iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 18 Pro, iPhone 18 Pro Max Full Specs Leaked: యాపిల్ (Apple) తర్వాత రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు iPhone 18 Pro, iPhone 18 Pro Max గురించి దాదాపు పూర్తి వివరాలు లీక్ అయ్యాయి. ఈసారి కేవలం చిన్న చిన్న మార్పులతో కాకుండా.. కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, డిజైన్ వంటి అన్ని విభాగాల్లో భారీ అప్గ్రేడ్లతో ఈ ఫోన్లు రానున్నట్లు లీక్‌లు చెబుతున్నాయి. అయితే ఈ కొత్త ఫీచర్లతో పాటు.. ధర కూడా భారీగా పెరగనుంది. ప్రస్తుతం బయటకు వచ్చిన లీక్‌ల ప్రకారం పూర్తి వివరాలు ఇవే..
ప్రస్తుతం వస్తున్న లీక్‌ల ప్రకారం iPhone 18 Pro, iPhone 18 Pro Max మోడళ్లు సెప్టెంబర్ 12 ప్రాంతంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి స్టాండర్డ్ iPhone 18 మోడల్‌ను తర్వాత విడుదల చేసి, Pro మోడళ్లను ముందుగా మార్కెట్లోకి తీసుకరాబోతున్నట్లు సమాచారం. అలాగే యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా ఇదే ఈవెంట్లో లాంచ్ చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Uber-Rapido Merge: ఉబర్, రాపిడో విలీనం..? రవాణా రంగంలో ఊహించని ట్విస్ట్...
- Moto G Max: భారత్ లో మోటో జి మ్యాక్స్ విడుదల.. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్, 7,000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్స్ ఇవే
- విరాట్ కోహ్లీ వాడే 'హూప్' కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
- Realme P4s Lite: రియల్మీ P4s లైట్.. 7000mAh బ్యాటరీతో చౌకైన ఫోన్.. ఫీచర్లు అదిరిపోయేలా!
డిజైన్‌లో మార్పులు:
iPhone 17 Pro సిరీస్‌లోనే డిజైన్‌లో పెద్ద మార్పులు చేసిన యాపిల్.. iPhone 18 Pro సిరీస్‌లో పూర్తిగా కొత్త డిజైన్‌ను తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా వెనుక భాగంలోని కెమెరా మాడ్యూల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇక కొత్తగా డార్క్ చెర్రీ రెడ్, లైట్ బ్లూ, డార్క్ గ్రే వంటి కలర్ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉందని లీక్‌లు చెబుతున్నాయి. Pro Max మోడల్ గత వెర్షన్‌తో పోలిస్తే సుమారు 0.25 మి.మీ మందంగా, 7 గ్రాములు ఎక్కువ బరువుతో రానుంది.
డిస్ప్లే అప్‌గ్రేడ్:
ముఖ్యంగా స్క్రీన్ సైజుల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. iPhone 18 Proలో 6.3 అంగుళాల డిస్ప్లే, Pro Maxలో 6.9 అంగుళాల డిస్ప్లే వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి మెరుగైన LTPO+ డిస్ప్లే టెక్నాలజీను ఉపయోగించడం వల్ల స్క్రీన్ మరింత ప్రకాశవంతంగా, పవర్ ఎఫిషియెంట్‌గా ఉండబోతున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న Dynamic Island పరిమాణం సుమారు 35% వరకు తగ్గవచ్చని లీకులు పేర్కొన్నాయి.
కెమెరాలో భారీ మార్పు:
ఈసారి iPhone 18 Pro సిరీస్‌లో అతిపెద్ద అప్‌గ్రేడ్ కెమెరాలోనే ఉండే అవకాశం ఉంది. యాపిల్ తొలిసారిగా Variable Aperture Cameraను తీసుకురానున్నట్లు లీక్‌లు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఫిక్స్డ్ అపర్చర్ స్థానంలో.. లెన్స్‌లోకి ఎంత కాంతి రావాలో నియంత్రించే వ్యవస్థను అందించవచ్చు. దీని వల్ల తక్కువ వెలుతురులో మంచి ఫోటోలు రావడంతో పాటు, ఎక్కువ కాంతి ఉన్న ప్రాంతాల్లో ఓవర్ ఎక్స్పోజర్ తగ్గి వీడియోలు మరింత సహజంగా కనిపించే అవకాశం ఉంది. అలాగే పోర్ట్రెయిట్ ఫోటోల్లో బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ మరింత సహజంగా కనిపించవచ్చని తెలుస్తోంది. అపర్చర్ను యూజర్ మాన్యువల్‌గా మార్చుకునే అవకాశం ఉంటుందా.? లేక యాపిల్ ఆటోమేటిక్‌గా నియంత్రిస్తుందా.? అన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
2nm A20 చిప్:
పనితీరు పరంగా కూడా iPhone 18 Pro సిరీస్‌లో పెద్ద మార్పు కనిపించనుంది. ఇందులో TSMC 2nm టెక్నాలజీతో తయారైన Apple A20 చిప్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 3nm చిప్‌లతో పోలిస్తే ఈ కొత్త ప్రాసెసర్‌లో ఎక్కువ ట్రాన్సిస్టర్లు ఉండటంతో పాటు.. మెరుగైన పనితీరు, తక్కువ విద్యుత్ వినియోగం లభించే అవకాశం ఉంది. అలాగే TSMC యొక్క కొత్త WMCM టెక్నాలజీ ద్వారా మెమరీ, ప్రాసెసర్ మధ్య వేగవంతమైన కమ్యూనికేషన్ అందించవచ్చని సమాచారం.
బ్యాటరీ సామర్థ్యం:
iPhone 18 Pro Maxలో సుమారు 5,200mAh బ్యాటరీ వచ్చే అవకాశం ఉందని లీక్‌లు చెబుతున్నాయి. గత మోడల్లో ఇది సుమారు 5,088mAhగా ఉంది. అదే iPhone 18 Proలో బ్యాటరీ సామర్థ్యం 4,252mAh నుంచి 4,288mAh వరకు పెరగవచ్చని సమాచారం. కొత్త A20 చిప్, C2 మోడెమ్ కారణంగా బ్యాటరీ బ్యాకప్ కూడా గత మోడళ్లతో పోలిస్తే మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.
ధర ఎంత.?
ప్రస్తుతం iPhone 17 Pro ప్రారంభ ధర రూ.1,34,999, iPhone 17 Pro Max ప్రారంభ ధర రూ.1,49,999గా ఉంది. అయితే iPhone 18 Pro సిరీస్ ధర భారత్‌లో రూ.20,000 నుంచి రూ.30,000 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో కూడా ప్రస్తుతం ఉన్న ధరల కంటే 200 డాలర్ల వరకు పెరుగుదల ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. మెమరీ, స్టోరేజ్ చిప్‌ల ధరలు పెరగడం, తయారీ వ్యయం అధికం కావడం వల్ల యాపిల్ ఈసారి ధరలను పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
The iPhone 18 Pro colors will be stunning 👀
Are you upgrading? Which new color do you plan getting? pic.twitter.com/NecJYMcrvH
— Apple Cycle (@theapplecycle) July 25, 2026
తాజావార్తలు
-
RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
-
Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
-
‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
-
Matangini Hazra: జనాలు మరిచిపోయిన దేశభక్తురాలు.. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఈ వీర వనిత గురించి మీకు తెలుసా?
-
Bhopal: భోపాల్‌లో షాకింగ్ ఘటన.. భర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్లాక ప్రియుడితో స్టాల్‌కు వెళ్లిన ఇల్లాలు.. ట్విస్ట్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!