ప్రతీ రైతుకు న్యాయం చేస్తాం..
అకాల వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది.. ఆ నష్టాన్ని అంచనా వేసే పనిలో పడిపోయింది ప్రభుత్వం.. మరోవైపు.. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ.. వారిని ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు విపక్ష నేతలు.. అయితే, ప్రభుత్వం ప్రతీ రైతుకు న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. ప్రజల్లో గుర్తింపు కోసమే చంద్రబాబు రైతు యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు అమరావతి రైతుల విషయంలో కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.. అమరావతిలో పేదలకు స్థలాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ప్రకటించారు.. ఇక, అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు నష్ట పరిహారంపై ప్రత్యేక అధికారులను నియమించాం. ప్రభుత్వం ప్రతీ రైతుకు న్యాయం చేస్తుందన్నారు.. అలాగే, మణిపూర్ నుంచి ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చాం. ఇంకెవరైనా ఉంటే తీసుకువచ్చేందుకు ఏపీ భవన్ అధికారులతో టచ్‌లో ఉన్నామని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
సోమేష్ కుమార్‌కు కీలక పదవి.. ఉత్తర్వులు జారీ
తెలంగాణ ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం సీఎస్‌గా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్‌కు కీలక పదవి కట్టబెట్టారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. సీఎం ముఖ్య సలహాదారుగా సోమేష్ కుమార్‌ను నియమించారు.. దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ ప్రధాన సలహాదారుగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కేబినేట్ హోదాతో నియమించారు.. మూడు సంవత్సరాల కాలం పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు సోమేష్ కుమార్. కాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 2019 నుంచి బాధ్యతలు నిర్వహించిన ఆయన్ను.. ఏపీ క్యాడర్‌కి చెందిన అధికారిగా తెలంగాణ హైకోర్టు నిర్ధారిస్తూ తీర్పు వెలువరించడం.. ఆయనను ఏపీకి బదిలీ చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం జరిగిపోయాయి.. ఇక, ఆ తర్వాత సోమేష్ కుమార్ జనవరి 12న ఏపీలో రిపోర్టు చేశారు.. సీఎం వైఎస్ జగన్‌ను కూడా కలిశారు. అయితే.. ఇంతా జరిగి దాదాపు నెల రోజులైనా.. సోమేష్ కుమార్‌కు ఎలాంటి బాధ్యతలూ అప్పగించలేదు.. ఆయన విజ్ఞప్తి మేరకే ఏపీ సర్కార్ ఎలాంటి పోస్ట్ ఇవ్వలేదని ప్రచారం సాగింది.. ఇక, సోమేష్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.. ఆయన వీఆర్‌ఎస్‌కు ఏపీ సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.
దిశ మార్చుకున్న “మోచా తుఫాను”.. బంగ్లాదేశ్-మయన్మార్ వైపు కదలిక
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మోచా తుఫాన్’ భారతదేశాన్ని ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా ఒడిశాతో పాటు తూర్పు కోస్తా ప్రాంతాలపై ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని గతంలో భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) హెచ్చరించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మోచా తుఫాన్ దిశ మార్చుకుని, మయన్మార్(బర్మా) వైపు కదిలే అవకాశం ఉందని, ఇది గంటకు 148 కిలోమీటర్ వేగంతో ‘ చాలా తీవ్రమైన తుఫాన్’గా మారే అవకాశం ఉందని తాజాగా ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో మంగళవారం తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడిందని, ఇది సాయంత్రం నాటికి బలపడి వాయుగుండంగా, ఆ తరువాత మోచా తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. శుక్రవారం నాటికి ఇది తీవ్రరూపం దాల్చి గంటకు 148 కిలోమీటర్ల వేగంతో తీవ్రతుఫాన్ గా మారే అవకాశం ఉందని, ఇది యాంగూన్ సమీపంలోని మయన్మార్ తీరం వైపు వెళ్తుందని ఐఎండీ మంగళవారం తెలిపింది.
ఓటరు జాబితాలో మీ పేరుందా? ఇప్పుడు ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు
ఇంతకుముందు ప్రభుత్వ ఆధారిత సేవల కోసం.. ఆయా సంబంధిత కార్యాలయాలకు తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే.. కాలక్రమంలో వృద్ధి చెందుతున్న టెక్నాలజీ పుణ్యమా అని, ఇప్పుడు ఆ సేవలన్నీ ఇంకా సులభతంగా మారుతున్నాయి. కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేకుండా, ఇంట్లో కూర్చొనే ఆ పనుల్ని ముగించుకునే సౌలభ్యం క్రమంగా అందుబాటులోకి వస్తోంది. ఇందులో భాగంగానే.. ఓటరు జాబితాలో మీ పేరుని వెరిఫై చేసుకోవడానికి, ఇంట్లోనే సులభంగా చెక్ చేసుకోవచ్చు. అయితే.. ఇందుకోసం తప్పనిసరిగా ఓటరు ID లేదా దాని EPIC నంబర్ మీ వద్ద ఉండాలి. అలాగే.. మీ నంబర్‌ను ఆధార్ లేదా ఓటర్ ఐడీకి లింక్ చేయాలి. ఓటర్లందరికీ భారత ఎన్నికల సంఘం.. ఎలక్టర్ల ఫోటో గుర్తింపు కార్డు లేదా EPIC నంబర్‌ను జారీ చేస్తుంది. ఇది వ్యక్తి ఓటర్ ID కార్డ్‌లో ఉంటుంది. వారి ప్రత్యేక EPIC నంబర్ ద్వారా.. ఓటరు జాబితాలో తమ పేర్లను చెక్ చేసుకోవచ్చు. ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? లేదా? అని చెక్ చేసుకోవడానికి.. ముందుగా మీరు ఓటరు అధికారిక వెబ్‌సైట్ ‘nvsp’కి వెళ్లాలి. అనంతరం ఆ వెబ్‌సైట్‌లో ఎలక్టోరల్ రోల్‌లోని సెర్చ్‌పై క్లిక్ చేసి.. అందులో మీ పేరు, చిరునామా, వయస్సు, EPIC నంబర్, మొబైల్ నంబర్, నియోజకవర్గం వంటి మీ వివరాలను నమోదు చేయాలి. మొత్తం వివరాల్ని పొందుపరిచాక సెర్చ్ బటన్‌పై క్లిక్ చేస్తే.. మీ ప్రాంతానికి చెందిన ‘ఓటరు జాబితా’ మీ ముందు విండోలో కనిపిస్తుంది. అక్కడ మీరు మీ పేరునొ కనుగొనవచ్చు. ఒకవేళ ఎవరికైనా తమ EPIC నంబర్ తెలియకపోతే.. వారు తమ పేరు, పుట్టిన తేదీ, అసెంబ్లీ నియోజకవర్గం వంటి వారి వ్యక్తిగత వివరాల ద్వారాతోనూ ఓటరు జాబితాలో తమ పేరును చూసుకోవచ్చు.
భూమిపై క్రాష్ కాబోతున్న1360 కిలోల శాటిలైట్..
భూమిపై మరో శాటిలైట్ కుప్పకూలేందుకు సిద్ధం అవుతోంది. 1360 కిలోల శాటిలైట్ భూమిపై క్రాష్ కానుంది. యూరప్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించిన ‘‘ఏయోలస్’’ కృత్రిమ ఉపగ్రహం జీవితకాలం చివరి అంకానికి చేరుకుంది. 320 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరుగున్న ఈ అంతరిక్ష నౌక వేగంగా తన ఇంధనాన్ని కోల్పోతోంది. దాదాపుగా దాని ఇంధన నిల్వలు క్షీణించాయి. అయితే ఉపగ్రహానికి సంబంధించిన లేజర్ పరికరాలు ఇంకా పనిచేస్తున్నాయి. ఈ శాటిలైట్ కు చెందిన సైన్స్ పరికరాలను ఏప్రిల్ 30న నిలిపేశారు. ఎర్త్ ఎక్స్‌ప్లోరర్ రీసెర్చ్ మిషన్ కింద ఏయోలస్ శాటిలైట్ ను ఐదేళ్ల క్రితం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించింది. ప్రస్తుతం దానిలోని ఇంధనం పూర్తిగా క్షీణించింది. 320 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న ఏయోలస్ ఇప్పటికే భూమి పలుచని వాతావరణంలోకి ఎంట్రీ ఇచ్చింది. భూమి గురుత్వాకర్షణ శక్తి నెమ్మదిగా దీన్ని లాగేసుకుంటోంది. దీంతో పాటు సూర్యుడి నుంచి వచ్చే ప్లాస్మా తరగంగాలు భూమి వైపుగా దీన్ని మరింతగా నెడుతున్నాయి. ఇటీవల తీవ్రమైన సూర్యుడి కార్యకలాపాల వల్ల ఏయోలస్ ఎక్కువగా ఇంధనాన్ని వినియోగించాల్సి వచ్చింది.
ఫుల్‌గా మందేశాడు.. ఎద్దును ఎక్కి స్వారీ చేశాడు..
ఫుల్‌గా మందేసిన తర్వాత కొందరు కదలకుండా పడుకుంటారు.. మరికొందరు నా అంతే తోపే లేడు అంటూ చిందులు వేస్తాడు.. ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తుంటారు.. ఇలా చాలా మంది ప్రమాదాలు కొనితెచ్చుకున్నవారు కూడా లేకపోలేదు.. తాజాగా, ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియోలో ఓ యువకుడు తాగిన మత్తులో ఎద్దుపై స్వారీ చేస్తూ వీధుల గుండా హల్‌చల్ చేశాడు. రోడ్డుపై ఉన్న జనం ఆ యవకుడిని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు.. చాలమంది దూరంగా పరుగులు పెట్టారు.. తమిళనాడులో ఫేమస్ అయిన జల్లికట్టులో కూడా ఇలాంటి స్వారీ చూసి ఉండరు అంటూ మరికొందరు కామెంట్ పెడుతున్నారు.. తనకేమవుతుంద్న ఆలోచన లేకుండా ఏదో గుర్రంపై స్వారీ చేస్తున్నట్లుగానే.. ఎద్దుపై ఎక్కి స్వారీ చేశాడు ఆ యువకుడు.. దీంతో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం అతడిపై చట్టపరమైన చర్యలకు పూనుకుంది.. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్ తపోవన్ ప్రాంతంలో జరిగినట్లుగా గుర్తించారు.
ప్రీలుక్ ఇంప్రెస్ చేసింది… #VD12 రామ్ చరణ్ మార్కెట్ రేంజులో ఉంటుందా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైనప్ లో ఉన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘VD 1 2’. జెర్సీ లాంటి ఫీల్ గుడ్, మోడరన్ క్లాసిక్ మూవీని ఆడియన్స్ కి ఇచ్చిన గౌతమ్ తిన్నునూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇటివలే లాంచ్ అయ్యింది. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీలా, విజయ్ దేవరకొండకి పెయిర్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ స్పీ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఖుషి మూవీ అయిపోయాక సెట్స్ పైకి వెళ్లనున్న ‘VD 12’ నుంచి స్పెషల్ సర్ప్రైజ్ బయటకి వచ్చింది. విజయ్ దేవరకొండ బర్త్ డే కావడంతో సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ‘ప్రీలుక్’ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ప్రీలుక్ పోస్టర్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఒక స్పై లైఫ్ ఎప్పుడూ ఓపెన్ బుక్ కాదు, అది బిట్స్ అండ్ పీసెస్ గానే ఉంటుంది. అన్ని సంఘటనలని ఒక చోట చేరిస్తేనే అది ఒక పూర్తి కథవుతుంది. తమ ఐడెంటిటీని సొంత వాళ్లకి కూడా చెప్పుకోకుండా, దేశం కోసం యుద్ధం చేస్తున్న స్పై చుట్టే VD 12 కథ నడుస్తున్నట్లు ఉంది.
ఇండస్ట్రీలో మరో జంట విడాకులు.. ఎఫైర్స్ వలనే రెండు నెలలకే
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎన్ని రోజులు ఉంటాయి అనేది చెప్పడం ఎవరి వలన కాదు. ఎంతగానో ప్రేమించి, పెద్దవాళ్ళను ఒప్పించి, కోట్లు పెట్టి గ్రాండ్ గా వివాహం చేసుకుంటున్నారు. అయితే ఆ వివాహబంధంలో వాళ్ళు ఎన్నో రోజులు ఉండడం లేదు. పెళ్లి తర్వాత వచ్చే విబేధాలను తట్టుకోలేక విడాకులు తీసుకొని విడిపోతున్నారు. సినిమా స్టార్స్ మాత్రమే కాదు బుల్లితెర నటీనటులు కూడా అదే తరహాలో విడిపోతున్నారు. తాజాగా ఒక బుల్లితెర జంట ప్రేమించి పెళ్లి చేసుకొన్న రెండు నెలలకే తాము విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. తమిళ్ లో ప్రసారమయ్యే సిప్పినీల్ ముత్తు అనే సీరియల్ లో జంటగా కనిపించరు సంయుక్త- విష్ణు కాంత్. ఈ సీరియల్ లో పరిచయం.. ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్తా పెద్దలను ఒప్పించి పెళ్లిగా మారింది. ఇక ఈ జంట పెళ్లి చేసుకోవడంతో వారి అభిమానులు ఎంతగానో సంతోషించారు. అయితే వీరి పెళ్లి జరిగి ముచ్చటగా మూడు నెలలు కూడా కాలేదు. మేము విడిపోతున్నాం అంటూ ప్రకటించడం అందరిని షాకింగ్ కు గురిచేస్తోంది. మార్చిలో ఈ జంట వివాహం చేసుకున్నారు. మేలో విడిపోతున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలను డిలీట్ చేస్తూ.. తాము విడిపోతున్నట్లు పోస్ట్లు పెట్టారు. అయితే వీరు విడిపోవడానికి ఎఫైర్లు కారణమని చెప్పుకొచ్చారు. ” ఎఫైర్స్.. నిజమైన ప్రేమను సైతం ఫేక్ ప్రేమగా చూపిస్తాయి” అని విష్ణుకాంత్ పోస్ట్ చేయగా.. ” మై డియర్ హేటర్స్ .. ఒక మహిళను శక్తివంతంగా ఎదుర్కోలేనప్పుడు.. ఆమెపై నిందలు వేసి.. కించపరుస్తారు. ఇప్పటి నుంచి నా కొత్త జీవితం మొదలుకానుంది. ఒక పెద్ద డిజప్పాయింట్ తరువాత ముందుకు వెళ్ళడానికి నాకు కావాల్సిన ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీరి విడాకులు నెట్టింట వైరల్ గా మారాయి.