ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ సిప్ ఫైనలో రేసులో టీమిండియా, ఆస్ట్రేలియాలతో శ్రీలంక పోటీ పడింది. ఇండోర్ టెస్టు గెలిచి ఆస్ట్రేలియా నేరుగా ఫైనల్ కు అర్హత సాధించగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఆధిక్యం చూపించి.. భారత క్రికెట్ ఫ్యాన్స్ ని లంకేయులు కంగారు పెట్టారు. శ్రీలంక పోరాటం కారణంగా తొలి టెస్టులో ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో మాత్రం లంక జట్టు అలాంటి పోరాట పటిమ చూపించలేకపోయింది. తొలి టెస్టులో రెండో వికెట్ల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకున్న న్యూజిలాండ్, రెండో టెస్టులో పూర్తి డామినేసన్ చూపించి.. ఇన్సింగ్స్ 58 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
Also Read : Indigo Flight : ఇండిగో విమానానికి తప్పిన ముప్పు
వెల్లింగ్టన్ టెస్టులో టస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 123 ఓవర్లు బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్సింగ్స్ డిక్లేర్ చేసింది. టామ్ లాథమ్ 21 పరుగులు చేసి అవుట్ కాగా డివాన్ కాన్వే 108 బంతుల్లో 78 పరుగులు చేశాడు. కేన్ విలియమ్సన్, హెన్సీ నికొలస్ కలిసి మూడో వికెట్ కి 370 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 296 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్సర్లతో 215 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్, టెస్టు కెరీర్ చరిత్రలో 25వ సెంచరీ అందుకున్నాడు.
Also Read : Kishan Reddy : మిత్రా మెగాటెక్స్ టైల్స్ పార్క్‌కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి
అహ్మదాబాద్ టెస్టులో విరాట్ కోహ్లీ 28వ సెంచరీ అందుకోగా శ్రీలంకతో తొలి టెస్టు రెండో ఇన్సింగ్స్ లో సెంచరీతో 27వ టెస్టు సెంచరినీ కేన్ విలియమ్సన్ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ టెస్టు సెంచరీని లంకేయులతో జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీతో కేన్ విలియమ్సన్.. విరాట్ రికార్డును సమయం చేశాడు. డార్ల్ మిచెల్ 17 పరుగుల చేసి అవుట్ కాగా హన్రీ నికోలస్ 240 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 200 పరుగుల చేసి నాటౌట్ గా నిలిచాడు. తొలి ఇన్సింగ్స్ లో 164 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది.
Also Read : Chandrababu Naidu: శాసన సభ కాదు.. కౌరవ సభ.. చరిత్రలో ఇది చీకటి రోజు.
కెప్టెన్ దిముత్ కరుణరత్నే 188 బంతుల్లో 9 ఫోర్లతో 89 పరుగుల చేయగా దినేశ్ చండీమల్ 37, నిశాన్ మధుశ్క 19 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేకపోయారు. శ్రీలంక ఇన్సింగ్స్ లో కుశాల్ మెండిస్, ధనంజయ్ డి సిల్వ, రజిత, అసిత ఫెర్నాండో డకౌడ్ అయ్యారు. ఫాలో ఆన్ ఆడిన లంక, 142 ఓవర్లలో 358 పరుగులకి ఆలౌట్ అయింది. ఒషాడో ఫెర్నాండో 5 పరుగులు చేయగా దిముత్ కరుణరత్నే 51 పరుగులు, కుశాల్ మెండిస్ 50, దినేశ్ చండీమల్ 62 పరుగులు చేశారు. డబుల్ సెంచరీ చేసిన హెన్రీ నికోలస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోగా.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు.