AK 47: వెంకటేష్ ‘చిట్టిబాబు’ ల్యాండింగ్.. సంక్రాంతి కాదు, ఈసారి దసరాకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AK 47: సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ల్యాండ్‌మార్క్ కాంబినేషన్ విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న కుటుంబ కథా చిత్రం “ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (AK47)” ప్రచార పర్వం ధమాకాగా షురూ అయ్యింది. సినిమా అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెంచేసిన ఈ కాంబో, తాజాగా ప్రమోషన్ విషయంలో సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. చిత్రంలోని ప్రధాన పాత్రలు ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ ప్రేక్షకులను ఆ కథా ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు.
తాజాగా విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో వెంకటేష్ పోషిస్తున్న ‘చిట్టి బాబు’ పాత్రను చిత్రబృందం పరిచయం చేసింది. ఆప్యాయత, బాధ్యత, ప్రేమాభిమానాలను పునాదిగా చేసుకుని, కుటుంబాన్ని అంతటినీ ఒకే తాటిపై నడిపించే ఒక ఆదర్శవంతమైన ఇంటి పెద్ద పాత్రలో వెంకీ మామ మెరవనున్నారు. పాత్ర పరిచయ వీడియోలో వెంకటేష్‌తో పాటు శ్రీనిధి శెట్టి, నారా రోహిత్ కూడా సందడి చేశారు. నవ్వులు, అల్లరి, మనసును తాకే భావోద్వేగాల మేళవింపుగా ఈ సినిమా ఉండబోతోందని ప్రమోషనల్ గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ఇప్పటికే కుటుంబ కథా చిత్రాల్లో, కామెడీ టైమింగ్‌లో తనదైన ముద్ర వేసుకున్న వెంకటేష్‌కి ఈ ‘చిట్టిబాబు’ క్యారెక్టర్ కెరీర్ మైలురాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
- మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
- Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
- Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు 'మనమిత్ర' అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
ఈ పాత్ర తర్వాత శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ క్యారెక్టర్లను కూడా వరుసగా రివీల్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ తన స్వరాలతో మ్యాజిక్ చేయనున్నారు. ఈ “ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47” చిత్రం **2026 అక్టోబర్ 2న** గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తొలి ప్రచార చిత్రంతోనే బాక్సాఫీస్ వద్ద భారీ హంగామా సృష్టిస్తుందనే సంకేతాలిచ్చిన ఈ చిత్రం, థియేటర్లలో ఏ స్థాయి విజయాన్నిందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Punjab AAP Crisis: పంజాబ్‌లో ఆప్‌కు మరో భారీ షాక్.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
-
Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
Jain Monkhood: జడ్జి పరీక్షలో పాస్.. ఉద్యోగంలో చేరకుండానే సన్యాసం! వింటేజ్ కార్లు, బగ్గీలతో యువతికి ఘన వీడ్కోలు!
-
Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!