గోవాలో 7 వేలకు కొని… హైదరాబాద్ లో 18 వేలకు అమ్ముతున్నారు.. సీపీ వెల్లడి
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. ప్రధాన నిందితుడు నైజీరియన్ తో పాటు ఐదుగురిని సైబరాబాద్ SOT పోలీసులు అదుపులో తీసుకున్నారు. నైజీరియన్ కు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్ అదుపులో వున్నాడని పోలీసులు తెలిపారు. వారి వద్దనుంచి కోట్ల రూపాయల కొకైన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు. విదేశాల నుండి కొకైన్ తెచ్చి విక్రయిస్తున్న ముఠాగా పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడిందని తెలిపారు. నలుగురిని సైబరాబాద్ SOT పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరొక నైజీరియన్ పరారీలో ఉన్నాడని తెలిపారు. A2 నైజీరియాకి చెందిన గాబ్రియల్.. నైజీరియాకి వెళ్ళిపోయాడని తెలిపారు. ఈ ముఠాకి కింగ్ పిన్ చింతా రాకేష్ అని, గోవా నుంచి కొకైన్ తెచ్చి హైదరాబాద్ లో సప్లై చేస్తున్నాడని తెలిపారు. డ్రై ఫ్రూట్ బిజినెస్ లో లాస్ రావడంతో.. డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని అన్నారు. గోవాలో 7 వేలకు గ్రామ్ కొని, హైదరాబాద్ లో 18 వేలకు అమ్ముతున్నాడని వెల్లడించారు. ఒక కోటి 33 లక్షల విలువైన 303 గ్రామ్స్ కొకైన్, రెండు కార్లు, 5 సెల్ ఫోన్స్ సీజ్ చేశామని తెలిపారు. A4 సూర్య ప్రకాష్ ని పట్టుకోవడంతో ఈ ముఠా గురించి బయటపడిందని స్పష్టం చేశారు. కస్టమర్స్ ఎవరో గుర్తించే పనిలో ఉన్నామని, వారికి నోటీసులు ఇస్తామన్నారు. NDPS యాక్ట్ సెక్షన్ 27 ప్రకారం కష్టమర్స్ కి నోటీసులు ఇస్తామన్నారు. వాట్సాప్ ద్వారా కస్టమర్లను ఈ ముఠా సంప్రదిస్తుందని తెలిపారు. హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీలు హోస్ట్ చేసి… కంజ్యుమర్స్ ని పిలిచి అక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్నారని అన్నారు. నిందితుల వాట్సాప్ చాట్ లో కొంతమంది ప్రముఖ వ్యారవేత్తలు కూడా ఉన్నారని అది తెలిసి పోలీసులు షాక్ తిన్నారని తెలిపారు. కొకైన్ కి మార్కెట్ లో బాగా డిమాండ్ ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడికి సప్లై చేస్తూ కోట్లు సంపాదిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నష్టం వెనుక కేంద్రం కుట్ర..!
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నష్టాల వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె. రామకృష్ణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎంపీలను కలుస్తామని ప్రకటించారు.. విశాఖ ఉక్కు ఉద్యమం 810 రోజులకు పైగా జరుగుతోందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టిందని విమర్శించారు.. గత ఏడాది 913 కోట్ల రూపాయల లాభాలు వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ కు 2022-23లో 3049 కోట్లు నష్టం రావడం వెనక కేంద్రం కుట్ర ఉందని మండిపడ్డారు రామకృష్ణ. నష్టాల సాకు చూపి విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేందుకు నరేంద్ర మోడీ సర్కార్ పావులు కదిపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సమిష్టిగా గళం విప్పాలి.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కాగా, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రం ముందుకు సాగుతుండగా.. ఎలాగైనా అడ్డుకుని తీరుతామంటూ కార్మికులు ఉద్యమం చేస్తున్నారు.. వీరి ఉద్యమానికి కార్మిక, ఉద్యోగ సంఘాలతో పాటు.. రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతోన్న విషయం విదితమే.
చంద్రబాబు సవాల్.. వాలంటీర్ వ్యవస్థ రద్దుపై బహిరంగంగా చెప్పగలవా..?
వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానంటూ మహానాడులో చెప్పగలవా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. చంద్రబాబు ఉభయగోదావరి జిల్లాల పర్యటనపై స్పందించిన ఆయన.. నిన్న చంద్రబాబు పర్యటన దండగ అన్నారు.. 58 లక్షల మందికి కిసాన్ రైతులకు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం.. కానీ, చంద్రబాబు హయాంలో జరిగిన బషీర్‌బాగ్ ఘటన ప్రజలు మర్చిపోలేదన్నారు.. పంట నష్టం కూడా ప్రభుత్వం అందిస్తుంది … చిట్స్ వ్యాపారం చేసే వ్యక్తి వందల కొట్లు బ్లాక్ మెయిల్ చోట్ల అనేది వాస్తవం అన్నారు. ఓటుకు నోటులో దొరికి ఏపీకి పారిపోయిన వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.. పుష్కరాల సమయంలో 29మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు.. ఇప్పటికీ వారిని పరామర్శించలేదని మండిపడ్డారు.. ఆర్ధిక నేరాలు చేసే వారికి వత్తాసు పలుకుతున్నాడు.. బ్లూ మీడియా అని చంద్రబాబు మాట్లడం కరెక్ట్ కాదని హితవుపలికారు.. చంద్రబాబు పర్యటన రాజకీయ పబ్బం గడుపుకోవడానికే అని మండిపడ్డ భరత్.. కార్యకర్తలను రెచ్చగొట్టడానికేనా ఇక్కడికి వస్తున్నారని విమర్శించారు. వైయస్సార్ రైతులకు ఉచిత కరెంటు ప్రకటిస్తే.. విద్యుత్ తీగలు బట్టలు ఆరేసుకోవడానికేనంటూ వ్యాఖ్యానించిన వ్యక్తి చంద్రబాబు.. రైతుల కోసం సీఎం జగన్ పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే తడిచిన రంగు మారిన ధాన్యాన్ని సైతం మిల్లర్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టారు.. చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన భూదందాపై సిట్ ఏర్పాటు చేస్తే హైకోర్టు స్టే తెచ్చి అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే కొట్టేయడంతో అమరావతి భూ అక్రమాలు వెలుగులోకి రానున్నాయని తెలిపారు. ఇక, జగజ్జనని చిట్ ఫండ్స్ లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని.. ఖాతాదారుల సొమ్ముతో అదిరెడ్డి అప్పారావు సొంత ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు ఎంపీ మార్గని భరత్.
టెన్త్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలు విడుదల అయ్యాయి.. విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్ 2023 ఫలితాలను విడుదల చేశారు.. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు 6,64,152 మంది ఉండగా.. పరీక్షలకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య 6,09, 081గా ఉంది.. స్పాట్ వ్యాల్యుయేషన్ ఏప్రియల్ 19 నుంచి 26వ తేదీ వరకు పూర్తి చేశాం.. 8 రోజుల్లో స్పాట్ వ్యాల్యుయేషన్ పూర్తి చేశామని.. రికార్డు స్థాయిలో తక్కువ రోజుల్లోనే ఫలితాలను విడుదల చేస్తున్నట్టు తెలిపారు మంత్రి బొత్స.. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 72.26గా ఉంది.. గత ఏడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది.. మరోసారి బాలికలే పైచేయి సాధించారు.. బాలికల్లో ఉత్తీర్ణత 75.38 శాతంగా ఉండగా.. బాలురుల్లో ఉత్తీర్ణత 69.27 శాతంగా ఉంది.. దీంతో.. పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటారు బాలికలు.
టెన్త్ ఫలితాలు విడుదల.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పడంటే..?
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలను విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. మొత్తంగా 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. గత ఏడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది.. పదవ తరగతి ఫలితాల్లో ఈసారి కూడా సత్తా చాటారు బాలికలు.. ఈ ఏడాది బాలికల్లో ఉత్తీర్ణత 75.38 శాతం.. బాలురుల్లో ఉత్తీర్ణత 69.27 శాతంగా ఉంది.. ఇక, 933 స్కూళ్లల్లో వంద శాతం పాస్.. 38 స్కూళ్లల్లో సున్నా శాతం ఫలితాలు.. ఫలితాల్లో టాప్ లో పార్వతీపురం మన్యం జిల్లా 85 శాతం ఉత్తీర్ణత.. లాస్ట్‌లో నంద్యాల జిల్లా ఉత్తీర్ణత 60.39 శాతం.. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 95.25 శాతం ఉత్తీర్ణత ఉంది.. మరోవైపు ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ప్రకటించారు మంత్రి బొత్స.. దీని కోసం ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక, ఈ ఏడాది పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కోసం స్కూళ్ళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు మంత్రి బొత్స.. మరోసారి చదివి పాస్ అయ్యేందుకు ఈ క్లాస్‌లు దోహదపడతాయని తెలిపారు.. ఈ నెల 13వ తేదీలోగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ అవకాశం ఉందని తెలిపారు.. అయితే, గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత 5 శాతం పెరిగిందని తెలిపారు.. జీరో ఫలితాలు వచ్చిన స్కూళ్ల సంఖ్య కూడా తగ్గిందన్నారు.. గత ఏడాది 70 స్కూళ్లలో జీరో ఫలితాలు వచ్చాయని.. ఈ సారి ఆ సంఖ్య 38కి తగ్గిందన్నారు.. ఇదే సమయంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది.. 80.88 శాతం మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు పాస్ అయ్యారని పేర్కొన్నారు..
చంద్రబాబువి దొంగ పర్యటనలు.. రైతుల కోసం పుట్టానని నటిస్తున్నారు..!
చంద్రబాబు పర్యటనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని.. రైతులను అడ్డం పెట్టుకుని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. పంటలు నష్టానికి సంబంధించి ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది.. వాటి గురించి చంద్రబాబుకు తెలియదు అని ఎద్దేవా చేశారు. రైతుల బీమాకు సంబంధించి ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది.. చంద్రబాబు హయాంలో ఏ ఏ రైతు ప్రీమియం చెల్లిస్తారో ఆ రైతుకే పంట బీమా వచ్చేదని విమర్శించారు. రైతులందరికీ బీమా ద్వారా రక్షణ కల్పించాలనే లక్ష్యంతో ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారని వెల్లడించారు. రైతుల కోసం పుట్టానని చంద్రబాబు నటిస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు కాకాణి.. బాబు హయాంలో రైతులు ఎవరూ సంతోషంగా లేరన్న ఆయన.. మనదేశంలో అమలు చేస్తున్న పంటల బీమా పథకాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేసేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.. రంగు మారిన ధాన్యాన్ని కొనాలని ముఖ్యమంత్రి ఇప్పటకే ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని రెండు వేల రైతు భరోసా కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలుకు శ్రీకారం చుట్టామని ప్రకటించారు.. చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు దొంగ పర్యటనలు చేస్తున్నారు.. కొందరు రైతులు వాస్తవాలు మాట్లాడుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు.. అందుకే టీడీపీ నేతలతో రైతుల వేషం వేయించి మాట్లాడిస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
ఇంతకన్నా తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ బైక్ రావటం కష్టమే
ఈ రోజుల్లో ఏ బైక్ రేటు చూసినా కనీసం డెబ్బై ఎనభై వేలు చెబుతున్నారు. కానీ.. యులు అనే కంపెనీ.. విన్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ బైక్‌ని విడుదల చేసింది. ఈ బండి ధర కేవలం 55 వేల 555 రూపాయలు మాత్రమే కావటం విశేషం. ఈ టూవీలర్‌ని కొనుక్కోవాలనుకునేవాళ్లు 999 రూపాయల రిఫండబుల్ డిపాజిట్ కట్టి ప్రిబుకింగ్ చేసుకోవచ్చు. వచ్చే నెల నుంచి డెలివరీ లాంఛ్ కానుంది. ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ బైక్ త్వరలో మరిన్ని ప్రధాన నగరాల్లో కూడా రానుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. యులు కంపెనీ తొలిసారిగా రూపొందించిన ఈ పర్సనల్ టూవీలర్ ఇప్పుడు రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఒకటి.. స్కార్లెట్ రెడ్ కలర్ కాగా రెండోది మూన్ లైట్ వైట్ కలర్. ఈ వాహనంలో 984 పాయింట్ మూడు వాట్‌ల సామర్థ్యం గల లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. సింగిల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 68 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. మ్యాగ్జిమమ్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే.
గాంధీనగర్ గల్లీలో రషీద్ ఖాన్ హంగమా
ఆప్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ భారత్ లో గల్లీ క్రికెట్ ఆడాడు. గాంధీ నగర్ లో ఆయన భారత అభిమానులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో నెటిజన్లకు సైతం విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ 2023లో భాగంగా రషీద్ భారత్ కి వచ్చారు. గుజరాత్ టైటాన్స్ జట్టు రషీద్ ఖాన్ ను కొనుగోలు చేసింది. కాగా, శుక్రవారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ గెలుపులో రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. కాగా, ఈ మ్యాచ్ కి ముందు రోజు రషీద్ గల్లీ క్రికెట్ ఆడాడు. మ్యాచుల్లో తన బౌలింగ్‌లో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే అతను ఇక్కడ మాత్రం బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కొంత మంది యువకులు గల్లీలో క్రికెట్ ఆడుతూ కన్పించగా.. అక్కడ ప్రత్యక్షమైన రషీద్ ఖాన్.. అక్కడున్నా..అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. బ్యాటింగ్ చేసి అందరినీ అలరించాడు. మరి రషీద్ ఖాన్ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను ముఫద్దల్ వోహ్రా అనే వినియోగదారు తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. 26 సెకన్ల క్లిప్‌లో, రషీద్ ఖాన్ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గల్లీ క్రికెట్ ఆడుతున్నట్లు మనం చూడవచ్చు. అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ప్రజలు ఉత్సాహంగా వీడియోలు తీయడం మనం చూడొచ్చు. భారత అభిమానులతో గల్లీ క్రికెట్ ఆడుతున్న రషీద్ ఖాన్ అంటూ వీడియోకి క్యాప్షన్ జత చేశారు. ఐపీఎల్ లో తమ ఫెవరేట్ క్రికెటర్ ఇలా తమతో క్రికెట్ ఆడటంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తొలి స్థానానికి పాకిస్తాన్
మరో ఐదు నెలల్లో భారత్ వేదికగా జరుగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు ముందే పాకిస్తాన్ ఫుల్ జోష్ లో ఉంది. బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ టీమ్.. వన్డేలలో ఇప్పుడు వరల్డ్ నెంబర్ వన్ టీమ్ గా నిలిచింది. స్వదేశంలో న్యూజిలాండ్ ను వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడించింది. ఈ ఘనతను అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్.. 113 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పాకిస్తాన్ 113 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, భారత్ కూడా 113 పాయింట్లతోనే ఉండటం గమనార్హం. ఈ జాబితాలో భారత్ తర్వాత ఇంగ్లాండ్ (111), న్యూజిలాండ్ (107), సౌతాఫ్రికా (101) , బంగ్లాదేశ్ (95), శ్రీలంక (86), వెస్టిండీస్ (72) , అఫ్గానిస్తాన్ (71) లు టాప్ -10లో నిలిచాయి. పాకిస్తాన్ వన్డే చరిత్రలో ఐసీసీ వన్డే ర్యాంకింగులలో నెంబర్ వన్ స్థానాని చేరుకోవడం ఇదే తొలిసారి. 2005లో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ సిస్టమ్ ను తీసుకొచ్చింది. ఈ 18 సంవత్సరాలలో పాకిస్తాన్ బెస్ట్ ర్యాంక్ మూడో స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ జట్టు నెంబర్ వన్ జట్టుగా నిలిచింది. ఇంతకంటే ముందే 1991 ఆగస్టులో పాకిస్తాన్ వరల్డ్ నెంబర్ వన్ టీమ్ గా నిలిచింది. అప్పుడు కెండిక్స్ ఫార్ములా ప్రకారం ర్యాంకులను ఇచ్చేవారు. కానీ 2005 నుంచి ఐసీసీ ప్రకటిస్తున్న ర్యాంకులే అధికారికంగా నమోదవుతున్నాయి.
ఈ ఎల్లో క్లాసిక్ లో గెలుపెవరిదో..
ఐపీఎల్ లో అత్యధిక సార్లు ట్రోఫీలు నెగ్గిన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ ను అభిమానులు ‘ఎల్ క్లాసికో’గా అభివర్ణిస్తారు. ఈ సీజన్ లో ఇదివరకే ఒకసారి జరిగిన ఎల్ క్లాసికోలో చెన్నైదే పైచేయి అయింది. వాంఖెడేలో చెన్నై.. ముంబైని మట్టికరిపించింది. ఇక నేడు ముంబై బదులు తీర్చుకునే సమయం ఆసన్నమైంది. రోహిత్ సేన ఇవాళ మధ్యాహ్నం చెపాక్ స్టేడియంలో ధోని సేనతో తలపడనుంది. వాంఖెడే ఓటమికి ముంబై ఇప్పుడు చెపాక్ లో బదులు తీర్చుకుంటుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మ్యాచ్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఐపీఎల్ లో ధోనికి ఇదే చివరి సీజన్ (?) అన్న వాదనలు వినపడుతున్నాయి. దీనిపై ధోని ఎప్పటికప్పుడూ కొట్టిపారేస్తూనే ఉన్నా ఈ సీజన్ తర్వాత ధోని ఆడటం అనుమానమేనన్న వాదన బలంగా ఉంది. అయితే ముంబై – చెన్నైలు ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కు చేరుకుంటే మాత్రం మళ్లీ మరో రసవత్తర పోరును చూసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి దాదాపు అన్ని జట్లూ 9 మ్యాచ్ లు పూర్తి చేసుకుని పది మ్యాచ్ లు కూడా ఆడాయి. పాయింట్ల పట్టికలో చెన్నై.. 10 మ్యాచ్ లలో ఐదు గెలిచి ఐదింట ఓడి మూడోస్థానంలో ఉంది. చెన్నై ప్లేఆఫ్స్ కు చేరడం పెద్ద కష్టమేమీ కాదు. తర్వాత ఆడబోయే నాలుగింట్లో రెండు గెలిచినా ఆ జట్టుకు ఈజీగా ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది. ముంబై కూడా దాదాపు ఇదే తరహలో ఉంది. ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడిన రోహిత్ సేన ఐదు గెలిచి నాలుగింట్లో ఓడింది. ప్లేఆఫ్స్ చేరేందుకు ఆ జట్టుకు ఆర్సీబీ, పంజాబ్, రాజస్తాన్ లు అడ్డుతగలొచ్చు. ముంబైతో పాటు పైన పేర్కొన్న టీమ్ లు మరో రెండు మ్యాచ్ లు ఆడితే గానీ రోహిత్ సేన ప్లేఆఫ్స్ అవకాశాల గురించి చెప్పలేం. ముంబై – చెన్నైలలో ఏ జట్టు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించకున్నా వచ్చే సీజన్ లో ధోని – రోహిత్ ల ఎల్ క్లాసికో ను చూడటం డౌటే.
బాలుడితో టీచర్ రొమాంటిక్ ఛాటింగ్.. పేరెంట్స్‌కు తెలిసి..
తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్ద పీఠ వేశారు పెద్దలు. అలాంటి ఉన్నతస్థానంలో ఉన్న గురువులు తమ స్థాయి మరచిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు తరచూ ఎదురవుతూనే ఉన్నాయి. వావివరసలు మరిచిపోయి కామాంధులు చెలరేగిపోతున్నారు. తన కంటే చిన్న వాళ్లను లైంగికంగా వేధిస్తున్నారు. విద్య నేర్పాలిన గురువులే తన వద్ద చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటరు తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. తన వద్దకు ట్యూషన్ కోసం వచ్చిన ఓ పదో తరగతి విద్యార్థితో లేడీ టీచర్ రొమాంటిక్ చాటింగ్ చేసింది. ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే..తిరుచ్చి జిల్లాలోని దురైయూర్ సమీపంలోని ఉప్పిలియాపురానికి దేవి (40) అనే ఓ టీచర్.. దురయూర్ గ్రామంలో ఉంటుంది. ఆమె, పొద్దున సాయంత్రం ఇంటిదగ్గర ట్యూషన్లు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఆమె వద్దకు వచ్చే ఒక విద్యార్థి మీద ఆమె కన్ను పడింది. పదో తరగతి చదివే ఒక బాలుడిని తాను ముగ్గులోకి దింపింది. అతనితో అశ్లీల చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఈ విషయం ఆ స్టూడెంట్ పేరెంట్స్ కు తెలిసింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆ టీచరుపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా మొబైల్ చాటింగ్ చేసిన సంగతి వాస్తవమేనని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో దేవిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
గోపీచంద్ ‘రామబాణం’తో ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొల్లగొట్టాడంటే ?
మ్యాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయతీ జంటగా నటించిన తాజా చిత్రం రామబాణం. మాస్ యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న గోపీచంద్.. చాలా కాలంగా పెద్ద హిట్ కోసం చూస్తున్నాడు. గోపీచంద్ కు రామబాణం సినిమా మంచి విజయం తెచ్చిపెట్టాలని ఆయన ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. సినిమా శుక్రవారం విడుదలై మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. గతంలో తనకు లక్ష్యం, లౌక్యం వంటి మంచి హిట్స్ అందించి శ్రీవాసు డైరెక్షన్లో ఈ రామబాణం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఉన్నా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి కలెక్షన్స్ ని అందుకుందో ఓ సారి చూద్దాం. రామబాణం సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 840 థియేటర్లలో సినిమా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 620కి పైగా థియేటర్లలో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద రామబాణం 14.5 కోట్ల రేంజ్‌లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15.20 కోట్లుగా ఫిక్స్ చేసింది. తొలిరోజు రామబాణం సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అనుకున్న స్థాయిలో థియేటర్లలో ఆక్యుపెన్సీ నమోదు కాలేదు. థియేటర్ ఆక్యుపెన్సీ మార్నింగ్ షోలకు 18.72%, మధ్యాహ్నం షోలకు 22.83% మరియు ఈవినింగ్ షోలకు 20.61% నమోదైంది. ఇక నైట్ షోలకు కూడా లెక్కలు పెరిగినట్లు తెలుస్తోంది.