మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, వన్డేలో ప్రపంచ మాజీ నంబర్ 1 బౌలర్ లోన్వాబో త్సోత్సోబే అరెస్టయ్యాడు. ఇతనితో పాటు థమీ సోలెకిలే, ఎథి మభలాటి అరెస్టయ్యారు. మ్యాచ్ జరుగుతుండగానే పోలీసులు వీరిని అరెస్టు చేశారు. 2015-16 రామ్‌స్లామ్ టీ-20 మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో వీరిని అరెస్ట్ చేశారు. ఈ క్రికెటర్లపై ఐదు అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు 2004 సంవత్సరపు అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తాయి. ఈ చట్టం ప్రకారం, క్రీడా పోటీల ఫలితాలను ప్రభావితం చేయడానికి లేదా క్రీడల పవిత్రతను దెబ్బతీయడానికి లంచాలు ఇవ్వడం లేదా తీసుకోవడం అనేది అవినీతికి ఉదాహరణ.
Read Also: Lucky Bhaskar : ఓటీటీలోనూ దూసుకుపోతున్న లక్కీ భాస్కర్..
2016 – 2017 మధ్య కాలంలో ఈ టీ20 టోర్నమెంట్‌లో మ్యాచ్‌లు ఫిక్స్ చేయడానికి ప్రయత్నించినందుకు క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA) ఈ ముగ్గురితో పాటు మరో నలుగురు ఆటగాళ్లపై నిషేధం విధించింది. ఈ కేసులో గులాం బోడి ఇప్పటికే జైలు శిక్ష అనుభవించగా.. జీన్ సైమ్స్, పుమి మట్షిక్వే 2021, 2022లో తప్పు ఒప్పుకున్నందుకు సస్పెండ్ పనిష్‌మెంట్ పొందారు. మరోవైపు.. లోన్వాబో త్సోత్సోబే, థమీ త్సోలేకిలే, ఎథీ మ్భలాటిలపై ఉన్న కేసులు 2025 ఫిబ్రవరి వరకు వాయిదా పడ్డాయి. మరో ఆటగాడు అల్విరో పెటర్సన్‌పై ఏ చర్యలు తీసుకున్నారనే విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం తెలియ రాలేదు. ఈ ఆటగాళ్లందరినీ క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA) రెండు నుంచి 12 సంవత్సరాల వరకు నిషేధించింది. 2000లో హన్సీ క్రోన్యే మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం జరిగిన తర్వాత అవినీతి నిరోధక చట్టం తీసుకువచ్చారు. క్రీడల్లో అవినీతికి పాల్పడిన ఆటగాళ్లపై ఈ చట్టం ఉపయోగించిన తొలి సందర్భం ఇదేనని భావిస్తున్నారు.
Read Also: IND U19 vs PAK U19: ఏంటీ బ్రో.. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేశావ్..!
హాక్స్‌గా పేరొందిన డైరెక్టరేట్ ఆఫ్ ప్రయారిటీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ (డీపీసీఐ) ఈ ఆరోపణలపై విచారణ చేపట్టింది. హాక్స్ సంస్థ క్రీడల పవిత్రతను కాపాడటం, అవినీతిని అంతం చేయడంపై ఫోకస్ పెట్టింది. విచారణ సమయంలో క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA) ఎలాంటి మ్యాచ్ ఫిక్స్ చేయబడలేదని స్పష్టం చేసింది. అయితే, గులాం బోడి ఇండియాకు చెందిన బుక్‌మేకర్ల సహాయంతో మూడు మ్యాచ్‌లను ఫిక్స్ చేయడానికి ప్రయత్నించాడని విచారణలో వెల్లడైంది. అయితే.. ఆ మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్ జరగలేదు.