విశాఖపట్నంలోని వైఎస్ఆర్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. పక్షిలా ఈజీగా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో అందుకున్న ఈ డైవింగ్ క్యాచ్ ను క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు క్యాచ్ ఆఫ్ ద సెంచరీగా అభివర్ణీస్తున్నారు. భారత ఇన్నింగ్స్ 9.2 ఓవర్ లో సీన్ అబాట్ బౌలింగ్ చేస్తుండగా ఫస్ట్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో హార్థిక్ పాండ్యా(1) పెవిలియన్ కు తిరుగు పయనం అయ్యాడు.
Also Read : Naveen Case: నిహారికకు బెయిల్ మంజూరు.. జైలు నుంచి విడుదల
వాస్తవానికి ఈ క్యాచ్ సెకెండ్ స్లిప్ ఫీల్డర్ అందుకోవడం కూడా కష్టమే.. అలాంటిది స్టీవ్ స్మిత్ సూపర్ మ్యాచ్ లా గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్ అందుకుని యావత్ క్రికెట్ ప్రంపచాన్ని ఔరా అనిపించాడు. స్మిత్ కు ఇలాంటి ఫీల్డింగ్ విన్యాసాలు కొత్త కానప్పటికీ, ఈ క్యాచ్ మాత్రం అతనికి జీవితాంతం గుర్తుండిపోతుంది. స్మిత్ సెన్షేషనల్ క్యాచ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇది చూసి స్మిత్ ను విమర్శించే వారు సైతం అతన్ని మెచ్చకోకుండా ఉండలేకపోతున్నారు.
Also Read : Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి ఢిల్లీ పోలీసులు.. టైం కావాలన్న కాంగ్రెస్ నేత
ఇదిలా ఉంటే ఆసీస్ తో రెండో వన్డేలో భారత్ జట్టు 117 పరుగులకే ఆలౌట్ అయింది. కేవలం 26 ఓవర్లు ఆడిన టీమిండియా కుప్పకూలింది. సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్, మహ్మద్ షమీ డకౌట్లు కావడంతో పాటు రోహిత్ శర్మ(13), కేఏ రాహల్(9), హార్థిక్ పాండ్యా(1), జడేజా(160 దారుణంగా విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ (31)తో పాటు చివరలో అక్షర్ పటేల్ 29 పరుగులు చేయడంతో టీమిండియాను 117 పరుగులు అయిన చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 2.4 ఓవర్లలో 23 పరుగులు చేసింది. క్రీజులో మిచేల్ మార్ష్ (9), ట్రావీస్ హెడ్ (10) ఉన్నారు.