సిక్కులకు సీఎం గుడ్‌న్యూస్.. ప్రత్యేక కార్పొరేషన్, మరిన్ని ప్రయోజనాలు..
సిక్కుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో ఈ రోజు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు సీఎం.. ఏపీ స్టేట్ మైనార్టీస్ కమిషన్ సభ్యుడు జితేందర్‌జిత్ సింగ్ నేతృత్వంలో సిక్కు పెద్దలు సీఎంను కలిశారు.. ఒక శతాబ్దం కిందటి నుంచి సిక్కులు ఇక్కడ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.. సిక్కుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు సిక్కు పెద్దలు.. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. సిక్కుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఇక, గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తికి కూడా సీఎం జగన్ ఆమోదం తెలిపారు.. గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు… పూజారులు, పాస్టర్లు, మౌల్వీల్లానే ప్రయోజనాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవు దినంగా ప్రకటించేందుకు కూడా అంగీకారం తెలిపారు సీఎం జగన్.. ఒక మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని తనను కలిసిన సిక్కు పెద్దలకు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
ఇనాళ్లు ఏం పీకారు… గుడ్డి గుర్రాల పళ్లు తోమారా
మంత్రి కేటీఆర్ నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్లు అధికారం ఇస్తే… ఏం పీకారని ప్రశ్నించారు. గుడ్డి గుర్రాల పళ్లు తోమారా అంటూ ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేక రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారని, అలాంటి కాంగ్రెస్ అధికారం ఇవ్వాలని అడుగుతుందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. అంతేకాకుండా.. ప్రధాని మోడీపైనా..బీజేపీ ప్రభుత్వంపైనా మండిపడ్డారు. మోదీ దేవుడు అంటూ బీజేపీ నేతలు పొగిడేస్తుంటారు. కానీ మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచేసినందుకు దేవుడా? లేదా వంట గ్యాస్ ధర రూ.1200లకు పెంచినందుకు దేవుడా? అని ప్రశ్నించారు. అదానీకి మాత్రమే ప్రధాని మోదీ దేవుడు కానీ ప్రజలకు కాదన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు అన్నీ అదానీకి కట్టబెట్టి మోదీ ఆదానీకి మాత్రమే దేవుడు ప్రజలకు కాదన్నారు.
కేటీఆర్ క్షమాపణ చెప్పాలి..
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. అయితే.. ప్రియాంకా గాంధీ రాక నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పొలిటికల్ టూరిస్టులు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ నేతలు మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి మాట్లాడుతూ.. ప్రియాంకా గాంధీని పొలిటికల్ టూరిస్ట్ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ పేరుతో వివిధ రాష్ట్రాలు తిరుగుతున్న మీ నేతలు కూడా పొలిటికల్ టూరిస్టులేనా? అని ఆయన ప్రశ్నించారు. ప్రియాంకా గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు మంత్రి కేటీఆర్‌కు లేదన్నారు. రేవంత్ రెడ్డిని గాడ్సే అనడం సరికాదని, వెంటనే ప్రియాంకా గాంధీకి, రేవంత్ రెడ్డికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. టీఎస్పీఎస్సీ కేసులో సిట్ రిపోర్ట్ ఇవ్వకముందే అందులో ఇద్దరే ఉన్నారని కేటీఆర్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేటీఆర్ రాజ్యాంగేతర శక్తిగా మారారన్నారు మల్లు రవి.
కర్ణాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం..
కర్ణాటక అసెంబ్లీ 2023 ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొన్ని రోజులుగా మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నుంచి ముఖ్య నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరోవైపు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నంలో భాగంగా ర్యాలీలు, రోడ్ షోలు కూడా నిర్వహించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పార్టీల మధ్య సవాళ్లకు ప్రతి సవాళ్ల విసురుకుంటూ పలువురు నేతలు విమర్శలకు దిగారు. అయితే కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా 113 అసెంబ్లీ స్థానాలు గెలవాలి. ఇక మొత్తం 224 సీట్లలో 36 సీట్లు ఎస్సీ, 15 ఎస్టీ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో మే 10న కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కోసం ఓటింగ్ జరుగనుంది. అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి అని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మే 13న తుది ఫలితాలు వెల్లడికానుండగా.. మే 24తో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుంది.
స్పేస్ సెంటర్‌ను కూల్చివేసేందుకు నాసా ప్లాన్..
రానున్న రోజుల్లో ప్రపంచానికి మరో స్కైలాబ్ నుంచి ముప్పు పొంచి ఉంది. అంతరిక్షంలో ఏళ్లుగా సంచరిస్తున్న ఓ భారీ ప్రయోగశాల పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోనున్నట్లు తెలుస్తోంది. దీన్ని సురక్షితంగా భూమిపై కూల్చేందుకు నాసా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. మరో ఎనిమిదేళ్లలో( 2031 ) ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌ను అమెరికా కూల్చివేయనుంది. అనేక అంతరిక్ష ప్రయోగాలకు కీలకంగా ఉన్న ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సమయం ముగిసింది. ఈ స్పేస్ స్టేషన్ బరువు సుమారు 400 టన్నులు.. ఇది దాదాపుగా 200 ఏనుగుల కన్నా బరువుంటుంది. మరి టైమ్ అవుట్ అయిన ఇంత భారీ అంతరిక్ష నిర్మాణాన్ని భూమ్మీదకు ఎలా తీసుకొస్తారన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉపగ్రహాలు నిప్పులు చిమ్ముకుంటూ ఆకాశంలోకి వెళ్లడమేకాదు.. అదే స్థాయిలో తిరిగి.. భూ వాతావరణంలోకీ ప్రవేశిస్తాయి. 2031లో ఈ భారీ ప్రయోగశాల ఇలా నిప్పులు చిమ్ముకుంటూ భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పేలిపోకుండా దాన్ని.. జాగ్రత్తగా పసిఫిక్ మహాసముద్రంలో ఎంపికచేసిన ప్రదేశంలో పడేలా చేయడమే ఇప్పడు శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది.
క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త..
ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డు, డెబిడ్ కార్డులపై తరచూ పేమెంట్స్ చేస్తున్నారా? ప్రతీసారి సీవీవీ ఎంటర్ చేయాలని అడుగుతుందా? అయితే, ఇక ఆ కష్టాలు తొలగిపోనున్నాయి.. ఎందుకంటే.. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాడేవారికే శుభవార్త చెప్పింది పేమెంట్స్ దిగ్గజం వీసా.. ఆ కార్డుల ద్వారా చేసే పేమెంట్లకు ఇకపై సీవీవీ అవసరం లేదని స్పష్టం చేసింది.. కార్డు హోల్డర్ వెరిఫికేషన్ వాల్యూనే సీవీవీగా చెప్పుకుంటారు.. సాధారణంగా క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ నిర్వహించాలంటే ఆన్‌లైన్‌లో సీవీవీ నంబర్ ఎంటర్ చేయడం తప్పనిసరి.. లేదంటే పేమెంట్స్ చేయడం సాధ్యం కాదు.. ఆన్‌లైన్‌లో ఏ పేమెంట్ చేసినా సీవీవీ అవసరం.. చివరకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలోనూ పేమెంట్ కోసం సీవీవీ పొందుపర్చాల్సిందే.. కానీ, ఇక, ఆ కష్టాలు తొలగిపోనున్నాయి.. మొత్తంగా వీసా సీవీవీ రహిత చెల్లింపులు, ఆన్‌లైన్ లావాదేవీలను మరింత సులభతరం చేస్తాయని అంచనా వేస్తున్నారు.. వీసా టోకనైజ్డ్ కార్డ్‌ల కోసం సీవీవీ-రహిత చెల్లింపులను ప్రారంభించింది వీసా.. ఆన్‌లైన్ లావాదేవీలు ఇప్పుడు సులభంగా చేయవచ్చు.. వీసా టోకనైజ్డ్ కార్డ్‌ల కోసం సీవీవీ రహిత చెల్లింపులను ప్రారంభించింది.. డిజిటల్ చెల్లింపు పరిష్కార ప్రదాత అయిన వీసా, భారతదేశంలో దేశీయ టోకనైజ్డ్ ఆధారాల కోసం సీవీవీ రహిత ఆన్‌లైన్ లావాదేవీలను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలోకి కొత్త సంస్థ.. ఇక, స్విగ్గీ, జొమాటోకు చుక్కలే..!
వంటగదికి బైబై చెప్పేస్తున్నారట.. నచ్చిన హోటల్‌కి, మెచ్చిన చోటుకు వెళ్లి తినడం కూడా మానేస్తున్నారట.. బయటకు వెళ్లినప్పుడు అలా లాగింజడం ఓ అలవాటు అయితే… మరోవైపు నచ్చిన ఫుడ్, మెచ్చిన హోటల్‌కు ఆర్డర్ పెట్టి.. పనిచేసే సంస్థ దగ్గరకు లేదా ఇంటి దగ్గరకే తెప్పించుకుని తినేస్తున్నారు.. క్రమంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆధారపడేవారికి సంఖ్య పెరుగుతూ వస్తుంది.. మొదట్లో మంచి ఆఫర్లు, డిస్కౌంట్లతో ఆకట్టుకున్న ఫుడ్ డెలివరీ సంస్థలు.. ఆ తర్వాత వడ్డిస్తున్నాయి.. అయితే, ఫుడ్ డెలివరీ విభాగంలో ఇప్పటికీ స్విగ్గీ, జొమాటో మధ్య పోటీ నడుస్తూనే ఉంది.. కొన్నిసార్లు ఆఫర్‌లు ఇస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రభుత్వ రంగ సంస్థ కూడా అడుగుపెడుతోంది.. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) వేదిక సరికొత్త సవాల్ విసురుతోంది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఈ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో చాలా తక్కువకే ఫుడ్ డెలివరీ చేస్తుంది.. నివేదికల ప్రకారం.. ఇది ఇటీవల 10,000 రోజువారీ ఆర్డర్ మార్కును అధిగమించింది మరియు ప్రజలచే విస్తృతంగా ఉపయోగించబడుతోంది. గత రెండు రోజులుగా, చాలా మంది వ్యక్తులు ONDC, Swiggy మరియు Zomato అందించే ఫుడ్ డెలివరీ ధరలను పోల్చి చూస్తున్న స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. మీరు ఈ ప్లాట్‌ఫారమ్ గురించి ఇంకా వినకపోతే.. ఆ అనుభవం తెలియకపోతే క్రమంగా అభివృద్ధి చెందుతున్న ఫుడ్ టెక్ ప్లాట్‌ఫారమ్ గురించి మరియు దానిని ఎలా యాక్సెస్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోండి..
ది కేరళ స్టోరీ సినిమాపై వర్మ రివ్యూ.. ఏమన్నాడంటే..?
సాధారణంగా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు మాట్లాడతాడు అని అభిమానులను అడిగితే .. అయితే వోడ్కా తాగినప్పుడు, లేదా వివాదం చేయాలనుకున్నప్పుడు అని టక్కున చెప్పేస్తారు.సరే, మన దగ్గర వివాదాలు లేకపతే.. వివాదాలు ఉన్న సమస్యలపై స్పందిస్తే సరి.. అనుకొనే టైప్ వర్మ. ఈ మధ్యనే నిజం అనే యూట్యూబ్ ఛానెల్ తో దర్శనమిచ్చి.. అబద్దాలకు బట్టలు ఇప్పదీస్తా.. వివేకా హత్య కేసులో నిజానిజాలు బయటపెడతా అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు అసలు నిజం ఏంటో సినిమాగా తీసి చెప్పు అని అడిగేస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. వర్మ, తాజాగా ది కేరళ స్టోరీ సినిమాపై రివ్యూ చెప్పుకొచ్చాడు. గత మూడు రోజులుగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడు ప్రభుత్వాన్ని గజగజలాడిస్తున్న ఈ సినిమాపై రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. “తమిళ మరియు మలయాళ హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాత గుజరాతీ, డైరెక్టర్ బెంగాలీ, అందరు కలిసి హిందీలో సినిమా తీస్తే.. అది అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుంది. ఇది నిజమైన పాన్ ఇండియా సినిమా .. ది కేరళ స్టోరీ” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ చూసిన అభిమానులు.. మొదటిసారి వర్మ పాజిటివ్ గా మాట్లాడడం చూస్తున్నాము అని కొందరు.. కర్ణాటక ఎలక్షన్స్ ప్రభావం అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. అయితే పాన్ ఇండియా అంటున్నాడు అంటే.. బావుందని చెప్తున్నాడు అని అనుకుంటా అని ఇంకొందరు అంటున్నారు. మరి ఈ సినిమా ముందు ముందు ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.