Cricket : మా బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయాం: రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు్కు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా జోరుకు ఆసీస్ బ్రేక్ లు వేసింది. ఆదివారం విశాఖ సాగరతీరం వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియాను 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టు చిత్తు చేసింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ వికెట్ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే ఛేధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి వన్డే చెన్నై వేదికగా మార్చ్ 22న జరగనుంది. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమే అని రోహిత్ శర్మ అంగీకరించాడు.
Also Read : Kerala: అలా అయితే ఓటేస్తాం.. బీజేపీకి మద్దతుగా క్రైస్తవ మతగురువు వ్యాఖ్యలు..
Also Read
- India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
- Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
- Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ పరంగా మేము దారుణంగా విఫలమయ్యాం.. స్కోర్ బోర్డుపై తగినంత పరుగులు ఉంచలేకపోయామంటూ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ఇటువంటి మంచి వికెట్ పై కేవలం 117 పరుగుల మాత్రమే చేస్తామని అస్సలు ఊహించలేదు.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడం మా జట్టును తీవ్రంగా దెబ్బతీసిందన్నాడు. తొలి ఓవర్ లో శుబ్ మన్ గిల్ వికెట్ ను కోల్పోయినప్పుడు.. నేను విరాట్ ఇన్సింగ్స్ ను కాస్త సెట్ చేశాము.. మేమిద్దరం త్వరగా 30 నుంచి 35 పరుగులు రాబట్టాము.. అయితే తర్వాత వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయాం.. అది మమ్మల్ని మరింత వెనక్కి నెట్టిందని రోహిత్ శర్మ తెలిపారు.
Also Read : Cricket : వారం రోజుల వరకు ధోని నిద్రపోయేవాడు కాదు.. అసలు విషయం చెప్పిన ఊతప్ప
అటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి మేము తిరిగి కోలుకోలేకపోయాం.. ఈ రోజు మాకు పూర్తిగా కలిసి రాలేదు అని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. స్టార్క్ అద్బుతమైన బౌలర్.. అతడు కొత్త బంతితో అద్బుతాలు సృష్టిస్తాడు.. స్టార్క్ కొత్త బంతిని స్వింగ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు.. ఇక మార్ష్ ఒక మంచి పవర్ హిట్టర్ అని మనకు తెలుసు అని రోహిత్ అన్నాడు. అతడు సూపర్ ఇన్సింగ్స్ ఆడాడు.. అతను ప్రపంచంలోనే పవర్ హిట్టిర్లలో టాప్ 3 లేదా నాలుగో స్థానంలో ఉంటాడు అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!