బెజవాడలో ప్రైవేట్ బస్సు బోల్తా విజయవాడలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది.. గొల్లపూడి సమీపంలో ఈ ఘటన జరిగింది.. విజయవాడ నుంచి హైదరబాద్ వైపు వెళ్తున్న BSR ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది.. టిప్పర్ లారీ వచ్చి బస్సును ఢీ కొనడంతో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.. ప్రమాద సమయంలో సుమారుగా 30 మంది బస్సుల్లో ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తోంది.. వీరిలో దాదాపు 20 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు..…
2024 ఎన్నికల తర్వాత ఏపీలో ఆ ప్రాంతీయ పార్టీ కనుమరుగు..! అది ఏ పార్టీ..? 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ నేత విష్ణువర్ధన రెడ్డి.. తిరుమలలో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు.. ఇక, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారబోతుందని జోస్యం చెప్పారు.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్…
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ రోజే ఆ టికెట్లు అన్ని విడుదల.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం రానే వచ్చింది.. జులై మాసానికి సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటు.. వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను ఈ రోజు ఆన్లైన్లో పెట్టనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ రోజు ఉదయం 10 గంటలకు జులై నెలకు సంబంధించి లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది.. ఇక, ఉదయం…
గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళిక ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీల భర్తీపై కసరత్తు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయోననే సమాచారాన్ని ఏపీ సర్కార్ సేకరిస్తోంది.. ఇప్పటి వరకు గ్రూప్-1 కింద 140 పోస్టులు, గ్రూప్-2 కింద 1082 పోస్టులున్నట్టు గుర్తించారు సంబంధిత అధికారులు.. 12 శాఖల పరిధిలో గ్రూప్-1 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చింది. హెచ్‌వోడీలతో పాటు…
మూలపేట పోర్టుకు శంకుస్థాపన.. ప్రత్యేక ఏంటి? శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు.. సంతబొమ్మాళి మండలం మూలపేటకు వెళ్లనున్న ఆయన.. మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేయనున్నారు.. దీనికోసం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్లనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. విశాఖపట్నం నుండి చాపర్ లో శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంటారు.. ఉదయం 10.15 గంటలకు మూలపేట చేరుకోనున్న ముఖ్యమంత్రి.. ఉదయం 10.30 – 10.47 గంటల మధ్య…
Shivam Dubey : శివమ్ దూబే గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతున్నాడంటే తన తండ్రి చేసిన త్యాగం అతడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. అతని ప్రస్తుతం వయసు 25 ఏళ్లు మాత్రమే.
హరీష్ రావు వ్యాఖ్యలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి.. తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు ఎందుకు ఆచరించలేదు? అని ప్రశ్నించారు.. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామన్న విషయం ఏమైంది? అని నిదీశారు.. విభజన…
కూల్ కూల్‌గా ప్రయాణం.. ఆర్టీసీలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు టీఎస్ఆర్టీసీ హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ అంతటా ప్రజలకు క్లీనర్, మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు పనులు మొదలు పెట్టింది. వచ్చే నెల నుండి హైటెక్ ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ బస్సులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు జరుగుతున్నాయి. సోమవారం బస్‌భవన్‌లో టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ బస్‌భవన్‌లో ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల తొలి నమూనాలను పరిశీలించి, ప్రయాణికులకు అందించే సౌకర్యాలపై అధికారులతో సవివరంగా చర్చించారు.…
ముందస్తు బెయిల్ పిటిషన్లో కీలక అంశాలు.. ఇది కుట్ర..! ఆ విషయం తెలిసే హత్య..! మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నిన్న వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ.. మరోసారి ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది.. ఆ నోటీసుల ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాయలంలో వైఎస్ అవినాష్‌రెడ్డి హాజరుకావాల్సి ఉంది.. అయితే, ఈ…
యర్రగొండపాలెంలో టెన్షన్ టెన్షన్.. 144 సెక్షన్ విధింపు.. యర్రగొండపాలెంలో నాలుగు రోజులపాటు 144 సెక్షన్ అమలు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి యర్రగొండపాలెం లోని ఇజ్రాయెల్ పేటలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకుని ఘర్షణకు దిగారు. దీంతో ఓ కానిస్టేబుల్ సహా పది మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. స్థానిక పోలేరమ్మ ఆలయానికి ముందు ఆర్చి నిర్మాణాన్ని ప్రారంభించటంతో వివాదం తలెత్తింది. ఆర్చి నిర్మాణం కోసం ఏర్పాటు…