WPL Auction 2023: మహిళల ప్రీమియర్ లీగ్-2023 వేలం ముంబైలో జరిగింది. ఈ వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను అదృష్టం వరించింది. ఆమెను 3.4 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా మంధాన నిలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్‌ను 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన స్టార్ ఆల్ రౌండర్ నాట్ స్కివర్‌ను.. 3.20 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను ఉత్తరప్రదేశ్ వారియర్స్ 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 2.20 కోట్లకు దక్కించుకుంది.
Read Also: Pulwama Attack: పుల్వామా సైనికుల త్యాగానికి నాలుగేళ్లు.. అమర జవాన్లకు దేశం నివాళులు
షఫాలీ వర్మను 2 కోట్లకు, మారిజానే కాప్ 1.50 కోట్లకు డీసీ సొంతం చేసుకుంది. రిచా ఘోష్‌ను ఆర్‌సీబీ కోటీ 90 లక్షలకు కొనుగోలు చేసింది. ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌పై ముంబై 1.90 కోట్లు వెచ్చించింది. అలాగే ఎలిస్ పెర్రీ 1.70 కోట్లు, లెఫ్టామ్ పేసర్ రేణుకా సింగ్‌ను 1.50 కోట్లకు ఆర్‌సీబీ దక్కించుకుంది. సోఫీ ఎకెల్‌స్టోన్‌పై ఉత్తరప్రదేశ్ వారియర్స్ 1.80 కోట్లు వెచ్చించింది. తెలుగమ్మాయి అంజలీ శర్వాణీని..యూపీ వారియర్స్ జట్టు 55 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ వేలంలో అండర్ -19 ప్లేయర్స్ హవా కొనసాగింది.. వీళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛేజీలు పోటీ పడ్డాయి. కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడ్డాయి. అండర్ -19 టీమ్ కెప్టెన్, లేడీ సెహ్వగ్‌గా పేరొందిన షఫాలీ వర్మ భారీ ధర పలికింది. ఆమెను రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. వికట్ కీపర్ రీచా ఘోష్‌ను రూ.1.9 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (ఆల్‌రౌండర్) రూ.1.80 కోట్లు, యస్తికా భాటియా (వికెట్ కీపర్) రూ.1.50 కోట్లు, రేణుకా సింగ్ (పేసర్) రూ.1.50 కోట్లు, రానా (ఆల్‌రౌండర్) రూ.75 లక్షలు పలికారు.
Read Also: Punishment: మందుబాబులకు వింతశిక్ష.. స్టేషన్‌లో కూర్చోబెట్టి 1000సార్లు ఇంపోజిషన్
ఇక, అత్యధిక ధర పలికిన టాప్ భారత మహిళా క్రికెటర్ల విషయానికి వస్తే.. స్మృతి మంధాన(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) రూ.3.40కోట్లు, దీప్తి శర్మ(యుపి వారియర్స్) రూ.2.60కోట్లు, జెమిమా రోడ్రిగ్స్(ఢిల్లీ క్యాపిటల్స్) రూ.2.20కోట్లు, షెఫాలీ వర్మ (ఢిల్లీ క్యాపిటల్స్) రూ.2.00కోట్లు, పూజా వస్త్రాకర్(ఢిల్లీ క్యాపిటల్స్) రూ.1.90కోట్లు, హర్మన్‌ప్రీత్ కౌర్(ముంబయి) రూ.1.80 కోట్లు.. మరోవైపు.. అత్యధిక ధర పలికిన టాప్-5 విదేశీ మహిళా క్రికెటర్ల విషయానికి వస్తే.. అస్ల్టీ గార్డినర్(ఆస్ట్రేలియా) గుజరాత్ జెయింట్స్- రూ.3.20కోట్లు, నటాలియా స్కీవర్ బ్రంట్(ఇంగ్లండ్) ముంబై – రూ.3.20కోట్లు, బెత్ మూనీ(ఆస్ట్రేలియా) గుజరాత్ జెయింట్స్ కు రూ.2.0కోట్లు, సోఫియా ఎక్లేస్టోన్(ఇంగ్లండ్) యూపీ వారియర్స్ – రూ.1.80కోట్లు, ఎలిస్సా పెర్రీ(ఆస్ట్రేలియా) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ.1.70కోట్లు పలికారు.