భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన.. విశేషాలు ఇవే.. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ తర్వాత రూ. 23.73కోట్లతో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు…
సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ దృష్టి సారించిన ప్రభుత్వం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ (SSMPP)కి పర్యావరణ క్లియరెన్స్ (EC) ఇతర అవసరమైన అనుమతులను అధికారుల నుండి త్వరలో పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘం (CWC), కేంద్ర పర్యావరణ & అటవీ మంత్రిత్వ శాఖకు పంపిన ప్రాజెక్ట్ తాజా వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) అన్ని సంభావ్యతలలో, పర్యావరణ…
కలకలం రేపిన ఈ-మెయిల్.. తిరుమలలో హై అలర్ట్.. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఏడుకొండలపై ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు వచ్చిన ఓ సమాచారం అందరినీ ఆందోళనకు గురిచేసింది.. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నారంటూ ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు సమాచారం చేరవేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. దీంతో అప్రమత్తమైన పోలీసులు. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.. ఇక, తిరుమలలో ఉగ్రవాదుల కదలికలు నిజమేనా అని తేల్చే పనిలో భాగంగా సీసీ…
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్.. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. జీవో Ms. No 66 ద్వారా ఉద్యోగులకు DA, G.O. Ms. No. 67 ద్వారా పెన్షనర్లకు DR 2.73 శాతం మంజూరు చేశారు. ఈ కొత్త డీఏను జూలై 1, 2023 నుంచి…
మంత్రి మల్లారెడ్డికి ఏపీ మంత్రి కౌంటర్.. ఇక్కడికి వచ్చి చూడండి..! తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏపీ వచ్చి చూడాలని సూచించారు.. పోలవరం ప్రాజెక్టు గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తెలంగాణ మంత్రులు మాట్లాడకపోవడం బెటర్ అని హితవుపలికిన ఆయన.. ఏపీలో సామాజిక న్యాయం అమలు అవుతుందన్నారు.. పోలవరం ప్రాజెక్టును అడ్డుకున్నది వారి నాయకత్వమే…
రేపు కొత్త సచివాలయ ప్రారంభోత్సవం.. ఆ రూట్లల్లో వెళ్లి పరిషాన్ అవ్వకండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం రేపు ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఈ క్రమంలో సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఆదివారం నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ప్రధానంగా ట్యాంక్‌బండ్, నెక్లెస్…
రూ.2వేల కోసం రెండు కిలోల బంగారం స్మగ్లింగ్.. సరిహద్దులో పట్టుబడిన మహిళ పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో బంగ్లాదేశ్ నుంచి 27 బంగారు కడ్డీలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గురువారం అరెస్టు చేసింది. స్వాధీనం చేసుకున్న బంగారు కడ్డీల బరువు 2 కిలోల కంటే ఎక్కువ. దాని విలువు దాదాపు రూ.1.29 కోట్లు ఉంటుందని అంచనా. మాణికా ధర్ (34)గా గుర్తించిన స్మగ్లర్ 27 బంగారు…
బాలకృష్ణ కంటిచూపుతోనే చంపేస్తాడు.. అది ఎవరి వలన కాదు నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ వేడుకలకు టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు భారీ ఎత్తులో తరలివచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, చంద్రబబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ .. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా బాలకృష్ణ గురించి,…
అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ జూన్ 5కి వాయిదా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.. మరోవైపు ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.. ఆయన ముందస్తు బెయిల్‌పై విచారణ సమయంలో హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఇవాళ సాధ్యం కాదని తెలిపింది తెలంగాణ హైకోర్టు.. వాదనలు…