సీఎం జగన్‌ను కలిసిన అంబటి రాయుడు.. అందుకు తాను ఆసక్తిగా ఉన్నానని వెల్లడి..
క్రికెట్ అంబటి రాయుడు.. ఏపీ సీఎం వైఎస్ జగ్మోహన్‌రెడ్డిని కలిశారు.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌తో కలిసి వచ్చారు క్రికెటర్ అంబటి రాయుడు.. సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అంబటి రాయుడితో పాటు సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్ ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్ కూడా ఉన్నారు.. ఈ సందర్భంగా ఇటీవల తమ జట్టు గెలిచిన ఐపీఎల్ 2023 ట్రోఫీని సీఎం జగన్‌కు చూపించారు.. దీంతో, సీఎస్‌కే టీమ్‌ను అభినందించారు ముఖ్యమంత్రి జగన్.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు క్రికెటర్ అంబటి రాయుడు.. అతడి సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.. మరోవైపు.. సీఎస్‌కే టీమ్ సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని కూడా సీఎం జగన్‌కు బహుకరించారు రూపా గురునాథ్, అంబటి రాయుడు.. కాగా, ఐపీఎల్ 2023లో ఎంఎస్ ధోనీ సారథ్యం వహించిన సీఎస్‌కే టీమ్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది.. ఐదో సారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక, ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫైనల్ మ్యాచ్ ఆడి రాయుడు ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికాడు.. ట్రోఫీని కూడా అంబటి రాయుడు చేతుల మీదుగా అందుకుంది సీఎస్కే టీమ్.. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో క్రికెటర్ అంబటి రాయుడు సమావేశం కావడం ఇది రెండోసారి.. ఐపీఎల్ ఫైనల్‌కు ముందు సీఎంను కలిసిన రాయుడు.. ఇప్పుడు కప్ కొట్టిన తర్వాత ఆ కప్ తీసుకొచ్చి కలిశారు.. ఈ భేటీలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. అంబటి రాయుడు త్వరలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారంటూ ప్రచారం సాగుతోంది.
వారాహి యాత్రకు ముందు పవన్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రజల ఆకాంక్ష అదే..
వారాహి యాత్రకు ముందు జనసేన ప్రధాన కార్యదర్యి నాగబాబు ఆసక్తికర కామెంట్లు చేశారు.. పవన్ సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని నాగబాబు తాను విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.. సంఖ్యా బలాన్ని బట్టే సీఎం పదవి అంటూ ఇటీవలే పవన్ కల్యాణ్ స్పష్టం చేయగా.. నాగబాబు సీఎం పదవి ప్రస్తావనపై ఆసక్తికర చర్చ సాగుతోంది.. రాజకీయ విప్లవ శంఖారావం వారాహిగా అభివర్ణించిన ఆయన.. జనసేన జెండా పట్టి వారాహి వెంట నడుద్దాం.. చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం అని పిలుపునిచ్చారు.. ఏపీలో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే జనసేన పాలన రావాల్సిందే అన్నారు.. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిగానే వేలాది మందికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. పవన్‌కు ఏపీ సీఎం అనే శక్తిని అందిస్తే ఇంకెంతో ఉపయోగకరమైన సేవలు అందిస్తారనే భావన ప్రజల్లో బలంగా నాటుకుందని పేర్కొన్నారు. ప్రజాధనం ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా, అప్పులను అదుపు చేసి, అభివృద్ధి బాటలు వేయగల సమర్థత గల నాయకుడు పవన్ అన్నారు నాగబాబు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు కోసం శంఖారావం మోగించడానికి బయలు దేరుతోంది వారాహి అన్నారు.. వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోంది. జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, జనసేన శ్రేణులు సమిష్టిగా, సమాలోచనలతో వారాహి యాత్రను విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితులకు సంబంధించి ప్రజల్లో ఆలోచనాత్మకమైన చైతన్యం పెరుగుతోంది. ప్రజలంతా కలిసి మెలిసి జీవించే వాతావరణాన్ని సృష్టించడమే వారాహి యాత్ర ప్రధాన ధ్యేయం అన్నారు.. పవన్ కల్యాణ్‌కు మద్దతుగా జనసేన జెండా పట్టి వారాహి వెంట అడుగులు వేద్దాం. చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం అంటూ పిలుపునిచ్చారు జనసేన ప్రధాన కార్యదర్యి నాగబాబు.
ఏపీకి బీజేపీ పెద్దలు.. 10న నడ్డా, 11న అమిత్‌షా..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్‌కి రానున్నారు.. ఈనెల 10వ తేదీన శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా అధ్వర్యంలోభారీ బహిరంగ సభ నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది.. ఈ విషయాన్ని ఈ రోజు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారు.. దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరిగాయి.. జరుగుతున్నాయన్న ఆయన.. వైసీపీ అవినీతి, అక్రమాలను సభల ద్వారా ప్రజలకు వివరిస్తాం అన్నారు.. అభివృద్ధిలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న ఆయన.. పుట్టిన ప్రతిబిడ్డపై రెండు లక్షల రూపాయల అప్పు తెచ్చిన ఘనుడు సీఎం జగన్ అంటూ ఎద్దేవా చేశారు.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు.. ప్రతి పనిలోను అవినీతి, ప్రతి కంపెనీకి వైసీపీ కార్యకర్తలే యజమానులు అని విమర్శించారు.. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారని మండిపడ్డారు.. ఇక, జనసేనతో కలిసే ముందుకు వెళుతున్నాం అని స్పష్టం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్. మరోవైపు.. ఉద్యోగులను మోసం చేశారంటూ సీఎం వైఎస్ జగన్‌పై ధ్వజమెత్తారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి.. మాట తప్పను.. మడమ తిప్పను.. అన్న జగన్ హామీలు ఏమయ్యాయి? అని నిలదీశారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతను వైఎస్ జగన్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.. నెరవేర్చలేని హామీలను జగన్ ఎందుకు ఇచ్చారు..? అంటూ ప్రశ్నించారు విష్ణువర్ధన్‌రెడ్డి. కీలకమైన అనేక మంది నేతలతో పాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా శ్రీకాళహస్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. చిత్తూరు జిల్లా నేతలతో సమావేశం అనంతరం బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొంటారని వివరించారు విష్ణు వర్ధన్. ఇక, కేంద్రమంత్రి అమిత్ షా విశాఖ పర్యటన ఈనెల 11వ తేదీకి మార్పు చేయడం జరిగిందని, ఆ రోజు ఉదయం కోయంబత్తూరు బహిరంగ సభలో పాల్గొని అనంతరం విశాఖ సభలో పాల్గొంటారని బీజేపీ నేత సీఎం రమేష్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం జేపీ నడ్డా తిరుపతికి చేరుకుంటారని, ప్రధాని మోడీ పాలనలో జరిగిన అభివృద్ధిని 10వ తేదీ శ్రీకాళహస్తిలో జరిగే బహిరంగ సభలో నడ్డా వివరిస్తారని తెలిపారు.
ప్రజలను భ్రమలో పెట్టే కార్యక్రమమే ఈ నీళ్ళ పండుగ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సాగునీటి దినోత్సవాలపై బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 8 తర్వాత 9 మిస్ చేసి.. దశాబ్ది వేడుకలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి.. రుణ మాఫీ చేయలేదని ఆరోపణలు చేశారు. ప్రజలను భ్రమలో పెట్టే కార్యక్రమమే ఈ నీళ్ళ పండుగ అని విమర్శించారు. అసలు ఈ సెలెబ్రేషన్స్ చేసుకునే అర్హత మీకుందా? అని ప్రశ్నించారు. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే ఈ వేడుకలు నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇరిగేషన్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం 155 వేల 210 కోట్ల 86 లక్షలు ఖర్చు చేశారని.. కానీ ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించారనేది వారికే క్లారిటీ లేదని పొంగులేటి సుధాకర్ పేర్కొన్నారు. ఇరిగేషన్ లెక్కలన్ని తప్పుడుగా ఉన్నాయని, దీని వెనుకున్న మతలబు ఏంటని అడిగారు. ఎన్ని ఏకరాలకు కొత్తగా నీళ్లు అందించారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 84% బోర్ల ద్వారా నీటి పారుదల కొనసాగుతోందన్న ఆయన.. రాష్ట్రం ఏర్పడినప్పుడు 18 లక్షల బోర్లు ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య 26 లక్షలకు చేరిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల ద్వారా నీళ్లు ఇస్తే, బోర్ల సంఖ్య ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. కాళేశ్వరం గొప్పగా కట్టామని గప్పలు చెప్తున్న బీఆర్ఎస్ నేతలు.. మరి అక్కడెందుకు ఈ దశాబ్ది ఉత్సవాల సెలబ్రేషన్స్ చేయట్లేదని నిలదీశారు. కాళేశ్వరం నీళ్ళు ఎక్కడ పారుతున్నయో చెప్పాలని డిమాండ్ చేశారు.
వంతెన స్లాబ్, పిల్లర్ మధ్య చిక్కుకున్న బాలుడు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో వంతెన స్లాబ్, పిల్లర్ మధ్య చిక్కుకున్న 11 ఏళ్ల బాలుడిని రక్షించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గురువారం ప్రాణాలు కోల్పోయాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం రెస్క్యూ ఆపరేషన్‌కు నాయకత్వం వహించింది. బాలుడు తప్పిపోయిన రెండు రోజుల తర్వాత చిక్కుకున్న బాలుడిని రక్షించే ఆపరేషన్ బుధవారం ప్రారంభమైంది. బిక్రంగంజ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఉపేంద్ర పాల్ మాట్లాడుతూ.. వంతెన నుంచి బాలుడిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ సుమారు 12 నుంచి 14 గంటల పాటు కొనసాగిందని తెలిపారు. అంతకుముందు, బాలుడి తండ్రి శత్రుధన్ ప్రసాద్ మాట్లాడుతూ.. తన కొడుకు మానసిక స్థితి సరిగా లేదని, రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడని చెప్పాడు. బాలుడి కోసం వెతుకుతున్న సమయంలో, సోన్ నదిపై నిర్మించిన వంతెన స్తంభం నంబర్ 1 మరియు స్లాబ్ మధ్య అతను ఇరుక్కుపోయాడని ఒక మహిళ కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో అతడిని రక్షించేందుకు అధికార యంత్రాంగం కదిలింది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం ఎంతో శ్రమించి ఆ బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. వారి రోధన అక్కడి వారిని కలచివేసింది.
ఆఫ్ఘన్ మంత్రి అంత్యక్రియల్లో ఆత్మాహుతి దాడి.. 11 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు దాడితో దద్దరిల్లింది. ఈ వారం ప్రారంభంలో హత్యకు గురైన ఆఫ్ఘన్ మంత్రి అంత్యక్రియల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. బదక్షన్ ప్రావిన్స్ రాజధాని ఫైజాబాద్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. ఈ బాంబుదాడిలో 11 మంది మరణించగా.. 30 మంది గాయపడినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. ఆఫ్ఘన్ ప్రభుత్వం ఈ దాడిని ఖండించింది. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ లో పౌర ప్రభుత్వాన్ని పడగొట్టి, తాలిబాన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ దేశంలో పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు, తాలిబాన్లకు సవాల్ విసురుతున్నారు. పలు ప్రాంతాల్లో మసీదుల్లో దాడులకు తెగబడి వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీశారు. ముఖ్యంగా మైనారిటీలపై ఎక్కువగా దాడులకు తెగబడుతున్నారు. మంగళవారం రోజున ఒక ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలతో నిండిన కారును, బదక్షన్ ప్రావిన్స్ గవర్నర్ గా ఉన్న నిసార అహ్మద్ అహ్మదీ ప్రయాణిస్తున్న కారువైపు తీసుకెళ్లి పేల్చేశాడు. ఈ ప్రమాదంలో అహ్మదీ మరణించారు. ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బాధ్యలుగా ప్రకటించుకున్నారు. ఈ దాడిలో అహ్మదీ డ్రైవర్ కూడా మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. ఈ రోజు అహ్మదీ అంత్యక్రియల్లో ఫైజాబాద్‌లోని నబావి మసీదులో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఇదే సమయంలో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకుని దాడికి తెగబడ్డాడు.
ఆసీస్ బౌలర్ల ధాటికి.. చేతులెత్తేసిన ఇండియా ఓపెనర్లు..! వీరే ఆధారం
భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో మొదట ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు రఫ్పాడించారు. స్టీవెన్ స్మిత్(121), ట్రెవిస్ హెడ్(163) పరుగులు చేసి సెంచరీలతో అదరగొట్టారు. ఇక వార్నర్ (43) పరుగులు, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ (48) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేసి.. టీమిండియాకు భారీ ఆధిక్యాన్ని ముందుంచుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. రోహిత్ శర్మ (15), గిల్ (13) పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో భారత్ కష్టాల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన చటేశ్వర్ పుజారా.. కింగ్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.
రౌడీ హీరో సరసన బుట్టబొమ్మ.. ముద్దులకు ఈసారి హద్దులే లేవమ్మా..?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషీ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత వరుస లైనప్స్ పెట్టుకున్నాడు విజయ్.. గౌతమ్ తిన్ననూరి సినిమా ఒకటి.. గీత గోవిందం 2 ఒకటి లైన్లో ఉన్నాయి. డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వం వహించిన గీత గోవిందం సినిమా.. విజయ్ కెరీర్ లోనే గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించాడు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక నటించింది. ఇద్దరికీ ఈ చిత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక గీతగోవిందం కాంబో మరోసారి రీపీట్ కానున్న విషయం తెల్సిందే.. ఈ మధ్యనే పరుశురామ్ తో తన సినిమా ఉంటుందని విజయ్ అధికారికంగా ప్రకటించాడు. అయితే ఈసారి గీతా ఆర్ట్స్ బదులు.. దిల్ రాజు రంగంలోకి దిగాడు. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డేను తీసుకొనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. గీత గోవిందం లో విజయ్ కు, రష్మిక కు మధ్య ముద్దు సన్నివేశాలు గట్టిగానే ప్లాన్ చేశాడు పరుశురామ్. ఇక ఈ చిత్రంలో కూడా ఆ సీన్స్ బాగానే ఉంటాయని టాక్. ఇక ఈ సినిమాతో లెక్కేసుకుంటే.. బుట్టబొమ్మ జాబితాలో స్టార్ హీరోల సినిమాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరు కారంలో మహేష్ సరసన నటిస్తోంది పూజా.. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ లో సైతం పూజాను ఓకే చేసినట్లు సమాచారం.. ఈ రెండు కాకుండా ఇప్పుడు విజయ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ పట్టేసింది. నిజం చెప్పాలంటే గతేడాది నుంచి వరుస ప్లాప్స్ అందుకున్న హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇలా వరుస అవకాశాలను అందుకోవడం విడ్డురంగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
ఆ హీరో తో మల్టీ స్టారర్ సినిమా చేయాలనీ ఉంది..?
జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.మల్టీస్టారర్ మూవీ చేయాల్సి వస్తే కనుక మహేష్ బాబు తో కలిసి నటించాలని ఉందని ఆయన పేర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో రీమేక్ చేయాల్సి వస్తే కనుక దానవీర శూరకర్ణ మాత్రమే చేస్తానని ఎన్టీఆర్ చెప్పినట్లు తెలిపారు.అలాగే రాజమౌళి,వినయక్, కృష్ణవంశీ ఈ ముగ్గురి దర్శకులలో లలో ఎవరు మీకు బెస్ట్ అనే ప్రశ్నకు ఈ ప్రశ్న చాలా ఛండాలమైన ప్రశ్న అని ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. ఆ డైరెక్టర్లలో నాకు ముగ్గురూ ఇష్టమని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని ఎన్టీఆర్ అన్నారు. ఆ ప్రశ్నకు మాత్రం ఛాయిస్ లేదని ముగ్గురూ ముఖ్యమని ఆయన వెల్లడించడం జరిగింది.. ముగ్గురితో నాకు అద్భుతమైన అనుభవాలు ఉన్నాయని ఎన్టీఆర్ పేర్కొన్నారు. నాలోని యాక్టర్ ని ఆ ముగ్గురు డైరెక్టర్లు అద్భుతంగా చూపించారని ఆయన తెలిపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులతో ఎన్టీఆర్ కు మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ తో ఒకసారి పని చేసిన దర్శకులు మళ్లీ పని చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. లేడీ ఫ్యాన్స్ నన్ను స్లిమ్ గా చూడాలని కోరుకుంటున్నారని ఎన్టీఆర్ అన్నారు. ఆ తరం హీరోయిన్లలో నాకు శ్రీదేవి గారు చాలా ఇష్టమని ఆయన తెలిపారు. ఫేవరెట్ యాక్టర్ గా సీనియర్ ఎన్టీఆర్ ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టమని ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ తో చాలా బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ రేంజ్ ను పెంచేలా బిజినెస్ పరంగా వేరే లెవెల్ లో ఈ సినిమా ఉండనుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తుంది.