Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
- మూడో టీ20 మ్యాచ్‌లో తుఫాన్ హాఫ్ సెంచరీ
- వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు
- టీ20ల్లో అత్యంత పిన్న వయసులో ఫిఫ్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi World Record: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 16 ఏళ్లు నిండకముందే అంతర్జాతీయ క్రికెట్లో రెండు అర్ధశతకాలు సాధించిన మొట్టమొదటి బ్యాటర్‌గా (పూర్తి స్థాయి ఐసీసీ సభ్యత్వ దేశాలు) రికార్డులకెక్కాడు. హరారే వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో తుఫాన్ హాఫ్ సెంచరీ చేయడంతో ఈ రికార్డు అందుకున్నాడు. కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్ధశతకం బాదాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వైభవ్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. మొదటి టీ20 మ్యాచ్‌లో బుడ్డోడు ఫిఫ్టీ బాదిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయంగా చూస్తే.. నేపాల్‌కు చెందిన కుశాల్ మల్లా మాత్రమే 16 ఏళ్ల వయస్సు రాకముందే రెండు అర్ధశతకాలు చేసి ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పుడు పూర్తి సభ్యత్వ దేశాల జాబితాలో మాత్రం వైభవ్ సూర్యవంశీ ఒక్కడే ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఇప్పటివరకు టెస్టు హోదా కలిగిన ఏ దేశానికి చెందిన ప్లేయర్ కూడా 16 ఏళ్లకు ముందే రెండు అర్ధ శతకాలు చేయలేదు. దీంతో ప్రపంచ క్రికెట్లో మరో అరుదైన రికార్డును ఈ యువ బ్యాటర్ తన పేరిట లిఖించుకున్నాడు. తొలి టీ20లో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత పిన్న వయసులో ఫిఫ్టీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
Also Read
- BCCI Partners: బీసీసీఐతో చాట్‌జీపీటీ, క్యాంపా, ఎస్బీఐ లైఫ్ ఒప్పందం.. రూ.130 కోట్లకు పైగా డీల్!
- IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
- Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
- ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన స్మృతి మంధాన..
మూడో టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. అతడి ఊపు చూస్తే.. ఈజీగా సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో అవుట్ అయి పోయాడు. తొలి టీ20లో 19 బంతుల్లో 50, రెండో మ్యాచ్‌లో 9 బంతుల్లో 20 పరుగులతో బుడ్డోడు ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన 15 ఏళ్ల వైభవ్.. జింబాబ్వే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో కలిపి 151 రన్స్ చేశాడు. వైభవ్ మెరుపులతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
తాజావార్తలు
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురిపై మరో కేసు
-
Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
ట్రెండింగ్
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!