హరీష్‌రావుకి కౌంటర్.. ఒకే వర్షంతో హైదరాబాద్ మునిగిపోతుంది..! తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంతరి కార్మూరి నాగేశ్వరరావు.. హరీష్ రావును రండి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి తొంగి చూడండి అని సవాల్ చేశారు.. ప్రతి ఇంట్లోనూ మళ్ళీ జగన్ రావాలి అని ప్రజలు అంటున్నారు.. ఇక్కడ ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు, రోడ్లు.. ఇతర అంశాలను ప్రస్తావించిన హరీష్‌రావు.. ఏపీ కార్మికులు ఇక్కడ…
ఏపీ మంత్రులకు హరీష్‌రావు కౌంటర్.. మా గురించి మాట్లాడకండి మీకే మంచిది.. తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. దీంతో.. ఏపీ మంత్రులు కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు.. ఇక, వారి వ్యాఖ్యలపై మరోసారి అదేస్థాయిలో స్పందించారు మంత్రి హరీష్‌రావు.. సంగారెడ్డి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందని సవాల్ చేశారు. 56 లక్షల ఎకరాల్లో యాసంగి…
Javed Miandad: పాకిస్తాన్ లో జరగబోయే ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి భారత జట్టు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కారాలుమిరియాలు నూరుతోంది. పాక్ మాజీ ఆటగాళ్లు భారత్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ నియంతలా ప్రవర్తిస్తోందని పాక్ మాజీ ఆటగాడు, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో భాగంగా ముంబయితో జరుగుతున్న మ్యా్చ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తొలి ఇన్సింగ్స్ ముగిసింది. అయితే ముంబయికి 173 పరుగుల లక్ష్యాన్ని నిర్థేశించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 9.4 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ టీమ్ ఓపెనర్స్ కెప్టెన్ రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగిపోతున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. బీఆర్ఎస్ వైఖరి స్పష్టం చేసిన తోట వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇప్పుడు ఏపీ, తెలంగాణలో అధికార పార్టీల మధ్య కాకరేపుతోంది.. బిడ్డింగ్‌లో పాల్గొనే విషయంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పర్యటిస్తోంది అధికారుల బృందం.. బిడ్‌కు సంబంధించిన సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తుండగా.. అసలు బిడ్‌లో పాల్గొంటే ప్రైవేటీకరణకు మద్దతు తెలిపినట్టే అంటోంది ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన…
మంత్రిగా ఏడాది పూర్తిచేసుకున్న రోజా.. మిగతా మంత్రులతో పోల్చుకుంటే నాకే ప్రశంసలు..! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యూత్ ఐకాన్ అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి ఆర్కే రోజా.. అమరావతిలో తన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె.. మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది ముగిసిన క్రమంలో ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష చేపట్టారు.. ఇక, ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి రోజాకు అభినందనలు తెలిపిన అధికారులు. ఈ ఏడాది కాలంలో మిగిలిన మంత్రులతో…
మత్స్యకారులు అలర్ట్.. 61 రోజుల పాటు చేపల వేట నిషేధం.. సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపల వేట 61 రోజులపాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఈ విషయాన్ని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాదేశిక సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు అనగా మెకనైజ్డ్ మరియు మోటారు బోట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల…
Sports Sponsorships: మన దేశ క్రీడా రంగానికి 2022వ సంవత్సరం మరపురాని ఏడాదిగా మిగిలిపోయింది.. విజయాల పరంగా కాదు.. వ్యాపారం పరంగా. ఎందుకంటే.. గతేడాది.. స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్‌లు ఏకంగా 49 శాతం వృద్ధి చెందాయి. తద్వారా 14 వేల 209 కోట్ల రూపాయలకు చేరాయి. పోయినేడాది పెద్ద సంఖ్యలో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగటమే ఇందుకు కారణం.
ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల మాస్ కాపీయింగ్ కలకలం సృష్టిస్తోంది.. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు జగ్గయ్యపేటలో పరీక్షలకు హాజరవుతున్నారు.. ముడు సెంటర్లలో దాదాపు 700 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.. జగ్గయ్యపేట ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఓపెన్ ఇంటర్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. అయితే, ఓపెన్ ఇంటర్ పరీక్షల లో జవాబు పత్రాలు అందిస్తామంటూ విద్యార్థికి రూ.15 వేల నుంచి 25 వేల…