Anil Ravipudi: రాజమౌళి తర్వాత ఆ రేంజ్ క్రేజ్.. నిర్మాతల ఛాయిస్‌గా అనిల్ రావిపూడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ravipudi: తెలుగు చిత్రసీమలో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం నిర్మాతలకు అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఎస్.ఎస్. రాజమౌళి తర్వాత కమర్షియల్ హిట్ ట్రాక్ రికార్డ్‌ను కొనసాగిస్తున్న దర్శకుడిగా ఆయన పేరు వినిపిస్తోంది. కథలో కామెడీకి పెద్దపీట వేయడంతో పాటు, అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేసే అలవాటు కూడా నిర్మాతల్లో ఆయనపై మరింత నమ్మకాన్ని పెంచింది. కెరీర్ ప్రారంభంలో దిల్‌రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తో వరుస సినిమాలు చేసిన అనిల్ రావిపూడి, ఆ తర్వాత ఇతర ప్రముఖ నిర్మాతలతో కూడా చేతులు కలిపారు. ముఖ్యంగా బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ సినిమా సమయంలో నిర్మాత సాహు గారపాటితో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. అదే అనుబంధం ఇప్పుడు మరో సినిమాకు దారితీసింది. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి రూపొందిస్తున్న మల్టీస్టారర్ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై మంచి బజ్ కూడా ఏర్పడింది.
ఇదిలా ఉండగా, ‘పెద్ది’ నిర్మాత వెంకట సతీష్ కిలారుతో కూడా అనిల్ రావిపూడి మరో సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాత ఇప్పటికే భారీ అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కూడా ఒక సినిమాకు ఆయన అంగీకరించినప్పటికీ, ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఖరారు కాలేదు. ఇక మైత్రి మూవీ మేకర్స్‌తో కూడా అనిల్ రావిపూడి చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రి నవీన్‌తో చాలా కాలంగా సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. దీంతో రాబోయే రోజుల్లో సాహు గారపాటి, వెంకట సతీష్ కిలారు, మైత్రి మూవీ మేకర్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలతో వరుసగా సినిమాలు చేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read
మరోవైపు అనిల్ రావిపూడి తదుపరి హీరో ఎవరనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. బాలకృష్ణతో మరోసారి సినిమా చేయనున్నారనే వార్తలు వినిపిస్తుండగా, మెగాస్టార్ చిరంజీవితో కూడా కొత్త ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌లలో ఏది ముందుగా పట్టాలెక్కుతుందనేది ఆయన ఫైనల్ చేసే కథ, హీరో డేట్స్‌పై ఆధారపడి ఉండనుంది. వరుస విజయాలతో స్టార్ హీరోలు మాత్రమే కాదు, అగ్ర నిర్మాతలు కూడా అనిల్ రావిపూడితో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత బిజీ దర్శకుడిగా ఆయన మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు.
- Tags
- anil ravipudi
- cinema
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!