. అయితే సూర్య టెస్టుల్లోనూ రాణిస్తాడని అన్నాడు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. అంతేకాదు అసలు అతడు లేకపోతే మూడు ఫార్మాట్లూ ఉండవని అనడం గమనార్హం. అతని ఆటతీరు సంకల్పం, వివిధ షాట్లు ఆడే తీరుతో పాటు భయం లేకుండా ఆడతాడని రైనా అన్నాడు. మైదానాన్ని ఎలా వినియోగించుకోవాలో తనకు తెలుసన్నారు.
అమెరికాలో ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ డౌన్..
అమెరికాలో మెటాకు సంబంధించిన ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రమ్, వాట్సాప్ డౌన్ అయ్యాయి. దీంతో వేలాది మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం మెటా సోషల్ ఫ్లాట్‌ఫామ్స్ డౌన్ అయినట్లు ‘డౌన్‌డిటెక్టర్.కామ్’ వెల్లడించింది. 18,000 మంది ఇన్ స్టా యూజర్లు తాము లాగిన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. 13,000 మంది ఫేస్ బుక్ యాప్ యాక్సెస్ లో సమస్యలు ఉన్నట్లు నివేదించారు. వాట్సాప్, ఫేస్ బుక్ మెసెంజర్లకు కూడా అంతరాయం ఏర్పడినట్లు డౌన్‌డిటెక్టర్.కామ్ వెల్లడించింది. ఇటీవల కాలంలో పలు దేశాల్లో సోషల్ మీడియా యాప్స్ డౌన్ అయ్యాయి. ఇండియాలో కూడా గతంలో వాట్సాప్ డౌన్ కావడం చూశాం. గూగుల్, మైక్రోసాఫ్ట్ తో సహా అనేక కంపెనీల సేవలకు అంతరాయం ఏర్పడటం సాధారణం అయిపోయింది. మైక్రోసాఫ్ట్ నెట్ వర్కింగ్ లో బుధవారం అంతరాయం ఏర్పడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలయన్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపించింది.
‘రావణాసుర’ పోస్ట్ థియేట్రికల్ రైట్స్‌కు ఊహించని బిజినెస్
మాస్ మహారాజా రవితేజ ధమాకాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. అభిమానులు ఇప్పుడు రవితేజ రాబోయే ప్రాజెక్ట్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో ‘రావణాసుర’ ఒకటి కావడం గమనార్హం. మాస్ మహారాజా నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి రావణాసుర. యూనిక్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా నేడు స్పెషల్ గిఫ్ట్ అందించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. రావణాసురుడు పోస్ట్ థియేట్రికల్ రైట్స్ జీ నెట్‌వర్క్‌కి భారీ ధరకు అమ్ముడయ్యాయి. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జీ5 వద్ద ఉండగా, శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్ష నగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ కథానాయికలుగా నటించారు. సుశాంత్ ప్రతినాయకుడు కాగా, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా తదితరులు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌వర్క్స్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7, 2023న విడుదల కానుంది, దీనికి హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. రవితేజ మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వర్ రావులో కూడా నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ కూడా బయటకు వచ్చింది.