Disney Hotstar: క్రికెట్ అభిమానులకు ఓ OTT సంస్థ శుభవార్త తెలిపింది. జియో బాటలోనే నడిచేందుకు రెడీ అయింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఇంకా పండుగ చేసుకోవచ్చు. ఇప్పటికే ఐపీఎల్ లో ఫ్రీగా మ్యాచ్ లు చూసుకునేలా చేసిన జియో తరహాలోనే.. ఆ సంస్థ కూడా అలా వెళ్లడానికి ముందడుగు వేస్తుంది. ఇంతకీ ఆ ఓటీటీ సంస్థ ఏదంటారా..? మీరు ఇంతకు ముందు వాడే ఉంటారు. అదేనండీ డీస్నీ హాట్ స్టార్(Disney Hotstar). ఐపీఎల్ ను క్లాష్ చేసుకున్న జియో.. ఆ సంస్థకు ఎక్కువగా సబ్ స్క్రైబర్స్ అయ్యారు. దీంతో హాట్ స్టార్ కు సబ్ స్క్రైబర్స్ తగ్గిపోయారు. మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లన్నీంటినీ జియో సినిమాలో అందరికి ఉచితంగా ప్రచారం చేసింది. దీంతో ఎక్కువగా జియో వైపు చూశారు.
Read Also: Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాం..
అయితే అంతకుముందు ఐపీఎల్ మ్యాచ్ లను డిస్నీ హాట్‌స్టార్ (డిస్నీ+ హాట్‌స్టార్) కూడా ప్రసారం చేసింది. కానీ జియో పొందినంత ఆదరణను పొందలేదు. ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి సబ్‌స్క్రైబ్ చేసుకోవడం తప్పనిసరి చేయడంతో.. అందులో చూసే దానికన్నా స్కోర్ ను ఫాల్లో అయ్యేవారు. ఈ నేపథ్యంలో తాజాగా ముగిసిన 16వ సీజన్ ఐపీఎల్ టోర్నీ ద్వారా జియో సినిమా ద్వారా వీక్షించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్రీగా చూసుకునేందుకు వెసులుబాటు ఉండటంతో ఎక్కువ జియోకు సబ్ స్ర్కైబర్స్ అయ్యారు. దీంతో జియోసినిమా సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది.
Read Also: Perni Nani: వైఎస్ జగన్ మాట ఇచ్చారు.. అది రద్దు చేశారు..
అయితే తిరిగి మళ్లీ తమ సబ్ స్క్రైబర్స్ ను పొందాలనే నేపథ్యంలో డిస్నీ హాట్‌స్టార్ త్వరలో జరగబోయే ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్‌లను ఉచితంగా చూసే వెసులుబాటును కల్పిస్తోంది. జూన్ 8న ఇండియాలో క్రికెట్ మ్యాచ్‌లను వీలైనన్ని ఎక్కువ మంది వీక్షించేలా ఉచితంగా స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే జియో సినిమాలో ఐపీఎల్ మ్యాచ్ లు ఫ్రీగానే చూసేందుకు వెసులుబాటు కల్పించగా.. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ను కూడా ఉచితంగానే ప్రసారం చేస్తోంది. అయితే జియో సినిమా తరహాలో ఆసియా కప్, ICC ప్రపంచ కప్ టోర్నమెంట్‌లను ఉచితంగానే ప్రసారం చేసి జనాదరణ పొందాలని హాట్‌స్టార్ భావిస్తోంది.