మీ గత పాలనలో రైతుల పడ్డ గోస గుర్తు చేసుకోండి
రైతుల పేరిట రాజకీయం వద్దని, నాలుగేళ్లలో కాంగ్రెస్ ఎంపీలు ఎన్ని సమస్యల మీద ఎన్ని దీక్షలు చేశారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అకాలవర్షాలకు పంటనష్టంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి… అకాలవర్షాల గురించి నాలుగు రోజుల ముందు నుంచే ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నదని, అకాలవర్షాలు కురిసిన 24 గంటలలోపే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో పర్యటించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించడం జరిగిందని, వివిధ ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పంట నష్టం జరిగిన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులకు భరోసా కల్పిస్తున్నారన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు చేసే రాజకీయ దీక్షలను రైతులు గమనిస్తారని, సమస్యను ప్రభుత్వం దృష్టికి ఒక ప్రజాప్రతినిధిగా కోమటిరెడ్డి గాని మరొకరు గాని తీసుకురావడం తమ బాధ్యత అన్నారు. కానీ రాజకీయ దురుద్దేశాలతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే అలోచన సబబు కాదని ఆయన హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు, వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ అనుకూల విధానాలతో దేశంలోనే అగ్రగామిగా సాగుతున్నదని, ప్రభుత్వ చర్యల మూలంగా ఈ యాసంగిలో 56.44 లక్షల ఎకరాలలో వరి సాగవుతున్నదని, రైతుబంధు, రైతుభీమా, ఉచితకరంటు, సాగునీటి కల్పనతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు.
శాసన సభ కాదు.. కౌరవ సభ.. చరిత్రలో ఇది చీకటి రోజు.
శాసన సభలో పార్టీ ఎమ్మెల్యే స్వామిపై దాడిని తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు.. అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు ఒక చీకటి రోజుగా పేర్కొన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై దాడి జరిగిన ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు.. సీఎం వైఎస్ జగన్ ప్రోద్భలంతో, ఒక వ్యూహంతోనే నేడు దళిత ఎమ్మెల్యే స్వామిపై దాడి చేశారు.. నేటి సభలో జరిగిన ఘటనతో జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడు అంటూ ఫైర్ అయ్యారు. చట్టసభలకు మచ్చ తెచ్చిన సీఎంగా జగన్ నిలిచిపోతాడన్న ఆయన.. స్వయంగా సభలో ఎమ్మెల్యేలపై దాడికి దిగడం ద్వారా వైసీపీ సిద్దాంతం ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యిందన్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో సీఎం జగన్‌ఖు పిచ్చెక్కి ఇలా వ్యవహరించాడని.. ఇది శాసన సభ కాదు.. కౌరవ సభ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు.
మానవబాంబులను రిక్రూట్ చేసుకునే పనిలో ఖలిస్తాన్ నేత.. డి-అడిక్షన్ సెంటర్లలో బ్రెయిన్ వాష్
ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడైన అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ విస్తృతంగా వెతుకుతున్నాయి. పంజాబ్ సరిహద్దులను మూసేసి అతడిని పట్టుకునేందుకు రెండు రోజులు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 78 మంది మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. సున్నిత ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. ఇదిలా ఉంటే అమృత్ పాల్ సింగ్ గురించి విస్తూపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఏకంగా పంజాబ్ యువతను ‘మానవబాంబులు’గా మార్చేందుకు డ్రగ్స్ డి-అడిక్షన్ సెంటర్లను ఉపయోగించుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. గురుద్వారాల్లో ఆయుధాలను నిల్వ చేయాలనే ప్లాన్ లో ఇతడు ఉన్నాడని తెలిసింది. దీంతోనే ఇలాంటి ఖలిస్తానీ సంఘవిద్రోహ శక్తులను పట్టుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో అతడిని అరెస్ట్ చేసేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించింది.
సమ్మర్ హాలీడేస్ లో అక్కడికి వెళ్దాం..
సమ్మర్ సెలవుల్లో ఎక్కడికి వెళ్లాలి? పిల్లా పాపలతో కలిసి ఎక్కడికెళ్తే అన్ని మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తాం? అని పెద్దగా ఆలోచించకుండా లగేజ్ సర్దేసుకొని కశ్మీ్ర్ లోని లద్దాఖ్ కో, ఒడిశాలో మయూర్ భంజ్ కు ప్రయాణమైపోవడమే.. ఆ రెండే ఎందుకంటారా ప్రపంచవ్యాప్తంగా అత్యంత అద్భుతమైన ప్రాంతాల జాబితా2023లో మన దేశం నుంచి చోటు దక్కించుకున్న ప్రాంతాలు అవే మరి. అరుదైన పులులు, పురాతయన ఆలయాలు, సాహసంతో కూడిన ప్రయాణం, ఆహా అనిపించే ఆహారం అక్కడ లభిస్తాయని తెలుస్తోంది. ఇవన్నీ లద్దాఖ్, మయూర్ భంజ్ లకు 50 పర్యాటక ప్రాంతాలతో రూపొందించిన ఈ జాబితాలో చోటు కల్పించాయి. లద్దాఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ అడుగు పెడితే స్వర్గమే తలవంచి భూమికి చేరిందా అనిపిస్తుందని తెలిపింది. మంచుకొండలు, టిబెటన్ బౌద్ద సంస్కృతి కనువిందు చేస్తాయి.. అక్కడి వాతావరణాన్ని ఫీల్ అవడానికి పదేపదే లద్దాఖ్ వెళ్లాల్సిందే. ఇక మయూర భంజ్ అంటే పచ్చదనం.. సాంస్కృతి వైభవం, పురాతన ఆలయాలు, కళాకృతులకు ఆలవాలం, ప్రపంచంలో నల్లపులి సంచరించే ఏకైక ప్రాంతం అంటూ కొనియాడింది. ఏటా ఏప్రిల్ లో మయూర్ భంజ్ లో జరిగే చౌ డ్యన్స్ ఫెస్టివల్ అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఒడిశా సాంస్కృతిక వారసత్వంతో పాటు ఏకశిలా శాసనాలు గొప్పగా ఉంటాయని పేర్కొంటారు. జాబితాలో అత్యధిక శాతం అమెరికా ప్రాంతాలకే చోటు దక్కింది. టాంపా( ఫ్లోరిడా), విల్లామెట్ (ఓరెగాన్),టక్సాన్ ( అరిజోనా ), యోసెమైట్ నేషనల్ పార్క్ ( కాలిఫోర్నియా ) వంటివి వాటిలో ఉన్నాయి.
రెండో టెస్టులో తేలిపోయిన లంక.. క్లీన్ స్వీప్ చేసిన కివీస్
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ సిప్ ఫైనలో రేసులో టీమిండియా, ఆస్ట్రేలియాలతో శ్రీలంక పోటీ పడింది. ఇండోర్ టెస్టు గెలిచి ఆస్ట్రేలియా నేరుగా ఫైనల్ కు అర్హత సాధించగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఆధిక్యం చూపించి.. భారత క్రికెట్ ఫ్యాన్స్ ని లంకేయులు కంగారు పెట్టారు. శ్రీలంక పోరాటం కారణంగా తొలి టెస్టులో ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో మాత్రం లంక జట్టు అలాంటి పోరాట పటిమ చూపించలేకపోయింది. తొలి టెస్టులో రెండో వికెట్ల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకున్న న్యూజిలాండ్, రెండో టెస్టులో పూర్తి డామినేసన్ చూపించి.. ఇన్సింగ్స్ 58 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వెల్లింగ్టన్ టెస్టులో టస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 123 ఓవర్లు బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్సింగ్స్ డిక్లేర్ చేసింది. టామ్ లాథమ్ 21 పరుగులు చేసి అవుట్ కాగా డివాన్ కాన్వే 108 బంతుల్లో 78 పరుగులు చేశాడు. కేన్ విలియమ్సన్, హెన్సీ నికొలస్ కలిసి మూడో వికెట్ కి 370 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 296 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్సర్లతో 215 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్, టెస్టు కెరీర్ చరిత్రలో 25వ సెంచరీ అందుకున్నాడు.
‘దసరా’ రిలీజ్ అయ్యే వరకూ ఆపుకోవచ్చు కదయ్యా…
పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేసినప్పుడు ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలో చెయ్యాలి. భారి బడ్జట్ తో సినిమా చేసి హ్యుజ్ ప్రమోషన్స్ చేస్తున్న సమయంలో ఆ చిత్ర యూనిట్ దృష్టి అంతా ఆ సినిమాపైనే ఉండాలి. కొంచెం అటు ఇటు డీవియేట్ అయినా ఆడియన్స్ కాన్సెన్ట్రేషన్ లో డిస్ట్రాక్షన్ వచ్చే ప్రమాదం. ఈ విషయం తెలియక SLV సినిమాస్ రిస్క్ చేస్తోంది. నానితో ‘దసరా’ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న ప్రొడక్షన్ హౌజ్ ‘SLV సినిమాస్’. గతంలో పడి పడి లేచే మనసు, విరాటపర్వం లాంటి సినిమాలు చేసిన SLV సినిమాస్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా దసరానే. మార్చ్ 30న ప్రేక్షకుల ముందుకి రానున్న దసరా ప్రమోషన్స్ ని మంచి స్వింగ్ లో చేస్తున్న సమయంలో SLV సినిమాస్ నుంచి ఎలాంటి అప్డేట్ బయటకి వచ్చినా అది దసరా సినిమా గురించే అనుకుంటారు ఆడియన్స్. అలాంటిది దసరా సినిమా గురించి ఇంకో సినిమా గురించి అప్డేట్ బయటకి వచ్చింది అంటే ఫాన్స్ అప్సెట్ అవ్వడంతో పాటు డిస్ట్రాక్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు SLV సినిమాస్ ఇలాంటి తప్పునే చేస్తుంది. దసరా రిలీజ్ కి రెడీ అవుతున్న సమయంలో మార్చ్ 30 వరకూ వెయిట్ చెయ్యకుండా SLV సినిమాస్ తమ కొత్త సినిమా అప్డేట్ ని అనౌన్స్ చేస్తోంది. SLV సినిమాస్ గతేడాది ఏప్రిల్ లో యంగ్ హీరో నాగ శౌర్యతో కలిసి ఒక సినిమా అనౌన్స్ చేసింది. పవన్ బాసంశెట్టి అనే కొత్త దర్శకుడితో SLV సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ ని మార్చ్ 22న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. గత ఉగాదికి అనౌన్స్ అయిన మూవీ టైటిల్ ఈ ఉగాదికి అనౌన్స్ చేస్తున్నారు. పవన్ సీహెచ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ టైటిల్ ని ఉగాది రోజున అనౌన్స్ చేస్తున్నాం అంటూ SLV సినిమాస్ నుంచి బయటకి రాగానే కొన్ని రోజులు ఆగలేవా? దసరా రిలీజ్ అయ్యే వరకూ వేరే సినిమాల అప్డేట్ ఇవ్వకు, దసరా సినిమాని బయటకి రానివ్వండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి అభిమానుల కోరికని మన్నించి నాగ శౌర్య సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ని SLV సినిమాస్ కాస్త వాయిదా వేస్తారేమో చూడాలి.