రాధ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. కారుతో తొక్కించి.. రాళ్లతో మోది..! ప్రకాశం జిల్లాలో హత్యకు గురైన రాధ కేసు కలకలం రేపుతోంది.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద హత్యకు గురైన రాధ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.. గ్రామంలో చౌడేశ్వరి అమ్మవారి తిరునాళ్ల కోసం వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వచ్చిన రాధ హత్య వెనుక ఉన్న కారణాలు ఏంటి? అనే విషయాలపై ఆరా తీస్తే సంచలన…
బీఆర్ఎస్కు బిగ్ రిలీఫ్.. ఈసీ నిర్ణయంతో..! కేంద్ర ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ రిలీఫ్ ఇచ్చే న్యూస్ చెప్పింది.. గతంలో చాలాసార్లు బీఆర్ఎస్ను కొన్ని గుర్తులు దెబ్బకొట్టాయి.. కారును పోలిన గుర్తులు బ్యాలెట్లో ఉండడంతో.. చెప్పుకోదగిన స్థాయిలో వాటికి ఓట్లు వచ్చాయి.. అదే సమయంలో బీఆర్ఎస్కు తగ్గిపోయాయి.. దాని మూలంగానే కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారయ్యాయి.. అయితే, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ వచ్చారు ఆ పార్టీ నేతలు.. ఇన్నాళ్లకు వారికి ఈసీ…
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి భద్రతను పెంచాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి 'వై' కేటగిరీ భద్రతను పొందేందుకు అర్హులైన భారత క్రికెట్ మాజీ కెప్టెన్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించనున్నారు.
విచారణకు రాలేను.. సమయం ఇవ్వండి.. సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ రోజు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకావాల్సి ఉంది.. ఎంపీ అవినాష్ రెడ్డికి 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ అధికారులు.. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించారు.. అయితే, ఈరోజు విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐకి విజ్ఞప్తి చేశారు…
గుడ్‌న్యూస్.. నేడే వారి ఖాతాల్లో రూ.10 వేలు మత్స్యకారులకు మరోసారి శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వరుసగా ఐదో ఏడాది…వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఈ ఏడాది లబ్ధి పొందనున్నారు.. వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15– జూన్ 14 కాలంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వ ఆర్ధిక సహాయం చేస్తూ వస్తుంది..…
కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్ తెలంగాణ సర్కార్ అభివృద్ధే ప్రధానంగా దూసుకుపోతుంది. దీంతో అంతర్జాతీయ కంపెనీలు విశ్వనగరం హైదరాబాదులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్‌కాన్ తెలంగాణలో తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. నేడు రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు…
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతిచెందినట్టు అధికారులు గుర్తించారు.. జిల్లాలోని కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగగా.. ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు.. తిరుమల నుండి తాడిపత్రికి వెళ్తున్న తుఫాన్ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 11 మంది ఉన్నట్టుగా తెలుస్తుండగా.. ఘటనా స్థలంలోనే ఏడుగురు మృత్యువాత…
సీఎం గెలిచాడు.. ఈ మంత్రులు ఓడారు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని విజయాన్ని అందుకుంది కాంగ్రెస్ పార్టీ.. అయితే, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యలు మాత్రం ఆది నుంచి తమ గెలుపుపై ధీమాతో ఉన్నారు.. ఖచ్చితంగా గెలుస్తాం.. ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్ మద్దతు కూడా అవసరం ఉండదనే చెప్పారు.. అలాంటి విక్టరీనే అందుకుంది కాంగ్రెస్ పార్టీ.. అయితే, కాంగ్రెస్ వేవ్‌లో మంత్రులకు కూడా ఓటమి తప్పలేదు.. సీఎం బసవరాజ్ బొమ్మై సహా…
పొత్తులపై పవన్ క్లారిటీ.. టీడీపీ నేతలను సీఎంను చేయడానికి జనసేన లేదు..! పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనసేన మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడిన పవన్.. సీఎం.. సీఎం అనే కేకలు వేస్తే ముఖ్యమంత్రి కాలేను. క్రేన్లతో గజమాలలు వేసే కన్నా.. ఓట్లు వేయాలి. ఓట్లు వేస్తేనే సీఎం అవుతామని గుర్తించాలని సూచించారు. ప్రజాశక్తిని ఓట్ల కింద మార్చుకోవాలంటే నా అంత బలంగా…
పొత్తులపై టీజీ వెంకటేష్ హాట్ కామెంట్లు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పొత్తులు, సీఎం పోస్టులపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. తాజాగా మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. అయితే, ఇప్పుడు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కూడా పొత్తుల వ్యవహారంలో హాట్ కామెంట్లు చేశారు.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై పర్సనల్ అటాక్ చేసి వైసీపీ ఈ…